కల్వకుంట్ల కవిత ఎందుకో రాజకీయాలకు దూరం?

కల్వకుంట్ల కవిత.. తెలంగాణలో హై ప్రొఫైల్ ఉన్న నాయకురాలు.. పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ కూతురు. ఆమె ఎక్కడికి వెళితే అక్కడ బ్రహ్మరథం పట్టే కార్యకర్తలు.. సీఎంకు కూడా ముద్దుబిడ్డ.. అటువంటి కవిత ఎందుకో కొద్ది నెలలుగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అభినందనలు, పరామర్శలు మాత్రమే చేస్తున్నారు. ఒకటి, రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నారు అంతే.. ట్వీట్లకు రీ ట్వీట్ చేయడం మాత్రమే చేస్తున్నారు. ట్విట్టర్ లో తప్ప న్యూస్ పేపర్, టీవీలలో ఎక్కువగా కనిపించడం లేదు. […]

బ్రేకింగ్: టీఆర్ఎస్ తో టీడీపీ పొత్తు

తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ ఉనికి ప్ర‌శ్నార్థ‌కంగా మారిపోయింది! రాష్ట్రం విడిపోయాక తీవ్రంగా న‌ష్ట‌పోయింది టీడీపీనే! అలాగే ఇప్ప‌టికే మినీ తెలుగుదేశంలా టీఆర్ఎస్ మారిపోయిందనేది విశ్లేష‌కుల అభిప్రాయం. ఓటుకు నోటు వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డిన ద‌గ్గ‌ర నుంచి టీఆర్ఎస్‌-టీడీపీ మ‌ధ్య‌ ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత‌లా ప‌రిస్థితి మారిపోయింది, మ‌రి ఉప్పు నిప్పు లాంటి పార్టీలు రెండూ క‌లిసి ప‌నిచేస్తాయని క‌ల‌లో కూడా ఊహించ‌లేం క‌దా!  కానీ ఇప్పుడు ఇలాంటి ప‌రిణామాలు రాబోతున్నాయ‌ట‌! వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ – టీడీపీతో బీజేపీ […]

గులాబీ దళంలో ఎమ్మెల్సీ గుబులు

గులాబీ పార్టీలో ఎమ్మెల్సీ ముచ్చ‌ట మొద‌లైంది. ఇప్పటివ‌రకూ పార్టీలో ఉన్న‌ వారు.. కొత్త‌గా ఎన్నో ఆశ‌ల‌తో  పార్టీల‌తో చేరిన వారితో ఆశావ‌హుల జాబితా అంత‌కంత‌కూ పెరుగుతోంది. రానున్న‌ నాలుగు నెలల్లో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. శాసన మండలిలో మార్చి 29న నాలుగు స్థానాలు, మేలో మరో 3 స్థానా లు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఎవ‌రి స్థాయిలో వారు అప్పుడే పైర‌వీల‌కు తెర‌తీశారు. త‌మ‌కూ అవ‌కాశం ఇవ్వాల‌ని టీఆర్ఎస్ అధినేత వ‌ద్ద‌కు క్యూ క‌డుతున్నారు. […]

కేసీఆర్ ఆత్మకథలో ఏముంది..!

తెలంగాణ ముద్దుబిడ్డ‌.. సీఎం కేసీఆర్.. త‌న రాజ‌కీయ జీవితానికి సంబంధించి ఆత్మ‌క‌థను అక్ష‌ర రూపంలో వెలుగులోకి తెస్తున్నార‌ట‌. ఇప్పుడు ఈ అంశంపైనే రాష్ట్ర‌వ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తోంది. సాధార‌ణంగా ఆత్మ‌క‌థ‌లు రాయ‌డం, పుస్త‌క రూపంలో తీసుకురావ‌డం కొత్త‌కాదు. మ‌హాత్మా గాంధీ మొద‌లుకుని అనేక మంది మేధావులు, మ‌హాత్ములు పుస్త‌కాలు రాశారు. కానీ, కేసీఆర్ కి వాళ్ల‌కి భిన్న‌మైన వాతావ‌ర‌ణం ఉంది. సొంత దేశంలో స్వ‌ప‌రిపాల‌న కోసం చేసిన పోరుగా కేసీఆర్ సాగించిన తెలంగాణ ఉద్య‌మం నేడు చ‌రిత్ర పాఠ‌మైంది! […]