కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం!

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెల‌కొంది. కిషన్‌రెడ్డి పెద్దన్నయ్య యాదగిరి రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 85 సంవ‌త్స‌రాలు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లోని తన నివాసంలో బుధవారం రాత్రి తుది శ్వాస్ విడిచారు. ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి కిషన్‌రెడ్డి తిమ్మాపూర్ చేరుకున్నారు. మ‌రోవైపు ప‌లువురు బీజేపీ నాయకులు యాదగిరి రెడ్డి మృతిపై సంతాపం వ్యాక్తం చేస్తున్నారు. […]

ఇస్మార్ట్ పోరికి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన యంగ్ టైగ‌ర్‌?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్‌` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోగా.. అక్టోబ‌ర్‌లో విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత ఎన్టీఆర్ స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. నందమూరి కళ్యాణ్‌రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ రూపొందించబోతున్నారు. ఏప్రిల్ 29వ తేదీ […]

నేటి నుంచి రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌..ఎప్ప‌టి వ‌ర‌కంటే?

ప్రాణాంత‌క వైర‌స్ అయిన క‌రోనా రోజురోజుకు వేగంగా విస్త‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన క‌రోనా సెకెండ్ వేవ్‌లో విశ్వ‌రూపం చూపిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా కొన‌సాగుతున్నా.. ఈ మ‌హ‌మ్మారి వారు, వీరు అనే తేడా లేకుండా అంద‌రిపై పంజా విసురుతూనే ఉంది. ఈ క్ర‌మంలోనే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మ‌ళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో కూడా సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు. కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోన్న నేపథ్యంలో మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధవ్‌ […]

ఏపీలో క‌రోనా బీభ‌త్సం..10 వేలకు చేరువ‌లో కొత్త కేసులు!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న ప‌ది వేల‌కు చేరువ‌లో న‌మోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]

ఓటీటీలో రాబోతున్న ర‌ష్మిక కొత్త సినిమా..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌!

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `సుల్తాన్‌`. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించారు. త‌మిళంతో పాటు తెలుగులోనూ తెర‌కెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. మిక్డ్స్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుద‌ల అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ప్ర‌ముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ డిస్నీ+హాట్ […]

`శ్రీరామనవమి`కి మంచి ట్రీట్ ఇచ్చిన నాగ‌శౌర్య‌!

టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య, ‌రీతు వర్మ జంటగా న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌రుడు కావ‌లెను`. లక్ష్మీ సౌజన్య ను దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు త‌దిత‌రులు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే ఈ రోజు శ్రీ‌రామ‌న‌వ‌మి సంద‌ర్భంగా.. నాగ‌శౌర్య అభిమానుల‌కు వ‌రుడు కావ‌లెను మేక‌ర్స్‌ మంచి ట్రీట్ ఇచ్చారు. […]

గుండు లుక్‌లో‌ రష్మిక..షాక‌వుతున్న అభిమానులు!

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు ప‌రిచయాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక‌.. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగులోనే కాదు.. క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ్ ఇలా అన్ని భాష‌ల్లోనూ ఆఫ‌ర్లు రాబ‌డుతూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. గుండు లుక్ లో ఉన్న ర‌ష్మిక ఫొటో ఒక‌టి ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన అభిమానులు, నెటిజన్లు ఒక్క‌సారిగా‌ […]

వెన‌క్కి త‌గ్గిన `జాంబిరెడ్డి` హీరో..`ఇష్క్​’ విడుదల వాయిదా!

`జాంబిరెడ్డి` సినిమాతో హీరోగా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన తేజ స‌జ్జా.. తాజా చిత్రం `ఇష్క్‌`. `నాట్‌ ఎ లవ్‌స్టోరీ` అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రంలో తేజ స‌జ్జాకు జోడీగా ప్రియా ప్రకాశ్‌ వారియర్ న‌టిస్తోంది. మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాను ఆర్.బి.చౌదరి సమర్పిస్తుండగా.. ఎన్వీ ప్రసాద్ , పారస్ జైన్,వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేస్తున్నట్టు గ‌త వార‌మే చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. […]

ఇస్మార్ట్ పోరితో నితిన్ రొమాంటిక్ రైడ్‌..అదిరిన ఫొటో!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజా చిత్రం `మాస్ట్రో`. హిందీలో సూప‌ర్ హిట్ అయిన `అంధాదున్` చిత్రానికి రీమేక్ ఇది. మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ఇస్మార్ట్ పోరి న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. త‌మ‌న్నా కీల‌క పాత్ర పోషిస్తోంది. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ రోజు శ్రీరామనవమి సంద‌ర్భంగా.. మాస్ట్రో చిత్రం నుంచి ఓ […]