ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా టీడీపీకి ఎంత కంచుకోటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత ఎన్నికల్లో జిల్లాలోని 2 ఎంపీ సీట్లతో పాటు 15 ఎమ్మెల్యే సీట్లను టీడీపీ గెలుచుకుంది. గత ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఈ జిల్లాలో అధికార పార్టీ నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలతో చంద్రబాబుకు రోజూ ఏదో ఒక తలనొప్పిగా మారుతోంది. ఇక్కడ చాలా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. గతంలో మంత్రిగా ఉన్న పీతల సుజాతకు, ఏలూరు ఎంపీ మాగంటి బాబుకు పడదు. బాబుకు […]
Tag: chandra babu
టీడీపీలో మళ్లీ పాత రోజులు.. నేతలకు బాబు దూరం!
టీడీపీలో కథ మళ్లీ మొదటికి వస్తోందా? చంద్రబాబు నేతలకు దూరం అవుతున్నారా? కేడర్‌ను అస్సలు పట్టించుకోవడం లేదా? 1990ల నాటి పరిస్థితులే పునరావృతం అవుతున్నాయా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఉమ్మడి ఏపీలో 23 జిల్లాలకు సీఎంగా ఉన్న సమయంలోనూ ఇప్పుడు కేవలం 13 జిల్లాలకు సీఎం గా ఉన్నారు. అయినా కూడా చంద్రబాబు అప్పట్లో ఎంత బిజీగా ఉన్నారో.. ఇప్పుడు కూడా అంతే బిజీగా ఉండడం గమనార్హం. అయితే, ఇక్కడ విషయంలోకి వచ్చేసరికి ఆయన అప్పట్లో […]
ఒక్క మాటతో చంద్రులకు ఝలక్
నిన్న మొన్నటికి వరకు రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలను భారీ సంఖ్యలో పెంచుతారని ఆశలు పెట్టుకున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంపై తాజాగా కేంద్రం నుంచి వచ్చిన సమాధానంతో పూర్తిగా డీలా పడిపోయారు. 2014 నాటికి రాష్ట్ర విభజన చట్టంలో షెడ్యూల్ 2 లో పేర్కొన్న విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సీట్లను పెంచుకునేందుకు అనుమతి ఉంది. అయితే, దీనికి కేంద్రం ఒక చట్టాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. దీంతో దీనిపై స్పందించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం […]
చంద్రబాబు ఈ తప్పు మళ్లీ చేస్తారా… ఇక్కడితో ఆగుతారా..?
ఏపీ సీఎం చంద్రబాబు కొన్ని విషయాల్లో పదే పదే తప్పులు కంటిన్యూ చేస్తుంటారు. కొన్ని విషయాల్లో ఎవ్వరికి అంతుపట్టని రీతిలో అద్భత నిర్ణయాలు తీసుకునే చంద్రబాబు కొన్ని సార్లు తీసుకునే నిర్ణయాలు చాలా ఘోరంగా ఉంటాయి. బాబు ఏ ఈక్వేషన్లతో ఇలా చేస్తారో ? తెలియదు కాని…కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీని నిర్వీర్యం చేసే వాళ్లను ఆయన పదే పదే ఎంకరేజ్ చేస్తుంటారు. కృష్ణా జిల్లా తిరువూరు రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో టీడీపీ గత మూడు ఎన్నికల్లోను ఓడిపోయింది. విశేషం […]
48 గంటలు..ఏపీ, తెలంగాణ పొలిటికల్ లీడర్లకు ఫీవర్
ఏపీ, తెలంగాణ రాజకీయ నాయకులకు వచ్చే 48 గంటల పాటు ఫీవర్ పట్టుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు వచ్చే 48 గంటల్లో ఏం జరుగుతుందా ? అని నరాలు తెగే ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. మరి వీరు అంతలా ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే నియోజవర్గాల పెంపు జరుగుతుందా ? లేదా ? అన్నదే వీరికి ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొత్త రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం అనంతరం రెండు […]
లైట్ తీసుకోమంటున్న అఖిల ప్రియ..టెన్షన్ లో టీడీపీ నాయకులు
నంద్యాలలో టీడీపీ గెలవకపోతే…ఆ తర్వాత టీడీపీ పరువు ఎలా గంగలో కలిసిపోతుందో ? వాళ్ల మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో ? వైసీపీ వాళ్ల ఆనందం ఎలా ఉంటుందో ? ఊహించుకోవడానికి ఊహకే అందడం లేదు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకోవడానికి చంద్రబాబు ఎంత కష్టపడుతున్నారో ? ఎంత టెన్షన్ పడుతున్నారో ? ప‌్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ రిజల్ట్ ఏ మాత్రం తేడా కొట్టినా చంద్రబాబు కెరీర్‌కే అది పెద్ద మచ్చగా మిగిలిపోతుంది. 2019లో టీడీపీ […]
బీజేపీని నమ్మని బాబు… జనసేన వైపు చూపు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బీజేపీపై ఆశలు లేవా ? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో టీడీపీ దోస్తానా వచ్చే ఎన్నికల వరకు ఉంటుందా ? మధ్యలోనే కట్ అవుతుందా ? చంద్రబాబు 2019 ఎన్నికల్లో బీజేపీతో పొత్త లేకుండానే పోటీకి రెడీ అవుతున్నారా ? అంటే ఇలా ఎన్నో సందేహాలతో కూడిన ప్రశ్నలు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. తాజాగా కేంద్రంలో జరుగుతోన్న రాజకీయ పరిణామాలను గమనిస్తుంటే ఏపీలో టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే కేంద్రంలో ఉన్న […]
చంద్రబాబుతో పవన్ భేటీ వెనుక అసలు కారణం?
చంద్రబాబుతో జనసేనాని పవన్ భేటీ అవుతున్నాడనే వార్త ఎంటైర్ స్టేట్‌లో సంచలనం సృష్టించింది. అయితే, ఇంతలోనే ఇది కేవలం ఉద్దానంలోని కిడ్నీ బాధితుల గురించేనని తెలిసి అందరూ నిరుత్సాహపడ్డారు. అయితే, నిజానికి జనసేనాని పవన్.. బాబును కలుస్తోంది కేవలం.. ఉద్దానం కోసమేనా? లేక ఇంకేమైనా విషయంపై చర్చించేందుకా? అనేది ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. విషయంలోకి వెళ్తే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై తీవ్రంగా ఫైరైన జనసేనాని.. ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చారు. జిల్లాల వారీగా […]
ఉపరాష్ట్ర పతిగా వెంకయ్య…ఏపీ పరిస్థితి ఏంటి!
నెల్లూరుకు చెందిన బీజేపీ మోస్ట్ సీనియర్ నేత, కేంద్రంలో మంత్రిగా ఉన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు త్వరలోనే దేశ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. మరో కొద్ది రోజుల్లో ఉపరాష్ట్ర పతి ఎన్నికలూ జరగనున్నాయి. ఈ క్రమంలో బీజేపీ పక్షాన ఎన్డీయే ఉపరాష్ట్ర పతి అభ్యర్థిగా వెంకయ్యను నిలబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. రాజ్య సభను నడిపించేది ఉపరాష్ట్రపతే కాబట్టి.. తమ పక్షాన గట్టి అభ్యర్థి […]