బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ నటించిన ప్రతి చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాయి. భన్సాలీ పై ఇప్పుడు దీపికా అలిగిందని సమాచారం. దీనికి కారణం, భన్సాలీ లేటెస్ట్ సినిమా గంగూభాయ్ కథియావాడిలో తనకు లీడ్ రోల్ ఆఫర్ చేయకపోవడమే అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో గంగూభాయ్‌గా ఆలియా భట్ నటించింది. ఇప్పటికే విడుదల అయిన ఈ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. అయితే […]
Tag: Latest news
`రంగ్ దే` కలెక్షన్స్..నాల్గవ రోజు కూడా దంచికొట్టిన నితిన్!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, వెంకీ అట్లూరి కాంబోలో వచ్చిన తాజా చిత్రం `రంగ్ దే`. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మార్చి 26న అంటే నిన్ననే ఈ చిత్రం థియేటర్లలో విడుదల అయింది. రొటీన్ కథే అయినప్పటికీ.. ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే అంశాలు మరియు ఎంటర్టైన్మెంట్ బాగానే ఉండటంతో.. బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్స్ రాబడుతోంది. మొదటి మూడు రోజుల్లో రూ. 10.11 […]
పెళ్లి విషయంలో మెహ్రీన్ కీలక నిర్ణయం..ఖుషీలో ఫ్యాన్స్!
మెహ్రీన్ కౌర్.. తర్వలోనే పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు, ఆదంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్నోయి కుమారుడు, కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయితో మెహ్రీన్ ఏడడుగులు నడవనుంది. ఇటీవలె వీరి నిశ్చితార్థం కూడా జైపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. దీంతో మెహ్రీన్ పెళ్లెప్పుడు జరుగుతుందా అని అందరిలోనూ ఆసక్తి నెలంది. అయితే తాజాగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది మెహ్రీన్. ఈ ఏడాది శీతాకాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ […]
బాక్సింగ్ ఇరగదీస్తున్న శ్రుతి హాసన్..వీడియో వైరల్!
శ్రుతి హాసన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కమల్ హాసన్ కూతురుగా సినీ ఎంట్రీ ఇచ్చిన శ్రుతి తెలుగు, తమళ మరియు హిందీ భాషల్లో నటించి.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక లాంగ్ గ్యాప్ తర్వాత `క్రాక్` సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రుతి సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ సరసన `సలార్` చిత్రంతో పాటు పలు ప్రాజెక్ట్స్‌లో కూడా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజగా శ్రుతి […]
తెలంగాణలో కొత్తగా 463 కరోనా కేసులు..రికవరీ ఎంతంటే?
అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాలకు పాకేసి ప్రజలను ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్రపంచదేశాలకు శత్రువుగా మారిన ఈ కరోనా మహమ్మారి.. ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో అని ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో కరోనా పాజిటివ్ […]
దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..భారీగా మరణాలు!
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలకు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన కరోనా.. మానవ మనుగడకే గండంగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలు పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేషన్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు నిన్న స్వల్పంగా తగ్గాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 56,211 మందికి కొత్తగా కరోనా […]
రష్మికకు రింగ్ పంపింది ఎవరబ్బా..ఆలోచనలో పడ్డ ఫ్యాన్స్!
రష్మిక మందన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరాలు లేద. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక.. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. తెలుగులో అల్లు అర్జున్ సరసన `పుష్ప`, శర్వానంద్ సరసన `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రాల్లో నటిస్తోంది రష్మిక. అలాగే త్వరలోనే `సుల్తాన్` సినిమాతో కోలీవుడ్‌లోకి, `మిషన్ మజ్ను` సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ బ్యూటీ. మొత్తానికి వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న రష్మికకు.. తాజాగా ఒక వ్యక్తి […]
రవితేజకు షాక్..ఆగిపోయిన `ఖిలాడి` షూటింగ్?
మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం `ఖిలాడి`. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హావీష్ ప్రొడక్షన్స్, బాలీవుడ్ కు చెందిన పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలె చిత్ర యూనిట్ ఇటలీకి వెళ్లింది. అక్కడ కొంత షూటింగ్ కూడా […]
ఒక్కో యాడ్‌కి త్రివిక్రమ్ పుచ్చుకునే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మొదట చిత్ర పరిశ్రమలో రచయితగా గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్.. `నువ్వే నువ్వే` అనే ప్రేమ కథా చిత్రంతో డైరెక్టర్‌గా టర్న్ అయ్యారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా చక్రం తిప్పుతున్న త్రివిక్రమ్..సినిమాలు మాత్రమే కాకుండా యాడ్స్ కూడా తెరకెక్కిస్తుంటారు. ఈయన రూపొందించి ఎన్నో యాడ్స్ ప్రేక్షకుల మదిని గెలుచుకున్నాయి. అందుకే సినిమాలే కాకుండా.. యాడ్స్ కూడా త్రివిక్రమ్‌తోనే చేయాలని అగ్ర హీరోలు పట్టుబడుతుంటారు. […]