అవును! ఇప్పుడు దాదాపు అందరూ ఇదే కోణంలో ఆలోచిస్తున్నారు! ఏపీ తెలంగాణల్లో అత్యంత సీనియర్ బీజేపీ నేత వెంకయ్యనాయుడు. అలాంటి నేతను ఇప్పుడు ఉన్న పళాన ఎలాంటి రాజకీయ ప్రాధన్యం లేని కేవలం రాజ్యాంగ బద్ధ పదవి అయిన ఉపరాష్ట్రపతికి పరిమితం చేయడం? రాజకీయాలపై కనీసం మాట మాత్రమైనా మాట్లాడే అవకాశం లేకుండా చేయడం? వంటి పరిణామాలు నిజంగా వెంకయ్య వెనుక ఏదో జరిగిన అనుమానాలకు తావిస్తున్నాయి. మైకు పట్టుకుంటే అనర్గళంగా మాట్లాడడమే కాదు, తనకే ప్రత్యేకమైన […]
Category: Politics
కేసీఆర్‌కి ఝలక్..టీఆర్ఎస్‌కి తొలి దెబ్బ!
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరు ఎప్పుడు ఎలా మారతారో? ఎప్పుడు ఎవరితో ఎలాంటి అనుబంధం ఏర్పడుతుందో? ఎప్పుడు ఎవరు ఎవరితో అనుబంధాన్ని కట్ చేసుకుంటారో? చెప్పడం అంత వీజీకాదు!! కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్న నేతలు ఆ తర్వాత కత్తులు దూసుకున్న పరిస్థితులు మన తెలుగు నాట కొత్తకాదు. అదేసమయంలో కత్తులు నూరుకుని.. ఆనక అవసరార్ధం కౌగిలింతలకు సిద్ధమైన నేతలూ మనకు తెలుసు. ఇప్పుడు ఇదే జాబితాలో చేరనున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ ఉరఫ్ […]
జనసేనలోకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బద్ద శత్రువు!
కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎంపీ హర్షకుమార్ స్టైలే వేరు. ఆయన ముక్కుసూటితనంతో వ్యవహరిస్తుంటారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు ఏపీ, తెలంగాణలో ఆయనకు ఎదురు చెప్పేందుకే చాలామంది నాయకులు భయపడేవారు. అలాంటిది హర్షకుమార్ వైఎస్‌తో తీవ్రంగా విబేధించారు. 2009 ఎన్నికల్లో హర్షకుమార్‌కు టిక్కెట్ రాకుండా ఉండేందుకు వైఎస్ శతవిధాలా ప్రయత్నాలు చేసినా హర్షకుమార్ సోనియాగాంధీ దగ్గరే చక్రం తిప్పుకుని సీటు దక్కించుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ రాజకీయాల్లో యూత్ కాంగ్రెస్ నేతగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన […]
బాబుకు షాక్: టీడీపీ ఎమ్మెల్సీకి జగన్ ఎమ్మెల్యే సీటు ఆఫర్
ఏపీలో కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గ ఉప ఎన్నిక ట్విస్టులతో రసవత్తరంగా మారుతోంది. ఇక్కడ గత ఎన్నికల్లో గెలిచిన భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరడం, తర్వాత హఠాన్మరణం చెందడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. ఆయన మృతి చెంది సెప్టెంబర్ 12వ తేదీ నాటికి ఆరు నెలలు పూర్తవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ లోగానే ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నాలుగైదు రోజుల్లోనే నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ […]
ఉంగుటూరు ఎమ్మెల్యే గన్నిది కొత్త రూటా..? పాత రూటా..?
ఏపీలో అధికార టీడీపీకి కంచుకోట లాంటి జిల్లా పశ్చిమగోదావరి. నియోజకవర్గాల పునర్విభజన వార్తలు ఇక్కడ చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను టెన్షన్ పెట్టిస్తున్నాయి. నియోజకవర్గాలు కొత్తగా మారితే ? తాము ఎక్కడ నుంచి పోటీ చేయాలి ? అన్న ప్రశ్న ఇప్పుడు వీళ్లకు పెద్ద సంకటంగా మారాయి. ఈ క్రమంలోనే ఉంగుటూరు టీడీపీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎక్కడ నుంచి పోటీ చేస్తారు ? ఆయన రూటు ఎలా ? ఉంటుంది ? […]
అఖిల మారకపోతే ఆళ్లగడ్డలో ఈ సారి కష్టమే
కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ ప్రభావం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం భూమా ఫ్యామిలీకి కంచుకోట. ఈ నియోజకవర్గం భూమా ఫ్యామిలీకి ఎంత బలమైన నియోజకవర్గం ఏంటంటే ఇక్కడ ఐదుసార్లు గెలిచిన దివంగత భూమా నాగిరెడ్డి సతీమణి, దివంగత శోభా నాగిరెడ్డి టీడీపీ – ప్రజారాజ్యం – వైసీపీ ఇలా ఎన్ని పార్టీలు మారినా ఆమే గెలిచింది. ఇక్కడ పార్టీ ఇమేజ్ కంటే భూమా ఫ్యామిలీ ఇమేజే గట్టిగా పనిచేసిందని స్పష్టమవుతోంది. ఇక […]
నంద్యాలలో టీడీపీకి వైసీపీ గట్టిపోటీ!
నంద్యాల ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇంకా విడుదల కాకముందే అధికార పార్టీ టీడీపీ ఎన్నికల వేడిని అమాంతం పెంచేసింది. సాక్షాత్తూ.. చంద్రబాబే నేరుగా నంద్యాలలో ఇప్పటికి రెండు సార్లు పర్యటించారు. రాత్రు ళ్లు కూడా ఆయన అక్కడే మకాం వేస్తూ.. ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుబట్టారు. మరి అధికార పక్షం ఇంతచేస్తే.. అసలు ఈ సీటు నుంచి 2014లో గెలుపొందిన వైసీపీ ఊరుకుంటుందా? జగన్ అసలు ఊరుకుంటాడా? మళ్లీ తామే ఈ సీటు నుంచి గెలిచి […]
సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఎర్త్ పెడుతోన్న కవిత
పాలిటిక్స్‌లో ఎప్పుడు ఏమౌవుతుందో చెప్పడం కష్టం. ఎప్పుడు అయిన వాళ్లు పగవాళ్లవుతారో ఊహించడమూ కష్టమే. ఇప్పుడు ఇలాంటి వాతావరణమే తెలంగాణలో ఏర్పడింది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ కూతురు ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్‌లో రకరకాల సిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. సిట్టింగులకు పొగబెట్టే కార్యక్రమాలు వరుసగా జరిగిపోతున్నాయి. విషయంలోకి వెళ్తే.. నిజామాబాద్‌లోని బాల్కొండ నియోజకవర్గం తెలంగాణ ఉద్యమానికి ఊతాన్నిచ్చిన నియోజకవర్గం. ఇక్కడి నుంచి కేసీఆర్ ఆశీస్సులతో ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన గెలిచి మూడేళ్లు పూర్తయింది. అంతా సజావుగానే […]
కొత్త పలుకులో చెత్త ఆలోచనలో…ఈ గ్యాసిప్‌కు అంతేలేదా!
లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు చెప్పడం కొన్ని పత్రికలకు అలవాటుగా మారిందనే నానుడి తెలిసిందే. తాజాగా ఆంధ్రజ్యోతి అధినేత ఆదివారం రాసిన కొత్త పలుకు ఈ నానుడిని మరోసారి రుజువు చేస్తోంది! వారం వారం ఎడిట్ పేజీలో అరసగం పైనే అచ్చొత్తే.. ఈ వ్యాఖ్యానం ఇటీవల పూర్తి నిరాధారంగా మారిపోయిందని, అతిశయోక్తులకు అడ్డాగా మారిపోయిందని పలువురు చెప్పుకోవడం ఆశ్చర్యంగా అనిపించినా నిజం. తాజా విషయానికి వస్తే.. చాన్నాళ్ల తర్వాత ఏపీ నుంచి రాజ్యాంగ బద్ధ పదవైన ఉపరా […]
