`మా అన్న ఓడిపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తా` అంటూ ప్రకటించిన నాటి నుంచి నంద్యాలలో గెలుపుకోసం అహర్నిశలు కష్టపడుతున్నారు భూమా నాగిరెడ్డి కూతురు, మంత్రి అఖిలప్రియ. ప్రచారంలో అంతా తానై వ్యవహరిస్తూ.. అన్న విజయానికి శ్రమిస్తున్నారు. ఇదే సమయంలో ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు పార్టీకి ఎక్కడ మైనస్ అవుతాయో అని నేతలు టెన్షన్ పడుతున్నారట. పార్టీ సీనియర్లతో చర్చించకుండా సొంతంగా ఆమె వ్యవహరించడం వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభముండదని తెగేసి చెబుతున్నారట. ప్రస్తుతం […]
Category: Politics
జనసేనలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే
జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎప్పుడు `ఊ` అంటారా.. ఎప్పుడు ఆ పార్టీలోకి వెళిపోదామా? అని ఎంతోమంది నేతలు వేచిచూస్తున్నారు. ఈ లిస్టులో తెలుగుదేశం పార్టీ నేతలు ముందువరుసలో ఉన్నారు. అక్టోబర్ నుంచి ప్రజా క్షేత్రంలో దిగుతానని, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తానని.. పవన్ ప్రకటించడంతో అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. అయితే ఇప్పుడు జనసేనలో మాజీ ఎమ్మెల్యే చేరబోతున్నారనే వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయనకు జనసేన టికెట్ కూడా ఖాయమైందని అందుకే […]
తెలంగాణ టీడీపీలో కుదుపు.. సీనియర్ నేత ఆ పార్టీలోకి జంప్!
తెలంగాణలో టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బతగిలింది. ఆ పార్టీ ఇప్పటికే కేడర్ లేక, సీనియర్లు జంప్ చేసి ఇలా అనేక రకాల ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణలో బలపడడంపై ఇప్పటికే అనేక రకాలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే, 2019 నాటికి కొంత సమయం ఉండడం ఆయా ప్లాన్‌లను అప్పటిలోగా అమలు చేయాలని, ముఖ్యంగా కేడర్ జారిపోకుండా చూసుకోవాలని ఆయన స్థానిక తమ్ముళ్లకు గట్టి ఆదేశాలిచ్చారు. అయితే, పార్టీ ఇప్పట్లో […]
ఆయనపై ఎన్నోఆశలు… కానీ`హ్యాండ్` ఇస్తున్నాడా!
ఎంపీ చిరంజీవి.. ఈ పేరు పొలిటికల్ స్క్రీన్‌పై వినిపించి చాలా రోజులైంది. మెగాస్టార్ చిరంజీవి అనే పేరు కొంత కాలం నుంచి ఎక్కువగా వినిపిస్తోంది. రెండింటికీ తేడా ఏమీ లేకపోయినా.. పిలుపులోనే చాలా వ్యత్యాసం ఉంది. రాష్ట్ర విభజన అనంతరం.. ఏపీలో కాంగ్రెస్‌కు అండగా చిరు ఉంటాడని ఆయనపై ఎన్నోఆశలు పెట్టుకుంది అధిష్ఠానం. కానీ వాటిని వమ్ము చేసి.. తనమానాన సినిమాలు చేసుకుంటూ బిజీబిజీ అయిపోతున్నాడు మెగాస్టార్!! రాజకీయాలకు సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ కనీసం మచ్చుకైనా కనిపించిన […]
నంద్యాల ఖర్చు ఎన్ని కోట్లో తెలుసా..!
అవును! నంద్యాల ఉప ఎన్నికల ఖర్చు నామినేషన్ల ఘట్టానికి ముందే వందల కోట్లు దాటేసిందని అంటున్నారు అధికార, విపక్ష అభ్యర్థుల సన్నిహితులు. సాధారణంగా ఎన్నికలన్నాక ఖర్చు తప్పదు. అయితే, నంద్యాల ఉప పోరు మాత్రం ఖర్చును మరింతగా పెంచేసిందని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం.. ఆయా పార్టీల నేతలేనట! ఈ ఉప ఎన్నికను టీడీపీ, వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. దీంతో అభ్యర్థులకు ఖర్చు కూడా అందనంత ఎత్తుకు చేరిపోయిందని అంటున్నారు. టీడీపీ, వైసీపీ నేతలు […]
ఆ మైలేజీ స్ట్రాటజీ జగన్‌కే పెద్ద దెబ్బ!
మనిషన్నాక ఒకటి రెండు తప్పులు సహజం. ఇక, రాజకీయ నేతన్నాక.. మరో నాలుగు తప్పులు సహజం. కానీ, వైసీపీ అధినేత జగన్ ను చూస్తుంటే మాత్రం పదే పదే అదే తప్పులతో ఆయన తన ఇమేజ్‌నే కాకుండా పార్టీ ఇమేజ్‌ను కూడా తీవ్రస్థాయిలో తగ్గించేసుకుంటున్నారు. తాజాగా నంద్యాల ఉప ఎన్నికల విషయంలో ఆయన అనుసరిస్తున్న వైఖరి… చేస్తున్న కామెంట్లు.. సొంత పార్టీ నేతలకే నచ్చడం లేదంటే.. జగన్ వైఖరి ఎలా ఉందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. సాధారణంగా […]
టీడీపీలో నాడు హీరో – నేడు జీరో
నేటి రాజకీయ నేతలకు ముఖ్యంగా చంగు చంగున గెంతులేసుకుంటూ అవసరానికి తమ ఇష్టం వచ్చినట్టు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపింగులు చేసే జిలానీలకు కొత్తపల్లి సుబ్బారాయుడు ఓ లెస్సన్‌లాగా కనిపిస్తున్నారు!! పార్టీ మారడం తప్పుకాకపోవచ్చేమో కానీ.. పార్టీలను మార్చడమే తప్పు.. అనే నీతి సుబ్బారాయుడు పొలిటికల్ హిస్టరీ నేర్పుతున్న సరికొత్త లెస్సన్. అవసరాలు, వ్యాపార సామ్రాజ్యాల విస్తరణే లక్ష్యంగా ప్రజలు ఇచ్చిన తీర్పును కాలదోసి.. పార్టీ కండువాలను కుడి భుజం మీద ఒకటి.. ఎడం […]
త్వరలోనేనా రేవంత్ దండయాత్ర!
తెలంగాణలో 2019లో సీఎం కేసీఆర్‌ను ఎలాగైనా గద్దె దింపాలన్న టార్గెట్‌తో కులాలు, రాజకీయ నాయకులు, మేథావులంతా ఒక్కటయ్యే వేదిక త్వరలోనే ఏర్పాటు అవుతోంది. ప్రస్తుతం అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ టీఆర్ఎస్సే గెలుస్తుందని, కేసీఆరే సీఎం అవుతారని అందరూ చెపుతున్నారు. అక్కడ విపక్షాలు చాలా వీక్ అవ్వడం కూడా కేసీఆర్‌కు బాగా కలిసిరానుంది. వచ్చే ఎన్నికల వేళ ఏదైనా అనూహ్యం జరిగితే తప్ప మళ్లీ టీఆర్ఎస్సే గెలుస్తుందని చాలా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే […]
బాబు ఏరి కోరి తెచ్చుకుంటే బల్లెమవుతున్న మంత్రి!
ఇప్పటికే మంత్రులపై విపరీతమైన ఆరోపణలు.. ఒకరితో ఒకరికి సఖ్యత లేకపోవడం.. ఇలా సీఎం చంద్రబాబుకు మంత్రుల వల్ల తలనొప్పులు తప్పడం లేదు. ఇక తాజాగా మరో మంత్రిపై ఆయనకు ఫిర్యాదులు అందడం.. చర్చనీయాంశంగా మారింది. ఇసుక మాఫియా, డ్రగ్ మాఫియా.. ఇలా ఏపీలో ఆయిల్ మాఫియా కూడా చెలరేగుతోందనే విమర్శలు జోరందుకుం టున్నాయి. అంతేగాక దీనికి ఒక మంత్రి అండగా నిలుస్తున్నారని, కమీషన్లు తీసుకుంటూ దందాలకు పాల్పడుతు న్నారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఈ విషయంపై పారిశ్రామిక […]