ఏపీ కేబినెట్‌లో అతిపిన్న వయస్సులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భూమా అఖిలప్రియ పరిస్థితి ముందు నుయ్యి – వెనక గొయ్యి అన్న చందంగా మారింది. అఖిలప్రియ ఎమ్మెల్యేగా ఎన్నికైనా తండ్రి అడుగుజాడల్లోనే ఉండేవారు. ఆమె పేరుకు మాత్రమే ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నా బలమైన ఫ్యాక్షన్ రాజకీయాలకు వేదికైన అక్కడ వ్యవహారాలన్ని భూమానే చక్కపెట్టేవారు. దీంతో ఇప్పటి వరకు ఆమెకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. కానీ ఇప్పుడు అలా కాదు పరిస్థితి మారింది. ఆళ్లగడ్డతో పాటు నంద్యాలలోను […]
Tag: Booma Nagireddy
భూమా మృతితో మారనున్న కర్నూలు పాలిటిక్స్
టీడీపీ సీనియర్ లీడర్, కర్నూలు జిల్ల నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో కర్నూలు జిల్లా రాజకీయాల్లో చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. వాస్తవానికి త్వరలో జరిగే ఏపీ కేబినెట్ ప్రక్షాళనలో భూమాకు మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు కూడా వార్తలు వచ్చాయి. భూమా మంత్రి పదవి హామీతోనే వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో టీడీపీలో పనిచేసిన భూమా ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. ఆ […]
డైలమాలో టీడీపీ సీనియర్: కొడుకు ఫ్యూచరా..? ఎమ్మెల్సీనా..?
వ్యూహాలు రచించడంలో తన తర్వాతే ఎవరైనా అని టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి రుజువు చేస్తున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలతో కొత్త కష్టాలు మొదలయ్యాయి. పార్టీలోకి చేరుతున్న వారికి ప్రాధాన్యమిస్తూ.. సీనియర్లను పక్కనపెడుతున్నారని మరో వర్గం అసంతృప్తితో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో అసంతృప్తులను చల్లార్చేందుకు బాబు ఎమ్మెల్సీ అస్త్రాన్ని సంధిస్తున్నారు. త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా సీటు కేటాయిస్తామని చెబుతూ.. వారిని బుజ్జగిస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేత కరణం బలరాం […]