మోసం గురూ.. మోడీ ఎంత ప‌నిచేశాడు!

పాలిటిక్స్‌లో ఆరితేరిన వారు ఎలా ఉంటారో చూపించాలంటే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఫొటో చూపిస్తే స‌రిపోతుంది! అని మొన్నామ‌ధ్య బిహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ చెప్పుకొచ్చారు. ఆయ‌న అలా అన్నప్పుడు స‌హ‌జంగానే ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టి.. త‌మ పార్టీని గ‌ద్దె నెక్కించిన నేప‌థ్యంలో లాలూ అలా కామెంట్ చేసి ఉంటాడ‌ని అంద‌రూ అనుకున్నారు. సాధార‌ణంగా తెలుగు వాళ్ల‌కు జాలి ఎక్కువ‌. చాలా విష‌యాల్లో క్ష‌మించేసుకుంటూ పోతుంటారు. అలాంటి తెలుగు వారికి సైతం ఇప్పుడు మోడీ పేరెత్తితే […]

టీడీపీ ఎమ్మెల్యే సొంత పార్టీకి రెడీ

క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరైన టీడీపీలో.. కొంత‌మంది నేత‌లు ఇప్పుడు నేత‌లు లైన్ దాటుతున్నారు. అసంతృప్తి అంత‌గా వినిపించ‌ని పార్టీలో.. నిర‌స‌న గ‌ళం చాలా చోట్ల వినిపిస్తోంది. ఆశించిన ప‌ద‌వి ద‌క్క‌న‌ప్పుడు అల‌క‌లు స‌హ‌జ‌మే అయినా.. నేత‌లంతా బోర్డ‌ర్ క్రాస్ చేసేస్తున్నారు. మ‌రికొంద‌రు మ‌రో అడుగు ముందుకేసి సొంత పార్టీ పెట్టుకుంటామ‌ని ప్ర‌క‌టించేస్తున్నారు. మొన్న‌టికి మొన్న మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌ని దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఇలాంటి ప్ర‌క‌ట‌నే చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఇప్పుడు టీటీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం […]

జ‌గ‌న్ కోట‌లో టీడీపీ ఖుషీ.. రీజ‌న్ ఇదే!

క‌డ‌ప గ‌డ‌ప‌లో పాగా వేసేందుకు ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫలించాయా?  ప‌్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌ కంచుకోట బ‌ద్ద‌లు కొట్టేందుకు వ్యూహాత్మ‌కంగా తీసుకున్న నిర్ణ‌యాలు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయా? ఇక కంచుకోట‌లో జ‌గ‌న్ పని అయిపోయిందా? అంటే అవున‌నే అంటున్నారు క‌డ‌ప టీడీపీ నేత‌లు! నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత‌.. వైసీపీ గ్రాఫ్ ప‌డిపోతోందనే చ‌ర్చ రాష్ట్ర‌మంతా జ‌రుగుతోంది. వైసీపీ బ‌లంగా ఉన్న జిల్లాల్లో సైకిల్ దూసుకుపోతోంద‌ని స‌ర్వేల్లో కూడా స్ప‌ష్ట‌మ‌వుతోంది. […]

మోడీ-ప‌వ‌న్ దూరంపై చంద్ర‌బాబు టెన్ష‌న్‌

2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఒక‌వైపు మోడీని.. మ‌రోవైపు ప‌వ‌న్‌ను పెట్టుకుని నెట్టుకొచ్చేశారు టీడీపీ అధినేత చంద్ర బాబు! అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా బీజేపీతో దోస్తీ.. జ‌నసేన‌తో మైత్రి.. కొన‌సాగిస్తూ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తూ వ‌స్తున్నారు. ఇప్పుడు మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో.. మిత్రుల మ‌ధ్య దూరం పెర‌గడం ఆయ‌న్ను తీవ్రంగా ఇబ్బందుల‌కు గురిచేస్తోంద‌ట‌. ముఖ్యంగా బీజేపీ-జ‌న‌సేన మ‌ధ్య గ్యాప్ వ‌ల్ల‌.. టీడీపీ శ్రేణుల్లో ఆందోళ‌న మొద‌లైంద‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీతో దోస్తీ త‌ప్ప‌దు.. అలాఅని జ‌న‌సేన‌తోనూ వైరం […]

స‌దావ‌ర్తి భూముల్లో ఆ మంత్రి చ‌క్రం

గ‌డిచిన రెండేళ్లుగా ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన స‌దావ‌ర్తి స‌త్రం భూముల వ్య‌వ‌హారం తాజాగా మ‌రో కీల‌క మ‌లుపు తిరిగింది. అమ‌రావ‌తి ప్రాంతంలోని స‌దావ‌ర్తి స‌త్రం అనాథ‌లు, పేద‌ల‌కు మ‌ధ్యాహ్న భోజ‌నం అందించేది. పూర్తిగా విరాళాల‌పై ఆధార‌ప‌డిన ఈ సత్రానికి ఓ దాత త‌మిళ‌నాడులో చెన్నైకి 30 కిలో మీట‌ర్ల‌లో ఉన్న దాదాపు 100 ఎక‌రాల‌కు పైగా స్థ‌లాన్ని ఇచ్చాడు. అయితే, ఇప్పుడు స‌త్రం బాగోగులు అన్నీ దేవాదాయ శాఖ ప‌రిధిలో కి రావ‌డంతో చెన్నై భూముల‌ను […]

ఎన్టీఆర్ వేదాంతంలో బాబు టార్గెట్ 

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. సినిమాల్లో త‌న‌కంటూ సొంత ప్లాట్ ఫాం ఏర్పాటు చేసుకున్న నంద‌మూరి వంశాంకురం. త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా అభిమానులను సొంతం చేసుకున్న తార‌క్‌.. తాజాగా జై ల‌వ‌కుశ పేరుతో బ్లాక్ బ్ల‌స్ట‌ర్ మూవీ అందించేందుకు రెడీ అయ్యాడు. గురువారం విడుద‌ల కానుక్క ఈ మూవీకి సంబంధించి అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక‌, ఈ మూవీ సొంత బ్యాన‌ర్‌పై తీయ‌డంతో నంద‌మూరి కుటుంబం కూడా భారీ […]

స‌భ్య‌త్వ న‌మోదులో జ‌న‌సేన కొత్త పంథా..!

పార్టీ స‌భ్య‌త్వానికి జ‌న‌సేన తెర‌లెత్తింది. 2014లోనే స్థాపించిన‌ప్ప‌ట‌కీ.. అప్ప‌టి ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్న ఈ పార్టీ.. 2019పై మాత్రం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పాల్గొంటామ‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. తాను అనంత‌పురం నుంచి బ‌రిలోకి దిగుతున్న‌ట్టు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు ప‌వ‌న్ దృష్టి పెట్టారు. ఇప్ప‌టికే జిల్లాల వారీగా నేత‌లు, కార్య‌క‌ర్త‌ల ఎంపిక సాగింది. ఒక్కొక్క రంగంలో అనుభ‌వం, వారి పాండిత్యాన్ని బ‌ట్టి నేత‌ల‌ను ఎంపిక చేశారు. ఇక‌, […]

జ‌గ‌న్ ఒక్క మ‌గాడ‌ట‌! హీరోయిన్ స్టేట్‌మెంట్ అదిరింది

వైసీపీ అధినేత‌, ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ గురించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ అన‌ని, విన‌ని కామెంట్ ఒక‌టి మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. జ‌గ‌న్ అంటే ఒక్క మ‌గాడ‌ని తెగ మురిసిపోతూ చెబుతోంది హీరోయిన్ సునీతా రాణా! ఆశ్చ‌ర్యంగా అనిపించినా ఇది నిజ‌మ‌ని ఈ అమ్మ‌డు ఒట్టేసి మ‌రీ చెబుతోంది. జ‌గ‌న్‌ని అస‌లు ఈ కోణంలోనే ఆలోచించ‌ని అనేక మంది ఇప్పుడు ఆ దిశ‌గా త‌మ ఆలోచ‌న‌ను సాగిస్తున్నారు. నిజానికి జ‌గ‌న్ మంచి య‌వ్వ‌నంలో ఉన్న […]

అమ‌రావ‌తి విరాళాల సంగ‌తేంటి?

ప్ర‌స్తుతం ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి సంబంధించి అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న మేర‌కు నూతన రాజ‌ధాని నిర్మాణానికి కేంద్రమే నిధులు కేటాయించాలి. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఒకసారి 2500 కోట్లు, రూ.1000 కోట్లు చొప్పున మొత్తంగా రూ.3500 కోట్లు ఇచ్చింది. ఇక‌, ఈ డ‌బ్బుల‌కు సంబంధించిన ఖ‌ర్చుల వివ‌రాల‌ను, బిల్లుల‌ను స‌మ‌ర్పిస్తే.. మ‌రింత‌గా ఇచ్చేందుకు రెడీ అని ఇటీవ‌ల అరుణ్ జైట్లీ నుంచి ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామకృష్ణుడికి లేఖ అందింది. […]