వకీల్ సాబ్ సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన చేస్తున్న ప్రాజెక్ట్‌లో హరీష్ శంకర్ సినిమా ఒకటి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్నీ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని గత ఏడాడే ప్రకటించినా.. ఇందులో పవన్‌కు జోడీగా నటించే హీరోయిన్ ఎవరన్నది […]
Tag: Latest news
పుష్పరాజ్ కోసం రంగంలోకి చిరు..ఇక ఫ్యాన్స్‌కు పండగే?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంటే.. ఫహాద్ ఫాజిల్ విలన్‌గా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రెండు భాగాలుగా రాబోతోన్న ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి […]
మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య గుడ్‌న్యూస్..ఆ సీక్వెల్ మూవీతో..!?
నందమూరి బాలకృష్ణ తనముడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఎప్పటి నుంచో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా అదుగో ఇదుగో అంటున్నారు కానీ, మోక్షజ్ఞ మాత్రం కెమెరా ముందుకు రాలేదు. అయితే తాజాగా ఈ విషయంపై రియాక్ట్ అయిన బాలయ్య ఓ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పారు. తాజాగా ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడినా బాలయ్య.. తన సినిమాలతో పాటు మోక్షజ్ఞ ఎంట్రీపై ఓ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే మోక్షజ్ఞ ను ఇండస్ట్రీ […]
ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..67 మంది మృతి!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు నిన్న స్వల్పంగా తగ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,110 […]
ఏసీ కార్లలో తిరుగుతున్నారా..అయితే కరోనా ముప్పు ఎక్కువే!
ప్రస్తుతం కంటికి కనిపించని అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే సెకెండ్ వేవ్ కరోనా మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో ప్రతి రోజు భారీగా కరోనా కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలు బయట తిరగడం మానడం లేదు. ఏదో ఒక వంకతో బయటకు వస్తూనే ఉన్నాయి. అయితే బయట తిరగడం వల్ల కాకుండా.. ఏ వాహనంలో తిరుగుతున్నామన్న దానిపై […]
భారత్‌లో కరోనా మరణమృదంగం..నిన్నొక్కరోజే 6,148 మంది మృతి!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా భారత్‌లో కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న మాత్రం పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరగగా..మరణాలు భారీ సంభవించాయి. ఇక గత 24 గంటల్లో భారత్‌లో 94,052 మందికి […]
బాలయ్య పవర్ఫుల్ ప్రాజెక్ట్‌పై మైత్రీ అప్డేట్ అదిరింది!
ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి ప్రాజెక్ట్‌ను క్రాక్‌తో హిట్ అందుకున్న గోపీచంద్ మాలినేనితో చేయబోతున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అందరూ అందరూ భావించినట్టుగా ఈ పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ వారు కన్ఫార్మ్ చేశారు. నేడు బాలయ్య బర్త్‌డే సందర్భంగా.. ఈ ప్రాజెక్ట్ వివరాలను కూడా తెలియజేస్తూ..ఇంట్రో వీడియోను విడుదల చేశారు. ఈ ఇంట్రోలో సింహం వేటాడేందుకు సిద్ధమవుతోందని చూపిస్తూ […]
వామ్మో..ఫ్యామిలీ మ్యాన్ 2కు సమంత అన్ని కోట్లు పుచ్చుకుందా?
అక్కినేని వారి కోడలు సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి, సమంత కీలక పాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ ఇటీవలె అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అయింది. అయితే ఈ వెబ్ సిరీస్‌లో సమంత తన నటనా విశ్వరూపం చూపించింది. ఇందులో రాజీ అనే ఓ శ్రీలంకన్ రెబల్ పాత్రలో సమంత […]
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..ఘంటసాల రెండో కుమారుడు మృతి!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. లెజెండ్రీ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో తనయుడు ఘంటసాల రత్నకుమార్ మృతి చెందారు. గుండెపోటుతో గురువారం ఉదయం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన రత్నకుమార్.. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశారు. డబ్బిండ్ ఆర్టిస్ట్‌గా తనదైన ముద్ర వేసుకున్న రత్నకుమార్.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, సంస్కృత భాషల్లో 1090 సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ఎనిమిది గంటలపాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ ఆయన […]