పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని తుందుర్రు తదితర గ్రామాల్లో భారీస్థాయలో నిర్మిస్తున్న ఆక్వా పరిశ్రమపై అక్కడి రైతులు, రైతు కుటుంబాల సమస్యలపై గళం విప్పిన జనసేనాని పవన్ కళ్యాణ్.. తన పోరాటాన్ని మరింత విస్తృతం చేస్తున్నారా? ఎలాంటి చడీ చప్పుడు, ఆర్భాటం లేకుండానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బాధితుల పక్షాన పోరాటం చేసేందుకు రెడీ అయ్యారా? ఈ క్రమంలో పెద్ద ఎత్తున కార్యాచరణ కూడా నడుస్తోందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఆక్వా పరిశ్రమ ప్రాంత బాధితులతో […]
Category: Politics
ఆ మంత్రి డైలాగ్‌తో జగన్‌కు నిద్ర పట్టడం లేదా..!
ఏపీ విపక్ష నేత, వైకాపా అధినేత జగన్‌కి నిద్రలేని రాత్రులు కొత్తకాదు! ఆశ్చర్యంగా అనిపించినా నిజం!! ఒక్కాసారి మీ కళ్లు మూసుకుని గతంలోకి వెళ్లిపోతే.. జగన్‌కి చేతికి అందివచ్చి.. ఇక ఒకటో రెండో రోజుల్లో సీఎంగా ప్రమాణం చేసేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన మరుసటి రోజే రోశయ్య రూపంలో కాంగ్రెస్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. దీంతో అప్పట్లోనే ఆయనకు నిద్ర పట్టలేదు. ఇక, ఆ తర్వాత సీఎం సీటు దక్కుతుందని 2014 ఎన్నికల్లో తెగ ఆశలు […]
ఏపీలో బీజేపీ పీక నొక్కుతోందెవరు..!
అవును! ఏపీలో ఎంతో ఎత్తుకు ఎదగాలని.. కమల దళాధిపతి అమిత్ షా మాటల్లో చెప్పాలంటే నేరుగా అధికారంలోకే వచ్చేయాలని పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకుంటున్న బీజేపీకి ఇప్పుడు ఏపీలో వాయిస్ కట్ అయింది!! ఇంకొంచెం ఘాటుగా చెప్పాలంటే.. బీజేపీ మర్డరే అయిపోతోంది! పెద్ద నోట్ల రద్దుతో వెల్లువెత్తుతున్న ప్రజా గ్రహాన్ని తమపై పడకుండా చూసుకునే క్రమంలో తెలుగుదేశం నేతలు ఏకంగా బీజేపీని బోనులోకి ఎక్కించేసి.. చుట్టూ చేరి రాళ్లేస్తున్నారు. ఈ క్రమంలో మరి బీజేపీని కాపాడుకునేందుకు, దానిపై […]
మోడీపై టీడీపీ స్వరం పెరుగుతోంది
తడి తనదాకా వస్తేనే కానీ తెలీదంటారు పెద్దలు! ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు విషయం టీడీపీకి ఇలానే మారుతోందట! మొన్నటి వరకు ఈ పెద్ద నోట్ల రద్దు విషయం మా నేత చంద్రబాబు చెబితేనేగానీ కేంద్రానికి అసలు ఆ ఆలోచనే లేదన్నట్టుగా మాట్లాడిన టీడీపీ తమ్ముళ్లు.. ఇప్పుడు ఆ నోట్ల రద్దుతో జనాలు ప్రభుత్వాలపై తిరగబడే పరిస్థితి తలెత్తేసరికి.. ప్లేటు ఫిరాయించేస్తున్నారు. ఈ పెద్ద నోట్ల విమర్శల నుంచి తమను తాము కాపాడుకునే ప్రయత్నంలో నిన్న మొన్నటి […]
సెంటిమెంట్ రాయుడిగా మారిన రేవంత్‌రెడ్డి
ఇటీవల రాజకీయాలు సెంటిమెంట్‌గా మారిపోయాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం నుంచి ఈ సెంటిమెంట్ ఎక్కువైపోయింది. ఈపని ప్రారంభించాలన్నా కొబ్బరికాయ పగలాల్సిందే! నుదుటిన వీర తిలకం దిద్దాల్సిందే టైపులో ప్రతి పనికీ సెంటిమెంట్‌తో ముడి పెడుతున్నారు. తాజాగా తెలంగాణ టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సెంటిమెంట్ రాయుడిగా మారిపోయారు! నిన్నమొన్నటి వరకు ప్రజల్ని, చంద్రబాబుని ఎంతగానో నమ్మిన రేవంత్ ఇప్పుడు.. కేవలం సెంటిమెంట్‌ను మాత్రమే నమ్ముతున్నారు. అదే తనకు కలిసివస్తోందని బహిరంగంగానే రేవంత్ చెబుతుండడం గమనార్హం. ఇటీవల […]
చంద్రబాబు అందుకే రాజకీయ మేథావి అయ్యాడు
కింద పడ్డా పైచేయి నాదే అనే టైపు పొలిటీషియన్లకు ఈ దేశంలో కొదవలేదు! ముఖ్యంగా ఏపీలో అయితే.. ఇంకో రెండాకులు చదివిన సీఎం చంద్రబాబు లాంటి నేతలకు అస్సలు కొదవలేదు!! ప్లస్ అయితే తన ఖాతాలోను, మైనస్ అయితే పక్కవాడి(విపక్షం) ఖాతాలోను వేయడం బాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలీదని అంటారు పొలిటికల్ పండితులు. 2009 ఎన్నికల్లో అప్పటి వైఎస్ ధాటికి టీడీపీ మట్టి కరిచింది. ఇది నిజం! ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే సైడైపోయిన చంద్రబాబు అండ్‌కో.. […]
టీడీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే బిగ్ ఫైట్
అనంతపురం జిల్లా టీడీపీ నేతల మధ్య వార్ వీధుల్లోకి చేరింది. అనంత ఎంపీ జేసీ బ్రదర్ దివాకర్ రెడ్డి.. అనంత ఎమ్మెల్యే(ఇద్దరూ టీడీపీనే) ప్రభాకర చౌదరిల మధ్య ఫైటింగ్ పీక్ స్టేజ్‌కి చేరింది! ప్రభాకర్ రెడ్డికి ఏదో రకంగా పొగబెట్టాలని జేసీ బ్రదర్స్, వీళ్ల ఆధిపత్యానికి ఎలాగోలా గండి కొట్టాలని ప్రభాకర్ ఎన్నాళ్లుగానో ప్రయత్నిస్తున్నారు. గతంలో జేసీ కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచి పరిస్థితి ఇంతే. అయితే, ఇప్పుడు అటు జేసీ, ఇటు ప్రభాకర్ ఇద్దరూ టీడీపీలోనే ఉండడంతో […]
మోడీని సపోర్ట్ చేసిన నాగబాబు
దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సర్వత్రా కలకలం సృష్టించింది. నల్లధనంపై పోరు కోసం ప్రజలు ఈ బాధలు పడాల్సిందేనని తొలి రెండు రోజులు ప్రధాని మోడీ చెప్పడంతో ఆయనపై ఉన్న అభిమానంతో దేశ ప్రజలంతా తమకేదో మంచి జరుగుతుందని భావించారు. తొలి రెండు రోజులు కాదు వారం రోజులు ఎదురు చూశారు. కానీ, నేటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. చిల్లర లేక అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. పెళ్లిళ్లు కనాకష్టంగా చేసుకుంటున్నారు. […]
ఎన్టీఆర్ పార్టీతో ఎఫెక్ట్ ఎవరికి ..!
జూనియర్ ఎన్టీఆర్! తన వినూత్న నటనతో సీనియర్ ఎన్టీఆర్‌ని మరిపించి.. తెలుగు ప్రేక్షకులను మురిపించిన డైనమిక్ హీరో! వెండి తెరపై ఈయన వేసే స్టెప్పులు చాలా మటుకు సీనియర్ ఎన్టీఆర్‌నే గుర్తుకు తెస్తాయి. ఈ కారణంగానే అత్యంత త్వరగానే తెలుగు ఆడియన్స్‌కి చేరువ అయిపోయాడు జూనియర్. దీంతో ఈయన చరిష్మాను తన పాలిటిక్స్‌కి మిక్స్ చేసి.. అధికారంలోకి వచ్చేందుకు 2009లో టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా యత్నించారు. తాత పెట్టిన పార్టీ కావడంతో టీడీపీ తరఫున ప్రచారం […]