చంద్ర‌బాబు బ‌ర్త్‌డే..చిరు స్పెష‌ల్ విషెస్‌!

తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నేడు 71వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే కరోనా వేగంగా విస్తరిస్తున్న సమయంలో తన పుట్టిన రోజు వేడుకలు ఎవరూ చేయొద్దని స్వయంగా చంద్రబాబే అభిమానులు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ఇక చంద్ర‌బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా విషెస్ తెలుపుతున్నారు. ఈ క్ర‌మంలోనే మెగా స్టార్ చిరంజీవి కూడా చంద్ర‌బాబుకు […]

బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ సీఎంకు కరోనా పాజిటివ్..!

ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ ఏవిధంగా ఉగ్రరూపం దాలుస్తుం దో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పెద్ద అని తేడా లేకుండా కరోనా వైరస్ రోజు రోజుకి దేశంలో తన ఉద్రితిని కొనసాగిస్తూ ఉంది. రోజుకి సరాసరి రెండు లక్షలకు కేసులు దేశంలో నమోదవుతున్నాయి. ఇకపోతే తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది.     సీఎం చంద్రశేఖర రావుకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో […]

ఏపీ ఇంటర్, 10వ పరీక్షల షెడ్యుల్ విడుదల…!

తాజాగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న నేపథ్యంలో భాగంగా 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు రాష్ట్ర సర్కారు సెలవులు ప్రకటించింది. ఇకపోతే టెన్త్, ఇంటర్ విద్యార్థులు సంవత్సరాన్ని నష్ట పోకుండా ఉండేందుకు ఖచ్చితంగా పరీక్షలను నిర్వహించి తీరుతామని ఆంధ్రప్రదేశ్ సర్కారు మరోసారి తన క్లారిటీ ఇచ్చినట్లయింది. ఇకపోతే ఇది వరకు ప్రకటించిన షెడ్యూల్ విధంగానే పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి తెలియజేశారు. అయితే పదో తరగతిలో ఇదివరకు ఉన్న […]

రేపటి నుంచి ఏపీలో స్కూల్స్ బంద్…!

ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ రెండవసారి ఎలా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎన్ని అనేక ప్రాంతాలలో లాక్ డౌన్ విధిస్తూ పెద్ద ఎత్తున ఆకాంక్షలను విధిస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు ఉగ్రరూపం దాల్చడంతో జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..   తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ రేపటి […]

పీఆర్సీ ఫైల్‌పై కేసీఆర్ సంత‌కం.. కానీ ఒక చేదువార్త‌..!

ప్ర‌భుత్వ ఉద్యోగులకు సంబంధించిన వేతన సవరణ ఫైల్‌కు సీఎం కేసీఆర్​ ఆమోదముద్ర వేశారు. దీంతో వారి పీఆర్సీకి క్లియర్ అయింది. వాస్త‌వానికి 10న వేతన సవరణకు ఆర్థిక శాఖ ఒకే చెప్పి సీఎం సంతకం కోసం ఫైల్​ను పంపించారు. వాస్తవానికి ఈ నెల 21లోగా క్లియరెన్స్​ రాకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఏరియర్స్​ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించారు. అయితే సాగర్​ ఉప ఎన్నికలు, ఇప్పుడు వచ్చిన పుర ఎన్నికల నేపథ్యంలో సమయం కుదరకపోవడంతో ఫైల్​ పెండింగ్​ పడింది. […]

క‌రోనాతో బీజేపీ సీనియ‌ర్ నేత మృతి..!

కాషాయ‌ద‌ళంలో క‌రోనా మ‌హ‌మ్మారి క‌ల్లోలం రేపుతున్న‌ది. ఇప్ప‌టికే ప‌లువురు సీనియ‌ర్‌, జాతీయ స్థాయి నేత‌లు, కేంద్ర మంత్రులు సైతం వైర‌స్ బారిన ప‌డ్డారు. అందులో కొంద‌రు కోలుకోగా, మ‌రికొంద‌రు ప్రాణాల‌ను విడిచారు. ఇప్పుడు తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి భవర్ లాల్ వర్మ శనివారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరోనా బారిన ప‌డి ఫిబ్రవరి 28న సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చేరారు. […]

ఒడిశా సీఎంకు జ‌గ‌న్ లేఖ‌.. కీల‌క ప్ర‌తిపాద‌న‌

న‌వ‌ర‌త్నాల పేరుతో సంక్షేమ ప‌థ‌కాల‌తో దూసుకుపోతున్న ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అభివృద్ధి పైనా దృష్టి సారించారు. అంద‌రి మ‌న్న‌న‌ల‌ను అందుకుంటున్నారు. సాగునీటి ప్రాజెక్టుల‌ను కూడా ప‌రుగులు పెట్టిస్తున్నారు. గ‌తంలో చేప‌ట్టిన ప్రాజెక్టుల‌నే కాకుండా నూత‌న ప్రాజెక్టుల‌కు శ్రీ‌కారం చుట్టేందుకు చ‌క‌చ‌కా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం లేఖ రాశారు. కీల‌క ప్ర‌తిపాద‌న చేశారు. ఒడిశా, ఏపీ ప‌క్క‌ప‌క్క రాష్ట్రాలు అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. […]

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు మ‌రో షాక్‌.. జ‌న‌సేన‌కు బ్రేక్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు వ‌రుస‌గా షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. సుదీర్ఘ విరామం త‌రువాత తాను న‌టించిన సినిమా వ‌కీల్ సాబ్ ఇటీవ‌ల విడుద‌ల‌యినా ఆశించిన‌స్థాయిలో విజ‌యాన్ని మాత్రం సొంతం చేసుకోలేదు. దాని నుంచి తేరుకోక‌ముందే పవన్ కళ్యాణ్ కరోనా వైర‌స్ బారిన ప‌డ‌డంతో ఫ్యాన్స్ మ‌రింత ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇప్పుడు సినిమాల ప‌రంగానే కాదు తాజాగా రాజ‌కీయ ప‌రంగానే ప‌వ‌న్‌కు మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. పార్టీ జ‌న‌సేన ఉనికికే తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌మాదం ఏర్ప‌డింది. ఇంత‌కీ […]

కేటీఆర్‌పై హెచ్ఆర్‌సీలో మ‌హిళ ఫిర్యాదు..! ఎందుకంటే..

ఇటీవ‌ల మంత్రి కేటీఆర్ వ‌రంగ‌ల్‌లో ప‌ర్య‌టించారు. రూ.1700 కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టారు. అదేవిధంగా వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌పైనా దృష్టిసారించారు. గులాబీ నేత‌ల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించి దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉండ‌గా గురువారం ఉద‌య‌మే పుర‌పాల‌క ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు న‌గారా మోగ‌డం గ‌మ‌నార్హం. అద‌లా ఉంచితే మంత్రి కేటీఆర్ పై ఓ మ‌హిళ ఏకంగా మాన‌వ హ‌క్కుల సంఘంలో ఫిర్యాదు చేయ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం సంత‌రించుకుంది. ఎన్నిక‌ల వేళ ఇది ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. వివ‌రాల్లోకి […]