సాక్షికి జై కొట్టిన టీడీపీ మంత్రి

విన‌డానికి, న‌మ్మ‌డానికి ఒకింత ఆశ్చ‌ర్యంగా ఉన్న‌ప్ప‌టికీ.. ఇది నిజ‌మే! టీడీపీ బ‌ద్ధ శ‌త్రువైన వైకాపా అధినేత జ‌గ‌న్ ప‌త్రిక‌ను ఆకాశానికి ఎత్తేశారు చంద్ర‌బాబు మంత్రి వ‌ర్గంలోని చింత‌కాయ‌ల‌ అయ్య‌న్న‌పాత్రుడు. సాక్షి ప‌త్రిక‌ను చ‌ద‌వంతే పొద్దు పొడ‌వ‌ద‌ని తేల్చి చెప్ప‌డంతో విన్న‌వాళ్లంద‌రూ ఇది నిజ‌మా?! అని ఒక్క‌సారిగా సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గుర‌య్యారు. వాస్త‌వానికి సాక్షి ప‌త్రిక‌కు, టీడీపీ నేత‌ల‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భగ్గుమ‌ని మండే వాతావ‌ర‌ణ‌మే ఉంటుంది. ప‌లువురు మంత్రులు, నేత‌లు సైతం సాక్షి ప‌త్రిక వేస్ట్ అని, […]

టీఆర్ఎస్ లేడీ ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి

తెలంగాణ అధికార పార్టీలో నేత‌ల మ‌ధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. గ‌త కొన్నాళ్లుగా నేత‌ల మ‌ధ్య ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌డం లేద‌నే టాక్ వ‌స్తోంది. ఎవ‌రి ఆధిప‌త్య ధోర‌ణిని వారు ప్ర‌ద‌ర్శిస్తుండ‌డం వ‌ల్లే.. ఈ ప‌రిస్థితి ఉత్ప‌న్న‌మ‌వుతోంద‌ని తెలుస్తోంది. అయితే, ఇది మ‌రింత ముదిరితే ప‌రిస్తితి ఏంట‌నేది ప్ర‌శ్న‌. తాజాగా జ‌రిగిన ఓ ఘ‌ట‌న.. ఓ మ‌హిళా ఎమ్మెల్యే, ఓ మంత్రిని మీడియాకు ఎక్కేలా చేసింది. పాత ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రి జోగు రామ‌న్న‌, ఖానాపూర్ […]

`ర‌ద్దు డ్యామేజ్` కంట్రోల్‌కు మోడీ ప్లాన్‌

దేశంలో 80 శాతానికి పైగా చ‌లామ‌ణీలో ఉన్న పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ ప్ర‌ధాని మోడీ తీసుకున్న నిర్ణ‌యం దేశాన్ని అత‌లాకుత‌లం చేసింది. అవినీతిని అంతమొందించేందుకేన‌ని ప్ర‌ధాని చెప్పిన మాట‌ల‌ను ప్ర‌జ‌లు విశ్వ‌సించారు. అయితే రెండున్న‌రేళ్లుగా ప్ర‌ధాని మోడీని ఆకాశానికెత్తేసిన అంత‌ర్జాతీయ‌ మీడియా.. ఈ నిర్ణ‌యాన్ని తీవ్రంగా విమ‌ర్శించింది. దీంతో డ్యామేజ్ కంట్రోల్‌కి బీజేపీ రంగంలోకి దిగింది. ముఖ్యంగా ఈ నిర్ణ‌యం నుంచి ప్ర‌జ‌ల‌ను మ‌ళ్లించేందుకు తాయిలాలు ప్ర‌క‌టించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. 50 రోజులు ఆగాల‌న్నారు. ప్ర‌జ‌లు స‌హ‌నంగా […]

టీఆర్ఎస్-బీజేపీ పొత్తుపై కొత్త పేచీ

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బ‌ల‌మైన జాతీయ పార్టీగా అవ‌త‌రించాల‌ని పెద్ద ఎత్తున ప్ర‌ణాళికలు సిద్ధం చేసుకుంటున్న బీజేపీకి స‌రికొత్త స‌మ‌స్య‌లు అడ్డువ‌స్తున్నాయి! 2014లో ఏపీలో చంద్ర‌బాబు పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుని నాలుగు స్థానాలు కైవ‌సం చేసుకుంది. అదేవిధంగా మంత్రివ‌ర్గంలో రెండు సీట్ల‌ను సైతం కొట్టేసింది బీజేపీ. ఇక‌, ఇదే త‌ర‌హాలో తెలంగాణ‌లోనూ అధికార కేసీఆర్‌తో చెలిమి చేయ‌డం ద్వారా లాభ‌ప‌డాల‌నేది క‌మ‌ల నాథుల వ్యూహంగా క‌నిపిస్తోంది. అయితే, కొంద‌రు మాత్రం ఏపీ మాదిరిగా టీడీపీతో పొత్తు […]

చంద్రబాబును సెల్వం అడిగింది అదేనా..

త‌మిళ‌నాడు సీఎం ప‌న్నీర్ సెల్వం అమ‌రావ‌తి బాట ప‌ట్టారు. ఆయ‌న బృందంతో క‌లిసి గురువారం ఏపీ సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. చెన్నైకి నీటి ఇబ్బందులు పెరిగిపోయాయ‌ని, తెలుగు గంగ ద్వారా నీళ్ల‌ను ఇచ్చి ఆదుకోవాల‌ని ఆయ‌న బాబుకు విన్న‌వించారు. చెన్నైలోని నీటి సమస్యపై రెండు పేజీల లేఖను చంద్రబాబుకు సెల్వం అందజేశారు. కర్నాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5 టిఎంసిల చొప్పున నీటిని తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా సరఫరా చేయాల్సి ఉందని ప‌న్నీర్ చెప్పారు. ఇప్పుడు […]

జగన్ కి సవాల్ విసిరిన టీడీపీ ఎంపి

వైకాపా అధినేత జ‌గ‌న్‌ని మ‌న‌వాడు.. మ‌న‌వాడు.. అంటూనే స‌టైరిక‌ల్‌గా విమ‌ర్శించే అనంత‌పురం ఎంపీ, టీడీపీ నేత జేసీ దీవాక‌ర్‌రెడ్డి మ‌రోసారి స్మూత్‌గా ఫైరైపోయారు. జ‌గ‌న్‌వి అన్నీ తాత‌బుద్దులేన‌ని, తండ్రి వైఎస్ బుద్దులు ఒక్క‌టి కూడా జ‌గ‌న్‌కి అబ్బ‌లేద‌ని అన్నారు.  క‌డ‌ప‌ జిల్లా పైడిపాలెంలో గండికోట‌ ఎత్తిపోతల ప‌థ‌కాన్ని బుధ‌వారం చంద్ర‌బాబు ప్రారంభించారు. అనంత‌రం బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా దివాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. వైకాపా అధినేత స‌హా ఎమ్మెల్యే గ‌డికోట శ్రీకాంత్ రెడ్డిపై తీవ్ర‌స్థాయిలో […]

కడప గడపలో టీడీపీ సవాల్

ఏపీలో అధికార‌, విప‌క్ష స‌భ్యుల మ‌ధ్య స‌వాళ్లు విసురుకోవ‌డం కామ‌న్‌గా మారింది. ఏదైనా విష‌యంపై ఇరు ప‌క్షాల నేత‌లూ స‌వాళ్లు రువ్వుకోవ‌డం.. ఆ త‌ర్వాత పోలీసులు రంగంలోకి దిగ‌డం.. ప‌రిస్తితి స‌ర్దుమ‌ణ‌గడం ష‌రా అన్న‌ట్టుగా మారింది. ఇప్పుడు కూడా ఇలాంటిదే ఒక‌టి క‌డ‌పలో చోటు చేసుకుంది. గ‌డిచిన వారం రోజులుగా సాగునీటి రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల‌ను ఏక‌బిగిన ప్రారంభించ‌డం లేదా శంకు స్థాప‌న‌లు చేయ‌డంతో బిజీ బిజీగా ఉన్న సీఎం చంద్ర‌బాబు ఈ క్ర‌మంలోనే క‌డ‌ప జిల్లా […]

ఇండియాలో నల్లధనం లెక్క తేలుతోంది

బ్లాక్ క‌రెన్సీపై స్ట్రైక్స్‌ను ప్ర‌క‌టించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. త‌న ల‌క్ష్యాన్ని సాధించే క్ర‌మంలో మ‌రింత‌గా దూసుకుపోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు నోట్ల ర‌ద్దు, కొత్త నోట్ల చ‌లామ‌ణి, ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి నోట్ల వినియోగం వంటి  విష‌యాల‌పై దృష్టి పెట్టిన మోడీ.. ఇప్పుడు తాజాగా.. న‌ల్ల‌ధ‌నాసుర‌ల‌ను ఏరివేయ‌డంపై క‌త్తిక‌ట్టారు. గ‌డిచిన రెండు రోజులుగా ఆదాయ‌ప‌న్ను అధికారులు వేస్తున్న అడుగులు ఈ దిశ‌గానే సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలోనే పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న వ‌చ్చిన న‌వంబ‌రు 8, 2016 […]

చంద్ర‌బాబు అటు – య‌న‌మ‌ల ఇటు

నోట్ల ర‌ద్దుపై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడి  వ్యాఖ్య‌లు ప్ర‌జ‌ల‌ను గంద‌ర‌గోళంలో ప‌డేస్తున్నాయి. నోట్ల ర‌ద్దుతో ఏపీకి లాభ‌మని ఒక‌రు.. అబ్బెబ్బే లాభ‌మేదీ లేదు అంతా న‌ష్ట‌మే అని మ‌రొక‌రు!! న‌గ‌దు రహిత లావాదేవీలతో ఏపీకి ఆదాయం బాగా పెరిగింద‌ని సీఎం ఒక‌ప‌క్క ఆనందం వ్య‌క్తంచేస్తుంటే.. న‌గ‌దు ర‌హితంతో రాష్ట్రం ఆర్థికంగా  కుదేలైంద‌ని ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల ఆవేద‌న వ్య‌క్తంచేస్తున్నారు. పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ ప్ర‌ధాని మోదీ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తొలుత స్వాగ‌తించిన […]