ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాలు వపర్ స్టార్ మేనియాలో ఊగిపోతున్నాయి. ఈ రెండు జిల్లాలో పవన్‌కళ్యాణ్‌కి అభిమానులు ఇతర జిల్లాలతో పోల్చితే చాలా ఎక్కువ. ఈ జిల్లాల్లోని కాపు సామాజిక వర్గం పూర్తిగా పవన్‌కళ్యాణ్ వెంట నడిచేందుకు ఆస్కారం ఉంది. జనసేన పార్టీ పెట్టిన తర్వాత తొలిసారిగా అత్యంత వ్యూహాత్మకంగా పవన్‌కళ్యాణ్ ఏర్పాటు చేసిన బహిరంగ సభ శుక్రవారం జరగనుంది. దీనికోసం భారీ ఏర్పాట్లు చేశారు. సభకు హాజరయ్యేందుకు ఓ రోజు ముందుగానే కాకినాడ చేరుకున్న పవన్‌కళ్యాణ్‌కి […]
Category: Politics
ఆంధ్రప్రదేశ్‌కి రెండు లక్షల కోట్లు.
కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ ఈ రోజు మీడియా ముందుకు వచ్చి, ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం ఇస్తున్న ప్యాకేజీ, ఇప్పటివరకు చేసిన సాయం, ఇకపై చేయనున్న సాయం గురించి సవివరంగా చెప్పారుగానీ, ఇదంతా దేనికోసం? అన్న చర్చకు తావిచ్చారు. ప్రత్యేక ప్యాకేజీ గురించి అరుణ్ జైట్లీ ఏదో చెప్పేస్తారనుకుని ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల ప్రజానీకం ఎదురు చూడగా, అర్థరాత్రి వేళ తుస్సుమనిపించారు అరుణ్ జైట్లీ. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఉదయం నుంచీ హైడ్రామా నడిపించారు. […]
కుక్క కావాలి:చంద్ర బాబు
చీము నెత్తురు ఉంటే..మీకు నిజంగా ఆత్మాభిమానం ఉంటే..మళ్ళీ ప్రత్యేక హోదా అన్న ఊసుకూడా ఏత్తకండి అని కేంద్రం ఆంధ్రప్రదేశ్ పైన ఉమ్మేసింది.హోదా కాదు కదా ప్యాకేజీ అన్నా అది కూడా బూతే అని తేల్చేసింది.పొద్దున్నుండి పడిగాపులు కాచి కాచి..వేచి వేచి..కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కేంద్రం చేసిన నయవంచన చరిత్రలో ఎన్నడూ వేరెవ్వరికీ జరగలేదు. దీనికంటే పెద్ద నయవంచనకు మన బాబుగారు అండ్ భజన మీడియా పాపం నిన్న పొద్దున్నుండి అర్ద రాత్రి దాటేవరకు..పడ్డ […]
ప్రత్యేకహోదా భాద్యత ఎవరిది?
ప్రత్యేకహోదా పై మరొకసారి కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించింది. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రోడ్డున పడిన ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థకి ఏదో మేలుజరుగుతుందని 5 కోట్ల ఆంధ్రులు ఆశగా ఎదురుచూసారు.కానీ చివరకు మన వెక్కయ్య నాయుడు(గారు అనిపించుకునే అర్హతకూడా కోల్పోయారనే ఉద్దేశం తో ), అరుంజేట్లీ కలిసి పాత హరికదే చెప్పి దారుణంగా అవమానించారు. గత రెండున్నర సంవత్సరాలుగా సంయమనం పాటించి వున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల సహనాన్ని చేతకాని తనంగా నే పరిగణించినట్టు చెప్పకనే […]
మోసం, పచ్చి దగా! చేస్తున్నదెవరు?
ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరుగుతోంది. మోసం, కుట్ర, దగా ఇంకా ఇంకా పెద్ద పదాలు ఉపయోగించాలి. ఎక్కడన్నా కోరుకుంటే రాష్ట్రాల విభజన జరుగుతుంది. కానీ 13 జిల్లాల సీమాంధ్ర కోరుకోని విభజన జరిగింది. అక్కడే, దేశం నుంచి ఆ 13 జిల్లాల్ని కేంద్రం వెలివేసిందా? అన్న భావన కలిగింది అక్కడి ప్రజల్లో. పోనీ, ఆ విభజన సందర్భంగా ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకుందా? అంటే అది కూడా లేదు. హోదా ఇవ్వలేంగానీ […]
రోజా రాజీ – కథ అయిపోలేదు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రోజా రీ ఎంట్రీ ఇవ్వడానికి మార్గం సుగమం అయినట్లుంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రోజా దురుసు ప్రవర్తన కారణంగా ఆమెను ఏడాదిపాటు స్పీకర్ కోడెల శివప్రసాద్ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. కొన్నాళ్ళు బెట్టు చేసినా, తిరిగి అసెంబ్లీలోకి వెళ్ళేందుకు రోజా క్షమాపణ చెప్పక తప్పలేదు. క్షమాపణను రాత పూర్వకంగా ఆమె తెలియజేసినప్పటికీ, అసెంబ్లీకి ఆమెతో ప్రత్యక్షంగా క్షమాపణ చెప్పించాలని అధికార పార్టీ అనుకుంటోందట. ముఖ్యమంత్రి చంద్రబాబు మీదా, టిడిపి మహిళా ఎమ్మెల్యే అనితపైనా […]
రెడ్డిగారు జోకేస్తే నవ్వరెందుకు!
తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి జోకేశారు. నవ్వొస్తే నవ్వండి. కానీ నవ్వడానికి అందులో అసలు మేటరుంటే కదా! తెలుగుదేశం పార్టీ తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాన్ని, టిడిపిని వీడి టిఆర్‌ఎస్‌లో చేరిన నాయకులు కొందరు అభినందిస్తున్నారని రేవంత్‌రెడ్డి జోకేశారు మరి. 15 మంది ఎమ్మెల్యేలు 2014 ఎన్నికల్లో తెలంగాణ నుంచి టిడిపి తరఫున గెలిస్తే అందులోంచి 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లోకి జంప్ చేశారు. ఒకాయన టిడిపిలో ఉన్నారో లేదో ఎవరికీ తెలియదు. ఇద్దరంటే […]
చంద్రబాబు దెబ్బకి జగన్ షాక్!
శాసనసభ సమావేశాలకు ముందు వైసిపి ఊహించని షాక్ ఇది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ముఖ్య నేత కూడా అయిన భూమన కరుణాకర్‌రెడ్డిని తుని విధ్వంసం కేసులో ఆంధ్రప్రదేశ్ సిఐడి విచారిస్తుండడంతో పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. తొలి రోజు విచారణ ముగియగా, రెండో రోజు కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా సిఐడి అధికారులు భూమనను ఆదేశించారు. అయితే తనకేమీ భయం లేదని, విచారణకు హాజరవుతానని భూమన చెప్పారు విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ. అయినప్పటికీ […]
నాలుక చీరేస్తారట, ఎందీ నిజమేనా?
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఇప్పుడంటే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారుగానీ, ఒకప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడే. ఆయన ఎమ్మెల్యేగా ఇప్పుడు పదవిలో ఉన్నదే తెలుగుదేశం పార్టీ కారణంగా. అది ఆయన మర్చిపోతే ఎలా? రాజకీయాల్లో పార్టీ మారడం ఫ్యాషన్ అయిపోయింది. పార్టీ మారాక, కెసియార్ – తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కి ‘దేవుడైపోయారు’. అంతకు ముందైతే, కెసియార్‌ని పట్టుకుని నానా విమర్శలు చేసేసిన ఘనుడే ఈ తలసాని శ్రీనివాస్‌యాదవ్‌గారు కూడా. తప్పదండీ, గారు అని సంబోధించకపోతే ఈయనగారికి ఒళ్ళు […]