ప్రస్తుతం రాజకీయాలపై దృష్టి కాస్త పక్కనబెట్టి రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చేపనిలో బిజీగా మునిగిపోయారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఇందులో భాగంగా పారిశుధ్యంపై అవగాహన ర్యాలీలు, దోమలపై యుద్ధం కార్యక్రమాలు కూడా పార్టీ తరపున ప్రభుత్వం తరపున గట్టిగానే చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్ధేశ్యం మంచిదే అయినా ఈ కార్యక్రమం అమలు చేయాల్సిన అధికారుల్లో ఆ స్థాయి స్పందన కనిపించడంలేదు.. అయితే ప్రజా ప్రతినిధులు.. ప్రచార కండూతితో, హడావుడి మాత్రం ఎక్కువగానే చేస్తున్నారు. నిజానికి ఎడతెరిపిలేని వర్షాలతో […]
Tag: chandra babu
బాలయ్య కోసం బాబు వైఎస్ కాళ్లు పట్టుకున్నారా.
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. సీఎం చంద్రబాబుపై మరింత ఫైరైపోయారు. పొలిటికల్‌గా తనకు బద్ధ శత్రువైన వైఎస్ కాళ్లను చంద్రబాబు పట్టుకున్నారని తీవ్ర సంచలన వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. ఈ మేరకు తాజాగా ముద్రగడ సీఎంకు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో పెద్ద పెద్ద డైలాగులతో పద్మనాభం విరుచుకుపడ్డారు. తుని ఘటన పేరుతో సీఐడీ అధికారులు వైకాపా నేత భూమన కరుణాకరరెడ్డి సహా పలువురిని విచారిస్తుండడంపై పరోక్షంగా కామెంట్లతో కుమ్మేశారు. 2014 ఎన్నిక […]
చంద్రబాబు రూమ్‌లో ప్రత్యక్షం అయిన జగన్
ఎంతటి రాజకీయ వైరమున్నా ఎన్నికల సమయంలో మినహాయిస్తే మిగిలిన సందర్భాల్లో.. అధికార, ప్రతిపక్ష నేతలు పరోక్షంగానైనా కాస్తో కూస్తో మర్యాదపూర్వకమైన సంబంధాలను నెరుపుతారు. అయితే ఏపీలో మాత్రం ప్రస్తుతం ఆ పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. సమీప భవిష్యత్తులోనూ సాధ్యమవుతుందన్న నమ్మకమూ కలగడం లేదు. టీడీపీ ప్రభుత్వం పై అంశాలతో సంబంధం లేకుండా విభేదిస్తున్న జగన్…చంద్రబాబు విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రభుత్వ పాలనలోని ఏ చిన్న లోపాన్ని వదలకుండా విరుచుకుపడుతున్నారు. విపక్ష నేత జగన్ వచ్చే ఎన్నికల్లో అధికార […]
తెలంగాణ దెబ్బకు జ్యోతుల,భూమా కుదేల్
సిగ్గుమాలిన నీచ రాజకీయాలు పరాకాష్టకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చేరిన తరుణం ఇది.నిస్సిగ్గుగా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే చందాగా,ఒక పార్టీ గుర్తు పై గెలిచి అధికార వాంఛతో,ధనార్జనే ధ్యేయంగా,అవినీతి బండారాల్ని కప్పి పుచ్చుకోవడానికి మన రాజకీయ నాయకులు చేస్తున్న నవతరం వ్యభిచార రాజకీయాలే ఈ పార్టీ ఫిరాయింపులు.ఈ రాజకీయవ్యభిచారం అభివృద్ధి అన్న ముసుగేసుకుని మరీ చేసేస్తున్నారు.సిగ్గు కే సిగ్గేస్తుందేమో వీళ్ళని చూస్తే. తాజాగా ఈ ఫిరాయింపు వీరులని ఇంకో మెట్టు ఎక్కించే ప్రయత్నాల్లో ఆంధ్ర […]
చంద్రబాబుకు దిమ్మతిరిగే ప్రశ్న వేసిన గవర్నర్
వర్తమాన రాజకీయాల్లో విలువలగురించి మాట్లాడటమంటే గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడమే. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ విపక్షాలను బలహీనపరచేందుకు అధికారంలో ఉన్న ఏ పార్టీ ఐనా తన శక్తియుక్తులన్నీ ధారపోస్తుండటం ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర. ఈ సంస్కృతికి బీజం వేసిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అంపశయ్య మీద ఉన్నా, అధికారంలో వెలిగిన సమయంలో ఇలాంటి విధానాలతోనే మనుగడ సాగిస్తూ వచ్చింది. ఇక ఇటీవలి రాజకీయాల్లోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఫిరాయింపు రాజకీయాలు ఏవగింపు కలిగించే […]
ఓటుకు నోటు కేసులో ఏం తేలనుంది..?
వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వేసిన పిల్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఓటుకు నోటు కేసుపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చ మొదలైంది. సుప్రీం ఆదేశాలు తమకే అనుకూలమని టీడీపీ, వైసీపీ నేతలు ఎవరికి వారు అన్వయించుకుని వ్యాఖ్యానిస్తుండగా మీడియాలోనూ దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై స్పందిస్తూ హైకోర్టు… ఏసీబీ కోర్టు విచారణను నిలిపివేయాలని ఆదేశిస్తూ 8 వారాలపాటు స్టే […]
ప్యాకేజీ పాఠాలు నేర్పనున్న చంద్రబాబు
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయం అని మాత్రమే ప్రకటన చేసినప్పటికీ, దాన్ని ప్యాకేజీగా చెప్పేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ అంతా ప్రజలకు పాఠాలు చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సన్నద్ధమయ్యారట. ఓ వైపున పార్టీల పరంగా టిడిపి, బిజెపి ఇప్పటికే ప్యాకేజీ అనబడే సాయంపై ప్రచారం మొదలు పెట్టాయి. ఇంకో వైపున ప్రభుత్వ పరంగా ప్రజలలకు ప్యాకేజీ లాభాల్ని తెలియజెప్పేందుకు రంగం సిద్ధమవుతోంది. పార్టీ ముఖ్య నేతలతోనే కాకుండా, క్యాబినెట్‌లోనూ ఈ అంశాలపైనే ముఖ్యంగా చర్చ జరిగిందని సమాచారమ్. […]
జగన్‌కు లక్ష మెజార్టీ అంటోన్న టీడీపీ నేతలు
2019 ఎన్నికల్లో విపక్ష వైకాపా అధినేత జగన్‌కు ఆయన సొంత జిల్లా కడపలో చుక్కలు చూపించాలని పక్కా ప్లాన్‌తో ఉన్న టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఆశలు నెరవేరేటట్టు లేవా? ఆయన లక్ష్యానికి సొంత పార్టీ తమ్ముళ్లే తూట్లు పొడుస్తున్నారా? ఒకరిలో ఒకరు కుమ్ములాటలతో పొద్దు పుచ్చుతున్నారా? కడపలో టీడీపీని బలహీనం చేస్తున్నారా? అటు తిరిగి ఇటు తిరిగి జగన్‌కే లబ్ధి చేకూరేలా ప్రవర్తిస్తున్నారా? అంటే.. ప్రస్తుతం కడపలో ఉన్న పొలిటికల్ సీన్‌ను చూస్తే.. ఔననే […]
కాపు కార్డుతో మంత్రి పదవికి గాలం
ఏపీలో కాపు ఉద్యమం సీఎం చంద్రబాబుతో పాటు అధికార టీడీపీని చాలా ఇబ్బందులకు గురి చేస్తోంది. ముద్రగడ పద్మనాభం ఎప్పుడైతే కాపు ఉద్యమం స్టార్ట్ చేశాడో అధికార టీడీపీలో ఉన్న కాపుల పరిస్థితి ముందు నుయ్యి ..వెనక గొయ్యిలా మారింది. పార్టీ గీసిన గీత దాటి ముందుకు వెళ్లనూ లేరు..అలాగని కాపుల కోసం ఏం మాట్లాడకుండా ఉండనూ లేరు అన్న చందంగా వీరి పరిస్థితి మారింది. ఈ టైంలో దాదాపు అందరూ టీడీపీ కాపు ప్రజాప్రతినిధులు గోడమీద […]