ఒకప్పుడు జాతీయ బీజేపీ రాజకీయాలను శాసించిన వ్యక్తి… ప్రస్తుత కేంద్ర మంత్రి, తెలుగు వాడు అయిన వెంకయ్యనాయుడుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి బాగా గ్యాప్ వచ్చిందా ? ఏపీలో చంద్రబాబును పదే పదే పొగుడుతూ ఇక్కడ బీజేపీ బలోపేతానికి వెంకయ్య కృషి చేయడం లేదని మోడీ బలంగా నమ్ముతున్నారా ? ఈ క్రమంలోనే వెంకయ్యకు పొగపెట్టి కేబినెట్ నుంచి తప్పించేందుకు మోడీ పావులు కదుపుతున్నారా ? అంటే అవుననే ఆన్సర్ బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి వినవస్తోన్న మాట. […]
Category: Politics
తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహం వచ్చిందా!
వారు ముగ్గురూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు! అయితేనేం ఎవరి రాజకీయాలు వారివి. ఎవరి వ్యూహాలు వారివి! ఒకరితో ఒకరికి పొంతన ఉండదు. ఎప్పుడూ కలుసుకోరు.. కలిసినా మాట్లాడుకోరు!! అలాంటి వారు ముగ్గురూ విభేదాలు పక్కన పెట్టారు. శత్రుత్వాన్ని మరిచి.. పార్టీ కోసం చేయీచేయీ కలిపారు. పార్టీకి జవసత్వాలు నింపాలని నిర్ణయించారు. అంతేకాదు కలిసి భోజనం చేశారు! ఆ నేతలే జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి!! తెలంగాణలో ఇచ్చినా ఆ క్రెడిట్ సంపాదించుకోలేక […]
దాసరి టీడీపీ వైపు అడుగులు వేస్తారా…?
రాజకీయ, సినీ రంగాల్లో కొన్నివార్తలు జనంలో సహజంగానే అత్యంత ఆసక్తిని కలిగిస్తుంటాయి. అందులోను అసలు ఎన్నటికీ సాధ్యంకాదేమోనని జనం భావించే విషయాలు కొన్నుంటాయి. ఇలాంటి వాటిలో ఏదైనా చిన్న పరిణామం సంభవించినా.. అది సంచలనమే అవుతుంది. సీనియర్ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావుకు సంబంధించి ఇలాంటి వార్తే ఈ మధ్య మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దాసరి నారాయణరావు…సినీరంగంలో అందరికీ కావలసిన వ్యక్తే అయినా.. రాజకీయాల్లోకొస్తే మాత్రం టీడీపీకి బద్ధ వ్యతిరేకి అనే చెప్పాలి. […]
చేతులు కాల్చుకున్న కరణం బలరాం
నీకు ఎప్పుడో ఈ ఉపకారం చేశా.. నాకు ఇప్పుడు ఇది చెయ్యి` అనే మాటలు ఎక్కడయినా కుదురుతాయేమో గానీ.. రాజకీయాల్లో మాత్రం కుదరవు! అది కూడా పార్టీ అధినేతతోనే ఇలా అంటే ఏమవుతుంది? అంటే కరణం బలరాంకి ఎదురైన పరిస్థితిలానే ఉంటుంది. ఎందుకంటారా? త‌్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో ఎమ్మెల్సీ అవకాశాలను దూరం చేసుకుంటున్నారని తెలుస్తోంది. టీడీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారిలో బలరాం కూడా ఉన్నారు. ఫిబ్రవరి 10న […]
టాలీవుడ్ సినిమాలో జగన్
ఏంటి వినడానికి ఆశ్చర్యంగా ఉందా? వైఎస్ జగన్ ఏంటి సినిమాలో నటించడమేంటి? అని ఒకింత అవాక్కవుతున్నారా? ఇక్కడే ఒక చిన్న లాజిక్ ఉంది. అదేంటంటే.. ఒకే విషయాన్ని పదే పదే చూసినా.. దాని గురించి పదే పదే విన్నా వెంటనే చిరాకు వస్తుందనడంలో సందేహం లేదు! ప్రస్తుతం టాలీవుడ్‌లో కొన్ని చిత్రాల పరిస్థితి.. జగన్ పరిస్థితి ఒకేలా ఉంది. ఒకే ఫార్ములా కథను వేర్వేరుగా చూడలేక సినీ ప్రేక్షకులు ఇబ్బందులు పడుతుంటే.. ఒకే రీతిలో సాగుతున్న జగన్ […]
కొడుక్కే షాక్ ఇచ్చిన చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు పదవి కట్టబెడతారని గంపెడాశలు పెట్టుకున్నారు నేతలు! అయితే ఇప్పుడు ఆ ఆశలపై బాబు నీళ్లు చల్లారు. అంతేగాక ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి వస్తే పార్టీలో మరింత కీలకంగా వ్యవహరించాలని ఎదురుచూస్తున్న చినబాబుకు అదిరిపోయే షాక్ ఇచ్చారు. అయితే దీనికి లోకేష్ వ్యవహార శైలే కారణమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొద్దికాలంగా లోకేష్ తీరుపై బాబు అసంతృప్తిగా ఉన్నారని, అందుకే ఆయన్ను ఎమ్మెల్సీ పదవికి […]
వైసీపీలో రోజాకు స్కెచ్ రెడీనా..!
వైసీపీలో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన నగరి ఎమ్మెల్యే రోజా కి ఇక చెక్ తప్పదనే వార్తలు వస్తున్నాయి. అటు అసెంబ్లీలోనూ, ఇటు బయటా అధికార టీడీపీని ఇరుకున పెట్టడం సహా సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌పై సటైర్లతో విరుచుకుపడడంలో రోజాకు సాటి ఇప్పటి వరకు వైకాపాలో కనిపించలేదు. గిడ్డి ఈశ్వరి వంటి వారు ఒకరిద్దరు ఉన్నా కూడా రోజాకి సాటి రోజా యే అన్నచందంగా ఉంది. దీంతో జగన్ కూడా ఎప్పుడూ రోజాకి అడ్డు చెప్పకపోగా […]
వాళ్లకు అదిరిపోయే షాక్ ఇచ్చిన చంద్రబాబు
రాజకీయాల్లో సమయానుకూలంగా వ్యవహరించాలి. ఎప్పుడు ఎవరిని బాగా ఉపయోగించుకోవాలో.. ఎప్పుడు వారికి ప్రాధాన్యత తగ్గించాలో తెలుసుకుని ముందుకెళ్లాలి. ఇప్పుడు సీఎం చంద్రబాబు చేస్తున్న పని కూడా అదే! నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌లు కీలకం. అలాగే ఆయా నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు కూడా అంతే ముఖ్యం. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చింది. ముఖ్యంగా కొత్తగా పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇన్‌చార్జుల హవానే కొనసాగేది. కానీ ఇప్పుడు ఆ ఇన్‌చార్జులకు `పవర్` తగ్గించి కొత్త ఎమ్మెల్యేలకు అదనపు బాధ్యతలు అప్పచెబుతున్నారు. […]
ఫైర్‌బ్రాండ్ రేణుక ఢిల్లీకే పరిమితమా?
ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో ఆమె ఎంత చెబితే అంత! ముఖ్యమంత్రి ఎవరున్నా..వారెంతటివారైనా ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలి? ఎవరికి ఇవ్వకూడదు? అనే కీలక నిర్ణయాలన్నీ ఆమె కనుసన్నల్లోనే జరిగేవంటే ఆమె హవా ఎంతలా జిల్లాలో కొనసాగిందో చెప్పనవసరంలేదు! ఆమె మరెవరో కాదు ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రేణుకా చౌదరి! కానీ కొంతకాలం నుంచీ ఆమె సైలెంట్ అయిపోయారు. అటు తెలంగాణ రాజకీయాల్లోనే గాక, ఇటు ఏఐసీసీలోనూ ఆమె పేరు మచ్చుకైనా వినిపించడం లేదు. ఇప్పుడు ఆమె […]