టీ కాంగ్రెస్‌కు రాహుల్ పర్యటన లాభమా… నష్టమా…?

రాహుల్ గాంధీ బస్సు యాత్ర… టీ కాంగ్రెస్‌కు మంచి బూస్టప్‌ ఇచ్చిందా? గులాబీ కంచుకోటను బ‌ద్దలు కొట్టే శ‌క్తి హ‌స్తానికి ఉందా? ఎన్నిక‌ల ఎజెండాను సెట్ చేయ‌డంతో పాటు స్థానిక సమస్యలను పరిష్కరిస్తామన్న హస్తం నేతల మాటలు అక్కడ ఓట్లు రాలుస్తాయా? ఇంతకి బ‌స్సు యాత్ర లక్ష్యం నెరవేరిందా? రాహుల్ బస్సు యాత్ర… తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ పెంచిందని పార్టీ నేతలు భావిస్తున్నారు. మూడు రోజులపాటు కొనసాగిన రాహుల్ టూర్ కాంగ్రెస్ ఇమేజ్‌ను మ‌రింత‌ పెంచిందని రాజకీయ […]

తెలంగాణలో స్పీడ్‌ పెంచిన కాంగ్రెస్‌

తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. త్వరలో అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించనుంది. తొలివిడతలో 50 శాతానికి పైగా అభ్యర్థులను ప్రకటిస్తామని కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే స్పష్టం చేశారు. అటు రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తున్న కాంగ్రెస్‌ పార్టీ.. గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై.. స్క్రీనింగ్‌ కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపింది. కచ్చితంగా గెలిచే వారికే కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు ఇవ్వనుంది. అటు.. టికెట్లు […]

టీడీపీతో ఏపీ కాంగ్రెస్ జ‌త‌.. అదిరిపోయే స్కెచ్ ఇదే..!

ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ఇప్పుడంటే త‌డ‌బాటులో ఉంది. కానీ, వాస్త‌వానికి సంస్థాగ‌త ఓటు బ్యాంకు మాత్రం ప‌దిలంగానే ఉంది. దీనికి కాస్త బూస్ట‌ప్ ఇస్తే.. పార్టీ పుంజుకోవ‌డం.. మ‌ళ్లీ పున‌ర్వైభ‌వం ఖాయ‌మ నేది పార్టీ నాయ‌కుల అభిప్రాయం. దీనికి కావాల్సింద‌ల్లా.. కొంత వ్యూహం.. మ‌రికొంత చొర‌వ‌. ఇవి రెండూ లేక‌పోవ‌డంతోనే పార్టీ గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ విఫ‌ల‌మైంది. బ‌హుశ‌..ఈ దిశ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ అధ్య‌క్షులుగా వ్య‌వ‌మ‌రించిన ర‌ఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్‌లు ప్ర‌య‌త్నించ‌లేదు. కేవ‌లం క్షేత్ర‌స్థాయిలో […]

ఎమ్మెల్యేల కొనుగోళ్లపై డ్యామేజ్ కంట్రోల్ స్కెచ్ వేసిన బీజేపీ…!

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో బీజేపీ ఇమేజ్ భారీగా దెబ్బతిన్నదా..? ఈ అంశం మునుగోడు ఉపఎన్నికపై ప్రభావం చూపనుందా..? అందుకే నష్ట నివారణ కోసం అధికార పార్టీపై ఎదురుదాడికి దిగుతోందా..? నడ్డా సభ రద్దు కూడా అందులో భాగమేనా..? దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారా..? బండి యాదాద్రి ప్రమాణంతో విషయాన్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారా..? అంటే అంతటా అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లో ఎమ్మెల్యేల కొనుగోళ్ల […]

మునుగోడులో మ‌హిళ‌ల‌ ఓట్లపైనే ఆ పార్టీ ఆశలు..!

మునుగోడులో మహిళలు తమ శక్తిని ఓట్ల రూపంలో చాటే అవకాశం వచ్చిందా..? వీరి ఓట్లపై అన్ని పార్టీలు నమ్మకం పెట్టుకున్నాయా..? ముఖ్యంగా ఒక ప్రధాన పార్టీ అతివల ఓట్లతోనే గట్టెక్కగలమని భావిస్తోందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మహిళలు ఓట్ల రూపంలో తమ చైతన్యాన్ని ప్రదర్శించాలని.. అదీ గంపగుత్తగా తమకే లాభించాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో ముందుగా నలిగిపోయేది.. విసిగిపోయేది అతివలే కనుక వారి తీర్పుపై ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ […]