“కేవీపీ రామచంద్రరావు” తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల గురించి అవగాహన ఉన్నవారికి పరిచయం అక్కర్లేని పేరు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మగా పేరున్న కేవీపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఇక టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి రెండు రాష్ట్రాల ప్రజలకే దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులకు సైతం తెలుసు. సిద్ధాంతపరంగా ఉప్పు-నిప్పులాగా ఉండే ఈ ఇద్దరు నేతల మధ్య మంచీ దోస్తీ ఉందనే వార్తలు కొద్దికాలంగా వెలువడుతున్నాయి. అయితే ఇది మరింతగా బలపడిందని […]
Category: Politics
రోశయ్యకు పదవీ గండం…
తమిళనాడు గవర్నర్‌గా ఉన్న కొణిజేటి రోశయ్య.. త్వరలోనే ఇంటి ముఖం పడతారా? ఆయనకు పదవీ గండం పొంచి ఉందా? అంటే.. ఔననే అంటోంది జాతీయ మీడియా! ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్న రోశయ్యను కాంగ్రెస్ రాజీనామా చేయించింది. అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహించిన రోశయ్యకు అదే అధిష్టానం తమిళనాడు గవర్నర్ పదవిని అప్పజెప్పి గౌరవించింది. దీంతో 83 ఏళ్ల రోశయ్య తమిళనాడుకు 18వ గవర్నర్‌గా 2011 ఆగస్టు 31న బాధ్యతలు చేపట్టారు. తమిళనాడులో సీఎం జయ లలితకు, గవర్నర్‌కు […]
కొత్త జిల్లాలు దసరాకే పక్కా
తెలంగాణలో కొత్త జిల్లాలు దసరా నుంచి ఉనికిని చాటుకుంటాయని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటించారు. దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలంటూ అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన కెసియార్, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సాక్షిగా కొత్త జిల్లాల ఉనికి దసరా నుంచి జరుగుతుందని ప్రకటించడం ఆయనలోని ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఎందుకంటే, కొత్త జిల్లాల పట్ల కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. కొత్త […]
నయీం ఎన్‌కౌంటర్‌పై స్పందించిన దినేష్‌రెడ్డి
నయీం ఎన్‌కౌంటర్, నయీం గ్యాంగ్‌స్టర్‌గా కార్యకలాపాలు నిర్వహించడం వంటి అంశాలపై పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి తన స్పందనను తెలియజేశారు మాజీ డిజిపి దినేష్‌రెడ్డి. ఇలాంటి ఎన్‌కౌంటర్లు మంచివేనని ఈ సందర్భంగా దినేష్‌రెడ్డి చెబుతూ, తెలంగాణ పోలీసులను అభినందించడం జరిగింది. మాజీ డిజిపికి నయీంతో సంబంధాలు ఉండేవని వచ్చిన ఆరోపణల్ని ఆయన ఖండించారు. తన పేరును పరోక్షంగా మీడియాలో కొందరు వాడుతుండడంపై అభ్యంతరం వ్యక్తం చేశారాయన. డిజిపి స్థాయి అధికారులతో ఇలాంటివారికి సంబంధాలు ఉండవని చెప్పారు. కొన్ని […]
ఆ కాశ్మీర్‌ని తీసుకొస్తే మోడీ ధన్యుడే
పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్‌ని తిరిగి భారతదేశంలోకి తీసుకురావాలనే మహా సంకల్పంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ దృష్టిపెట్టారు. అఖిలపక్ష సమావేశంలో ఈ అంశంపై నరేంద్రమోడీ చర్చించడం పట్ల దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. దశాబ్దాలుగా ఆ భూభాగం, పాకిస్తాన్ ఆధీనంలో ఉంది. అక్కడ పాకిస్తాన్ సైన్యాలు యధేచ్ఛగా తిరుగుతాయి. అక్కడి ప్రజల్ని నాశనం చేస్తుంటాయి. అక్కడే తీవ్రవాదుల స్థావరాల్ని నెలకొల్పుతుంటాయి. కానీ అంతర్జాతీయ సమాజం ఏమనుకుంటుందోననే భయంతో ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్‌తో సంబందం లేని ప్రాంతంగానే చూపుతుంటుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ […]
మాట తప్పేది లేదంటున్న కెసియార్
ముస్లింలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషనుల ఇచ్చేందుకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ పునరుద్ఘాటించారు. గతంలో ఇలాంటి ప్రయత్నం జరిగినా న్యాయస్థానాల్లో ఆ కేసులు వీగిపోయాయి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే అంశంలో వెనక్కి తగ్గేది లేదని ఇంకోసారి చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లను కల్పించడానికి ప్రత్యేక చట్టం తెస్తామని ఆయన అంటున్నారు. అయితే, ఎన్నికల్లో ఇచ్చిన ఈ హామీని నెరవేర్చడానికి రెండేళ్ళకుపైగానే కెసియార్ సమయం తీసుకున్నారు. […]
అమరావతిని అడ్డుకోవద్దు: సుప్రీంకోర్టు
కొత్త రాష్ట్రం రాజధానిని నిర్మించుకోవద్దా? అని సుప్రీంకోర్టు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఎబికె ప్రసాద్‌ని ప్రశ్నించింది. అమరావతిలో అక్రమాలు జరుగుతున్నాయంటూ సుప్రీంకోర్టును ఆయన ఆశ్రయించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసును కొట్టివేసిన న్యాయస్థానం చేసిన వ్యాఖ్యల్లో, అనేక కీలకాంశాలు ఉన్నాయి. రాజధానిని ఎక్కడ నిర్మించాలో మీరే చెబుతారా? మీరేమైనా రైతా? అని ప్రశ్నించడంతో పిటిషనర్ తరఫు న్యాయవాదికి నోట మాట రాలేదు. రైతులు నష్టపోతున్నారని ఆయన చెప్పినప్పుడు, రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అప్పుడు […]
బాబూ పుష్కర పుణ్యం మాకొద్దు
గత నెల రోజులుగా పాలనా పడకేసిన పట్టించుకోకుండా పుష్కర పనులకే పరిమితమయింది ప్రభుత్వమంతా..అక్కడికేదో చరిత్రలో ఇదే మొదటిసారి పుష్కారాలు అన్నట్టుగా ముఖ్యమంత్రి దగ్గరినుండి మంత్రిమండలి మొదలు అధికార యంత్రాగమంతా పనులుమానుకొని మరీ రాష్ట్రం లో పుష్కరాలు తప్ప వేరే పనిలేదు అన్నట్టుగా హడావిడి చేశారు.ఈ పైత్యం ఏ రేంజ్ కి చేరిందంటే అదేదో ఫామిలీ ఫంక్షన్ అన్నట్టు మంత్రివర్యలచే ఆహ్వానాలు అందిచిందడం ఈ మొత్తం వ్యవహారానికి పరాకాష్ట. ఏర్పాట్లు అయితే ఘనంగానే చేశారు కానీ జనాలు మాత్రం […]
దేవాలయాలు కూడానా కెసిఆర్ గారూ
కెసిఆర్ లోని ఉద్యమనేత ఇంకా చల్లారినట్లు లేడు.అయన ఇప్పుడో రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అప్పుడప్పుడు నేనింకా ఉద్యమనేతనే అని అందరికి గుర్తు చేస్తుంటారు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్.ఉద్యమనేతగా చాలా కలం కొనసాగి ఆ అలవాట్లు ఇంకా పోలేదో లేక నేను ముఖ్యమంత్రినైనా నాలో ఉద్యమ నాయకుడే ఎప్పుడు ముందుంటాడని చుపించాడానికో తెలీదు. రాష్ట్ర ముఖ్యమంత్రే ఏకంగా బంద్ కి పిలుపునివ్వడం ఎక్కడైనా చూశామా.అది కేవలం కెసిఆర్ కె సాధ్యం.ఖమ్మం జిల్లా లోని 7 మండలాలని ఆంధ్రప్రదేశ్ లో […]