జిల్లాల పునర్విభజన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సరికొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఒకరికి పట్టున్న ప్రాంతం మరో జిల్లాలోకి వెళిపోవడంతో ఇప్పుడు నేతలు `పవర్` లేక విలవిల్లాడుతున్నారు. ఆ ప్రాంతం వేరొకరి చేతుల్లోకి వెళ్లిపోయినా.. ఆ ప్రాంతంలో పట్టుకోసం తహతహలాడుతున్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితి టీఆర్ఎస్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, మంత్రి మహేందర్ రెడ్డికి మధ్య గ్యాప్ సృష్టిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య రంగారెడ్డి జిల్లాలో ఆధిపత్య పోరు నడుస్తోంది. దీంతో ఎవరిని అదుపు చేయాలో తెలియక టీఆర్ఎస్ అధినేత […]
Category: Politics
పన్నీర్‌పై అత్తరు జల్లుతున్న అన్నాడీఎంకే
మొన్నటి వరకూ గ్రూపులుగా విడిపోయిన అన్నాడీఎంకే నేతలు.. ఇప్పుడు ఐక్యతారాగం మొదలుపెట్టారు. అందరం కలిసికట్టుగా డీఎంకే పోరాడదామని పిలుపునిస్తున్నారు. ముఖ్యంగా తిరుగుబాటు నేత పన్నీర్ సెల్వాన్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. శత్రువులతో మితృత్వం వద్దని.. అంతా కలిసి ఐక్యంగా డీఎంకేపై పోరాడదామని స్నేహ హస్తం అందిస్తున్నారు. ఎమ్మెల్యేల మెజారిటీ దక్కకపోయినా.. ప్రజల మద్దతు మాత్రం పన్నీర్ సెల్వానికే ఉందని గ్రహించిన నేతలు.. ఇప్పుడు ఆకర్షించే పనిలో పడ్డారు. ఆయన పార్టీ పెడతారని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో సరికొత్త వ్యూహానికి […]
మాస్టారి విషయంలో కేసీఆర్ అట్టర్ ప్లాప్
తెలంగాణలో తనకు ఎదురు నిలిచే నాయకుడే లేకుండా చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను.. ఒక ప్రొఫెసర్ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు! తన వ్యూహాలతో ప్రతిపక్షాలకు చిత్తు చేసిన గులాబీ దళపతి పాచికలు.. ఆయన ముందు మాత్రం కదలడం లేదు!! ఎంతో ఉద్ధండులను సామదాన బేధ దండోపాయాలతో తన అక్కున చేర్చుకున్న తెలంగాణ చంద్రుడి వ్యూహాలు.. కోదండాస్త్రం ముందు బెడిసికొడుతన్నాయి. కేసీఆర్‌ను ఇప్పుడు ఇంతలా ఇబ్బంది పెడుతున్న వ్యక్తి మరెవరో కాదు.. టీజేఏసీ చైర్మన్ కోదండరాం!! ఎంతో మంది నాయకులను […]
కోస్తాంధ్రలో వైసీపీ పరిస్థితి బాగాలేదన్న జగన్ వ్యూహకర్త
పార్టీలో సీనియర్లు ఎందరు చెప్పినా.. విశ్లేషకులు నెత్తీనోరు బాదుకుని చెబుతున్నా.. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు మాట్లాడే వైసీపీ అధినేత జగన్.. తొలిసారి ఒకరి మాట వినబోతున్నాడు. అంతేకాదు ఆయన ఆదేశాల మేరకు తన `రెండేళ్లలో నేనే సీఎం.. ఆరు నెలల్లో నేనే సీఎం.. వచ్చేది మన ప్రభుత్వమే` అనే `పేటెంట్` పదాలను కూడా వదిలేందుకు సిద్ధమయ్యాడు. వచ్చే ఎన్నికల కోసం తన ప్రసంగాల పంథాను మార్చుకోబోతున్నాడు. మరి ఈ సలహాలన్నీ ఇచ్చింది మరెవరో […]
ఆదుకొని బీజేపీ అప్పో రామచంద్రా.. అంటున్న ఏపీ
అప్పు.. పొద్దున్న లేచింది మొదలు.. నిద్రపోయే వరకూ ఏపీ యంత్రాంగం అంతా పటిస్తున్న మంత్రం!! అప్పో రామచంద్రా అంటూ.. మొక్కులు మొక్కేస్తున్నారు! ఈ అప్పుల కష్టాల నుంచి తర్వగా గట్టెక్కించు దేవుడా అంటూ ప్రార్థిస్తున్నారు! అవును.. విభజన నుంచి కోలుకోలేని ఏపీ.. ఇప్పుడు అప్పుల ఊబిలో క్రమక్రమంగా కూరుకుపోతోంది. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు బీజేపీ ముందుకు రాకపోవడం.. అటు పరిశ్రమలు కూడా హామీలకే పరిమితమవడంతో ఆర్బీఐ ముందు రుణాల కోసం చేతులు చాచాల్సి వస్తోంది. ఆదాయం కంటే వ్యయం […]
కోదండరాంను హీరోను చేసిన టీఆర్ఎస్
తెలంగాణలో అధికార టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ వర్సెస్ టీజేఏసీ చైర్మన్ కోదండరాం వార్ చినికి చినికి పెద్ద గాలివానలా మారుతోంది. కోదండరాం నిరుద్యోగుల కోసం చేపట్టిన ర్యాలీలో ముందస్తుగానే శాంతిభద్రతల పేరుతో ఆయన్ను అరెస్టు చేసినట్టు ప్రభుత్వం చెపుతున్నా వెనక చాలా రాజకీయాలు ఉన్నాయన్న విషయం తెలంగాణలో చాలామందికి తెలుస్తోంది. ఈ క్రమంలోనే కోదండరాంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం, కోదండరాంను కులం పేరుతో విమర్శలు చేయడం, ముందస్తుగా అరెస్టులు చేయడం లాంటి విషయాల్లో టీఆర్ఎస్ సెల్ఫ్‌గోల్ చేసుకుందా […]
డైలమాలో టీడీపీ సీనియర్: కొడుకు ఫ్యూచరా..? ఎమ్మెల్సీనా..?
వ్యూహాలు రచించడంలో తన తర్వాతే ఎవరైనా అని టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి రుజువు చేస్తున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలతో కొత్త కష్టాలు మొదలయ్యాయి. పార్టీలోకి చేరుతున్న వారికి ప్రాధాన్యమిస్తూ.. సీనియర్లను పక్కనపెడుతున్నారని మరో వర్గం అసంతృప్తితో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో అసంతృప్తులను చల్లార్చేందుకు బాబు ఎమ్మెల్సీ అస్త్రాన్ని సంధిస్తున్నారు. త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా సీటు కేటాయిస్తామని చెబుతూ.. వారిని బుజ్జగిస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేత కరణం బలరాం […]
జగన్‌కు షాకిచ్చిన వైసీపీ నేతలు.. నిజం తెలిస్తే ఆశ్చర్యకరం!!
కడప తర్వాత వైసీపీకి కంచుకోటగా మారిన జిల్లా ఏదంటే నెల్లూరు పేరే గుర్తొస్తుంది. కానీ అలాంటి జిల్లాలోనే వైసీపీకి పెద్ద కష్టం వచ్చి పడింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ కూడా పోటీ చేస్తుందని ప్రకటించిన నాటినుంచి ముఖ్య నేతలంగా ముఖం చాటేస్తుండటం అధిష్టానాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. ఒక పక్క అభ్యర్థి ఎవరనే విషయం ఇంకా తేలనే లేదు.. మరో పక్క […]
కోదండరాం టార్గెట్ ప్రతిపక్షాలేనా..!
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన జేఏసీ ఛైర్మన్ కోదండరాం.. ఎంట్రీతో ఇవి మరింత హీటెక్కాయి. ప్రస్తుతం విపక్షాలన్నీ ఆయన్ను ముందరుంచి సీఎం కేసీఆర్‌పై పోరాడాలని నిర్ణయించుకున్నాయి. అయితే ఇప్పుడు కోదండరాం ప్రతిపక్షాల్లో సరికొత్త టెన్షన్ మొదలైందని సమాచారం. ఆయన సొంతంగా పార్టీ పెడతారనేప్రచారం జోరుగా జరుగుతున్న తరుణంలో.. పార్టీలోంచి వలసలు ప్రారంభమైతే తమపార్టీల భవిష్యత్తు అంధకారంలో పడిపోయినట్టేనని ఆందోళన చెందుతున్నాయి. అసలే కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు సగం […]