తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో వింత సంస్కృతి కనిపిస్తోంది. మన రాష్ట్రం.. మన పాలన పేరుతో ఆవిర్భవించిన టీఆర్ ఎస్ అనతి కాలంలోనే రాష్ట్రాన్ని సాధించడంతోపాటు కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో టీఆర్ ఎస్ అధికారంలోకి కూడా వచ్చింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. టీడీపీ మూలాలున్న టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. ఇప్పుడు మళ్లీ టీడీపీ గూటి పక్షులకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారని, తెలంగాణ సాధన కోసం టీఆర్ ఎస్ లో పనిచేసిన వారిని గుర్తించడం లేదనే […]
Tag: KCR
తెలంగాణలో కమల నాథుల కలలు నెరవేరేనా?!
ఉత్తరాదిలో తమ పట్టును నిలుపుకొన్న బీజేపీ.. ఇప్పుడు 2019లో జరగబోయే ఏపీ, తెలంగాణల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. దక్షిణాదిలో ఒక్క కర్ణాటకలో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో అంతంత మాత్రంగా ఉండడంతో దక్షిణాది రాష్ట్రాలపై దృష్టిపెట్టిన బీజేపీ సారధి అమిత్ షా, ప్రధాని మోడీలు.. అటు తెలంగాణ, ఇటు ఏపీలలో నూ తాము సొంతంగా ఎదగాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే తెలంగాణలో తొలి మూడు రోజులు పర్యటించిన అమిత్ షా తన పర్యటనను విజయవంతం చేసుకునేందుకు […]
కేసీఆర్ సర్వేపై సొంత పార్టీలోనే లుకలుకలు!
తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ తన పాలన, మంత్రుల పనితీరు, ఎమ్మెల్యేల వ్యవహారశైలి వంటి ప్రధాన అంశాలపై చేయించిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్, ఆయన తనయుడు, ఐటీ మంత్రి కేటీఆర్‌కి ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారని సర్వే వెల్లడించింది. ఇక, మేనల్లుడు, మరో మంత్రి హరీశ్‌రావు పరిస్థితి ఫర్వాలేదు..అని సర్వే తెలిపింది. ఇక, టీఆర్ ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల పరిస్థితి దిగజారుతోందన్నట్టుగా సర్వే వివరించింది. ఇంత వరకు బాగానే […]
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రెంటికీ చెడ్డ రేవడేనా?
ఏపీ, తెలంగాణల్లో బలమైన శక్తిగా అవతరించి.. 2019లో కుదిరితే కప్పు కాఫీ.. అన్నట్టు.. వీలైతే అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ట్రై చేస్తున్న బీజేపీకి ఆదిలోనే హంసపాదులా ప్రజల్లో నమ్మకం చాలడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి ఆ పార్టీ చేస్తున్న, చేసుకుంటున్న ప్రచారమేననే వాదనా వినిపిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం… పనిగట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీని భారీ ఎత్తున ఉరుకులు పరుగులు పెట్టిద్దామని నాలుగు రోజుల పర్యటన కోసం తెలంగాణ, ఏపీలకు వచ్చిన కమల […]
టీఆర్ ఎస్‌లో సర్వే మంటలు.. ప్రజాదరణ కోల్పోతున్న నేతలు
2014లో ఓ ప్రభంజనం మాదిరిగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ ఎస్ పార్టీకి ముచ్చటగా మూడేళ్లు పూర్తయ్యాయి. మరో రెండేళ్లలో 2019 ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ ఇప్పటి నుంచే తన సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అదేసమయంలో ప్రజల్లో అధికార పార్టీకి, నేతలకు ఉన్న బలాబలాలను, అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో నే ఇటీవల నేతల పనితీరు ఆధారంగా సర్వే చేయించారు. గతంలోనూ ఒకసారి ఈ […]
తన సర్వేతో.. హరీశ్‌ని వెనక్కి నెట్టిన కేసీఆర్
తెలంగాణ అధికార పార్టీలో ఒకే కుటుంబం నుంచి మంత్రులుగా ఉన్న వారు కేటీఆర్, హరీశ్‌రావు. ఇద్దరూ కూడా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కి ఒకరు కొడుకు, మరొకరు మేనల్లుడు! అయితే, ఇటవల కాలంలో హరీశ్ రావు హవా పెరుగుతోందని కొన్ని ప్రైవేటు సర్వేలు చాటాయి. దీనికి మిషన్ భగీరథ, కాకతీయ మిషన్ వంటి కార్యక్రమాలు భారీగా తోడ్పడ్డాయని కూడా కథనాలు వచ్చాయి. ఇక, అదేసమయంలో.. కేసీఆర్ కుమారుడు, ఐటీ మంత్రి కేటీఆర్ ఒకింత వెనుకబడ్డారనే వార్తలు వచ్చాయి. […]
టీ కాంగ్రెస్‌లో ఆ ఇద్దరే మొనగాళ్లన్న కేసీఆర్ సర్వే
తెలంగాణ సీఎం కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు తీపి కబురు చెప్పారు. కేసీఆర్ ప్రతి మూడు నెలలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై సర్వేలు చేయిస్తున్నారు. తాజా సర్వేలో ఏం బాంబు పేల్చుతారో అని గుండెలు పట్టుకుని చూసిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ఈ సర్వే ఫలితాలు పెద్ద ఉపశమనం కలిగించాయి. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్ష సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి కేసీఆర్ ఈ సర్వే ఫలితాలు వెల్లడించారు. ఈ […]
కేసీఆర్‌కు యాంటీగా యూపీ సీఎం యోగి
తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కుతోంది! నాలుగు రోజుల కిందట బీజేపీ రథసారథి అమిత్ షా.. తెలంగాణలో మూడు రోజుల పర్యటన చేయడం, భారీ బహిరంగ సభ పెట్టడం, కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించడం, కేంద్రం లక్ష కోట్లకు పైగానే తెలంగాణకు సాయం చేసిందని చెప్పడం వంటి పరిణామాల నేపథ్యం.. వచ్చే ఎన్నికల్లో అధికారమే ధ్యేయంగా బీజేపీ నేతలు ముందుకు సాగుతుండడం వంటి విషయాల నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. అంతేనా? తెలంగాణ సీఎం, తెలంగాణ […]
ఇద్దరు చంద్రుల ఏకపక్ష ధోరణులు.. అల్లాడుతున్న నేతలు, అధికారులు
ఏపీ, తెలంగాణ సీఎంల ఏకపక్ష ధోరణులతో ఇరు రాష్ట్రాల్లోనూ అధికారులు, నేతలు అల్లాడి ఆకులు మేస్తున్నారట! థర్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ.. టెన్ ఇయర్స్ సీఎం ఎక్స్‌పీరియన్స్ అని చెప్పుకొనే ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ఉద్యమ సారధిగా రాష్ట్రాన్ని సాధించి రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన సీఎం కేసీఆర్ వ్యవహార శైలిలతో ఇరు రాష్ట్రాల్లోనూ చాపకింద నీరులా అసంతృప్తి రగులుతోంది. ఇంతకీ విషయం ఏంటో చూద్దాం.. తెలంగాణలో కేసీఆర్ హవాతో ఇతర పార్టీల నుంచి వచ్చి […]