మ‌హిళా సాధికార‌త‌లో బాబు వెనుక‌డుగే

మ‌హిళా సాధికార‌త‌, మ‌హిళ‌ల రిజ‌ర్వేష‌న్ల‌కు ఎప్పుడూ క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతుంటారు. మొన్న‌టికి మొన్న ఉమెన్స్ పార్ల‌మెంట్ ఘ‌నంగా నిర్వహించి.. మ‌హిళ‌ల‌కు అత్యంత గౌర‌వం ఇస్తున్నామ‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.ఇదంతా నాణేనికి ఒక‌వైపు! మ‌రోవైపు.. సొంత పార్టీ ఎమ్మెల్యే మ‌హిళా అధికారిపై చేయిచేసుకున్నా.. సొంత పార్టీ ఎమ్మెల్యేను వెన‌కేసుకొచ్చారు త‌ప్ప‌.. ఆమెకు క్ష‌మాప‌ణ‌లే చెప్పించ‌లేదు. కానీ ఇప్పుడు ఒక మ‌హిళా అధికారిణితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన ఎమ్మెల్యేతో.. ఆమెకు క్ష‌మాప‌ణ‌లు చెప్పించి.. తెలంగాణ సీఎం […]

రాహుల్ మెలిక‌తో బాబు షాక్‌

ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ఇచ్చిన హామీల‌తో ఇప్ప‌టికే కొంత ఉక్కిరిబిక్కిరి అవుతున్న సీఎం చంద్ర‌బాబుకు కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ షాక్ ఇవ్వ‌బోతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో నియోజ‌క వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న మీదే టీడీపీ అధినేత ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ఇప్పుడు స‌రిగ్గా వీటిని చెద‌ర‌గొట్టే మాస్ట‌ర్ ప్లాన్‌తో రాహుల్ సిద్ధ‌మ‌య్యారు. ఏపీలో అంతోఇంతో మ‌ళ్లీ బ‌ల‌ప‌డాల‌ని కాంగ్రెస్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే! ఇందులో భాగంగా ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై స‌రికొత్త మెలిక పెట్టింది. దీంతో చంద్ర‌బాబు […]

బాబు కొత్త మంత్రులు … ఎవ‌రి ర్యాంకు ఎంత‌…!

ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వేలు చేయడం, ఆ ఫ‌లితాల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను అప్ర‌మ‌త్తం చేస్తూ ఉంటారు ఏపీ సీఎం చంద్రబాబు! మ‌రి 2019కి ఎల‌క్ష‌న్ టీమ్‌గా ప్ర‌క‌టించిన మంత్రివ‌ర్గం ప‌నితీరుపై ఇప్పుడు ఆయ‌న స‌ర్వే నిర్వహించారు. పాత‌, కొత్త‌ మంత్రుల క‌ల‌యిక‌తో చేప‌ట్టిన కేబినెట్‌కు.. 100 రోజులు పూర్త‌యిన సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు.. వారి ప్ర‌తిభ‌, ప‌నితీరు ఆధారంగా ర్యాంకులు కూడా ప్ర‌క‌టించారు. ఇందులో నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి తొలి స్థానంలో నిలిచారు. ఇక సీఎం […]

లోకేశ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించ‌డం బాబుకు ప‌రీక్షే

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు వ‌చ్చే ఎన్నిక‌లు పెద్ద అగ్నిప‌రీక్ష‌లా మారాయి. ఆ ఎన్నిక‌ల్లో రెండోసారి గెలిచేందుకు ఎన్నో ప్లాన్లు వేస్తోన్న బాబు ముందు మ‌రో పెద్ద స‌వాల్ కూడా ఉంది. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీని స్టేట్‌లో రెండోసారి గెలిపించ‌డం ఒక ఎత్తు అయితే, త‌న త‌న‌యుడు లోకేశ్ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌కు స‌రైన బాట వేయ‌డం రెండో ప‌రీక్ష‌. వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీ గెలిచి బాబు సీఎం అయినా ఆ ట‌ర్మ్‌లో బాబు పూర్తికాలం సీఎంగా ఉంటార‌న్న […]

ఆనం బ్ర‌ద‌ర్స్‌ను బాబు సైడ్ చేసేశారా..!

నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో ఆనం సోద‌రుల పేరు చెపితేనే ఓ క్రేజ్ ఉంటుంది. ఆనం సోద‌రులు కాంగ్రెస్ పాల‌న‌లో నెల్లూరు జిల్లా రాజ‌కీయాల‌ను ఓ రేంజ్‌లో శాసించారు. కాంగ్రెస్‌లో అధికారంలో ఉన్న రెండుసార్లు వీరు ఎమ్మెల్యేలు అవ్వ‌డంతో పాటు వీరిద్ద‌రు మంత్రులుగా కూడా ప‌నిచేసి జిల్లాను శాసించారు. ఇక గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం అవ్వ‌డంతో ఈ సోద‌రులిద్ద‌రు ఎన్నో ఆశ‌ల‌తో త‌మ పాత‌గూడు అయిన టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన‌ప్పుడు ఆనం సోద‌రులు […]

2019 వార్ టీడీపీకి పూల‌పాన్పు కాదు

న‌వ్యాంధ్రప్రదేశ్‌కు తొలి సీఎం అయ్యేందుకు చంద్ర‌బాబు ఎన్నో క‌ష్ట‌నష్టాలు ప‌డ్డారు. వ‌రుస‌గా రెండుసార్లు ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ప్ర‌తిప‌క్షానికి ప‌రిమిత‌మైన ఆయ‌న ఈ ప‌దేళ్ల కాలంలో ఎంతోమంది సీనియ‌ర్ల‌ను వ‌దులుకున్నారు. కొంద‌రు పార్టీలు మారిపోతే, మ‌రి కొంద‌రు రాజ‌కీయాల నుంచి నిష్క్ర‌మించ‌డం లేదా మ‌ర‌ణించ‌డం జ‌రిగాయి. 2004లో టీడీపీ చ‌రిత్ర‌లోనే ఘోర ప‌రాజ‌యం చూసింది. 2009లోను ముక్కోణ‌పు పోటీలో మ‌రోసారి వ‌రుస‌గా ఓడింది. ఇక 2004కు ముందు వ‌ర‌కు చంద్ర‌బాబు పాల‌న అంటే ఓ క్రెడిబులిటీ ఉండేది. ఉద్యోగులు […]

వాటి ముందు బాబు అనుభ‌వం బ‌లాదూర్‌

క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో నాయ‌కుల మ‌ధ్య విభేదాలు భ‌గ్గుమంటున్నాయి. రాజ‌కీయ ఒడిదుడుకులు ఎదుర్కొన్న పార్టీ అధినేత చంద్ర‌బాబు కూడా ప‌రిష్క‌రించ‌లేనంత స్థాయిలో అంత‌ర్గ‌త పోరు న‌డుస్తోంది. రాజ‌కీయంగా బ‌ల‌పేందుకు ప్ర‌తిప‌క్ష వైసీపీ నుంచి ఆపరేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో ఎమ్మెల్యేల‌ను పార్టీలో చేర్చేసుకున్నారు. అప్పుడు రేగిన అసంతృప్తి జ్వాల‌లు ఇంకా ర‌గులుతూనే ఉన్నాయి. వీటిని చ‌ల్లార్చేందుకు చంద్ర‌బాబు చేయ‌ని ప్ర‌య‌త్నాలు లేవు. వారిని పార్టీ చేర్చుకోవ‌డంలో సూప‌ర్ స‌క్సెస్ అయిన చంద్ర‌బాబు.. వారి చేరిక‌తో వ‌చ్చిన విభేదాలు, […]

పార్టీనే నమ్ముకున్న టీడీపీ సీనియ‌ర్ల‌కు బాబు షాక్!

టీడీపీని న‌మ్ముకుని ఎన్నో త్యాగాలు చేసిన సీనియ‌ర్ల‌కు చంద్ర‌బాబు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు. పార్టీలో ఎప్ప‌టి నుంచో ఉండ‌డంతో పాటు ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వాళ్ల కోసం త‌మ సీట్లు వ‌దులుకుని త్యాగాలు చేసిన వాళ్ల‌కు చంద్ర‌బాబు సింపుల్‌గా కార్పొరేష‌న్ ప‌ద‌వుల‌తో స‌రిపెట్టేశారు. తాజాగా రాష్ట్రంలో ఎనిమిది కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆహార భద్రత కమిషన్‌కు చైర్మన్‌గా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జె.ఆర్‌.పుష్పరాజ్‌ను నియమించాలని […]

నంద్యాల‌లో గెలుపున‌కు చంద్ర‌బాబు ప‌ద‌వుల అస్త్రం

ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు ఏ ఒక్క ప‌ద‌వి భ‌ర్తీ చేసేందుకు సిద్ధంగా లేరు. ఏవైనా ప‌ద‌వులు భ‌ర్తీ చేయాలంటే నాన్చి నాన్చి మ‌రీ చేస్తున్నారు. తాజాగా ఆయ‌న 8 కార్పొరేష‌న్ల ప‌ద‌వులు భ‌ర్తీ చేశారు. ఇదిలా ఉంటే నంద్యాల ఉప ఎన్నిక వేళ ఆ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ నేత‌ల పంట పండ‌నుంది. ఇక్క‌డ గెలుపు కోసం చంద్ర‌బాబు ఏకంగా ప‌ద‌వులు అస్త్రాన్నే ఉప‌యోగిస్తున్నారు. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నుల‌కు కోట్లాది రూపాయ‌ల వ‌ర‌ద పారిస్తోన్న […]