రిజర్వ్ స్థానాల్లో సైకిల్ రివర్స్!

మొదట నుంచి రిజర్వడ్ స్థానాల్లో టీడీపీకి అంత కలిసిరాదనే చెప్పాలి…ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో మొదట నుంచి కాంగ్రెస్..ఆ తర్వాత వైసీపీ హవా కొనసాగుతూ వస్తుంది. గత ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో ఉన్న 29 ఎస్సీ స్థానాలు, 7 ఎస్టీ స్థానాల్లో వైసీపీ హవా కొనసాగింది. కేవలం టీడీపీ ఒకటి, జనసేన ఒక ఎస్సీ స్థానాన్ని మాత్రం గెలుచుకున్నాయి. మిగిలిన సీట్లు వైసీపీ కైవసం చేసుకుంది. అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు నిదానంగా మారుతున్నాయి. ఇప్పుడుప్పుడే టీడీపీ పుంజుకుంటుంది. […]

బాబు-పవన్ కోసం బండ్ల..!

సినీ రంగంలో బండ్ల గణేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు..హాస్య నటుడు దగ్గర నుంచి స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు..ఇక అప్పుడప్పుడు ఈయన సంచలమైన స్పీచ్ లు గురించి కూడా తెలిసిందే..ముఖ్యంగా పవన్ భక్తుడు అని చెప్పుకునే బండ్ల..పవన్ గురించి ఏ స్థాయిలో మాట్లాడతారో చెప్పాల్సిన పని లేదు. అయితే ఈయన సినీ రంగంలోనే కాదు..రాజకీయ రంగంలో కూడా బాగా సంచలనమనే చెప్పాలి. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరి ఈయన […]

శివాజీ సర్వే..పులివెందులలో కష్టపడాలట!

ఏపీ రాజకీయాల్లో నటుడు శివాజీ ఎప్పుడు ఏదొక విచిత్రమైన అంశాన్నే తెరపైకి తెస్తూ ఉంటారు..అసలు ఈయన రాజకీయం ఎవరి కోసం అనేది క్లారిటీ ఉండదు. కొన్ని రోజులు టీవీ డిబేట్లలో కనిపించి హడావిడి చేస్తారు…మళ్ళీ తర్వాత అడ్రెస్ లేకుండా వెళ్లిపోతారు. కమ్మ వర్గానికి చెందిన శివాజీ…పూర్తిగా చంద్రబాబుకు అనుకూలంగానే పనిచేస్తున్నారనే సంగతి అందరికీ అర్ధమవుతుంది. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన దగ్గర నుంచి..ఏదొకరకంగా టీడీపీని మళ్ళీ గెలిపించడానికి మాట్లాడుతూనే ఉన్నారు. ఇలా పరోక్షంగా టీడీపీ కోసం పనిచేస్తున్న […]

కమ్మ ‘ఫ్యాన్స్’ ఇక దూరమే!

ఏపీ రాజకీయాలపై కమ్మ, రెడ్డి వర్గాల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ప్రధాన పార్టీల అధ్యక్షులు ఈ కులాలకు సంబంధించిన నాయకులు కావడం వల్ల…ఆయా వర్గాల ప్రభావం ఎక్కువ ఉంటుంది. చంద్రబాబు కమ్మ వర్గం, జగన్ రెడ్డి వర్గం కావడంతో…టీడీపీకి కమ్మ వర్గం అనుకూలంగా, వైసీపీకి రెడ్డి వర్గం అనుకూలంగా ఉంటుంది. అయితే వైసీపీకి మద్ధతు ఇచ్చే కమ్మ వారు ఉన్నారు…టీడీపీకి సపోర్ట్ ఇచ్చే రెడ్డి వర్గం వారు ఉన్నారు. కానీ గత […]

సర్వే కిటుకు..అందుకే వైసీపీ హవా!

ఈ మధ్య వస్తున్న నేషనల్ సర్వేల్లో వైసీపీ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే..ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ వైసీపేకే అధికారం దక్కుతుందని నేషనల్ మీడియా సర్వేల్లో తేలింది. అంటే నెక్స్ట్ కూడా తమదే అధికారమని వైసీపీ శ్రేణులు మంచి జోష్ లో ఉన్నాయి. ఇంకా తమకు తిరుగులేదని అనుకుంటున్నారు. అవును సర్వేలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది…ఇటీవల వచ్చిన ఇండియా టీవీ సర్వేలో వైసీపీకి 19, టీడీపీకి 6 ఎంపీ సీట్లు వస్తాయని తేలింది. అలాగే ఇండియా టుడే […]

ఆ రూల్‌కు బాబు బ్రేక్?

రాజకీయాల్లో ఎవరికైనా ప్రధాన లక్ష్యం ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం…అందుకోసం నేతలు ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో ముందుకొస్తారు…ఆ వ్యూహాలు సక్సెస్ అయితే ఇబ్బంది లేదు…కానీ కొన్ని సార్లు ఫెయిల్ కూడా అవ్వొచ్చు..గత ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహాలు దారుణంగా ఫెయిల్ అయ్యాయని చెప్పొచ్చు. మళ్ళీ గెలిచి అధికారంలోకి రావాలన్న బాబు ఆశలు నెరవేరలేదు. జగన్ వ్యూహాలు ముందు బాబు నిలబడలేకపోయారు. బాబు వేసిన వ్యూహాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి…టీడీపీ అధికారానికి దూరమైంది. అయితే ఈ సారి అలా చేయకూడదని […]

పవన్ పాలిటిక్స్…నో క్లారిటీ?

పవన్ కల్యాణ్ చేసే రాజకీయంపై ఏ మాత్రం క్లారిటీ ఉండటం లేదు…అసలు ఆయన జనసేన బలోపేతం కోసం పనిచేస్తున్నారా? లేక టీడీపీని గెలిపించడం కోసం పనిచేస్తున్నారా? అనేది తెలియడం లేదు. మొదట నుంచి పవన్…టీడీపీకి అనుకూలమైన రాజకీయాలే చేస్తున్నట్లు కనిపిస్తున్నారు…టీడీపీ చేసే తప్పులని పెద్దగా ప్రశ్నించరు. ఇక వైసీపీని ఎప్పుడు టార్గెట్ చేస్తూనే ఉంటారు. అధికారంలోకి వచ్చాక మరింత ఎక్కువ గా జగన్ ని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. ఈ స్థాయిలో పవన్ ఎప్పుడు చంద్రబాబుని విమర్శించలేదు. […]

జగన్-బాబు: ఎవరి డప్పు వారిదే..!

ఏపీ నాయకులకు రాజకీయం చేయడానికి ఏ స్టేజ్ అయిన ఓకే అన్నట్లు ఉంది…అసలు తాము ఎక్కడైనా రాజకీయమే చేస్తాం అన్నట్లుగా నేతల తీరు ఉంది…అలాగే తమని తాము పొగుడుకోవడం, ప్రత్యర్ధులని తిట్టడం. ఇదే పని మీద ఉన్నారు. అయితే విచిత్రంగా తాజాగా ఆగష్టు 15 వేడుకలని సైతం…సొంత డప్పు కోవడం వాడేసుకున్నారు…చంద్రబాబు, జగన్.. సాధారణంగా ఏ సభలోనైనా ఈ ఇద్దరు నేతలు చేసేది ఒకటే అని, కానీ ఆగష్టు 15 వేడుకల్లో కూడా ఇలా చేయడంపై జనం […]

గిద్దలూరులో ‘ఫ్యాన్స్’ కుమ్ములాట!

గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేల్లో అన్నా రాంబాబు రెండోస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే…జగన్ తర్వాత ఈయనకే భారీ మెజారిటీ వచ్చింది..పులివెందులలో జగన్ 90 వేల ఓట్ల పైనే మెజారిటీతో గెలిస్తే…గిద్దలూరులో రాంబాబు 80 వేల ఓట్ల పైనే మెజారిటీతో గెలిచారు…మరి ఇంత భారీ మెజారిటీతో గెలిచిన రాంబాబు..అంతే భారీ స్థాయిలో ప్రజలకు అండగా ఉంటున్నారా? అంటే పెద్దగా ఉండటమే లేదనే చెప్పొచ్చు. ఏదో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు గాని…ఈయన పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో […]