కరోనా చికిత్సకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. కరోనా చికిత్సలో ఉపయోగించడం కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన 2-డయాక్సి-డీ గ్లూకోజ్(2డీజీ) ఔషధం విడుదలైంది. ఢిల్లీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తొలి బ్యాచ్ 2 డీజీ సాచెట్లను కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కు అందించారు. ఆరోగ్యమంత్రి వాటిని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాకు అందజేశారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. 2డీజీ డ్రగ్ తో […]
Category: Politics
కరోనాతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత..!
కరోనా సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు ఎంతో మందిని బలితీసుకుంటోంది. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ఇప్పుడు మన దేశాన్ని పట్టి పీడిస్తుంది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. కొంతమంది ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. చాలా కుటుంబాల్లో కరోనా విషాదాన్ని నింపుతోంది. ఎంతో మందిని బలితీసుకుంటోంది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాతావ్ ఆదివారం కరోనాతో మృతి చెందారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆయన […]
రఘురామ కృష్ణకి షాక్ ఇచ్చిన కోర్టు…?
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఆయన వేసిన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వాదనలు విన్నాక.. బెయిల్ కోసం సెషన్స్ కోర్టుకు వెళ్లాలని రఘురామకృష్ణరాజుకు సూచించింది. ఆయనను సీఐడీ కోర్టులో హాజరు పరచాలని సీఐడీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నేరుగా హైకోర్టుకు రాకుండా కింది కోర్టుకు వెళ్లాలని సూచించింది. ఈ క్రమంలో సీఐడీ అధికారులు ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం […]
శోకసంద్రంలో దిధీ…ఎందుకంటే ..?
కరోనా భూతం అందర్నీ పట్టి పీడిస్తోంది. ఈ మహమ్మారికి నేడు చాలా మంది బలైపోతున్నారు. చిన్న చిన్న నాయకుల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకూ చాలా మంది కరోనా కాటుకు కన్నుమూశారు. సినీ ప్రముఖులో చాలా మంది కరోనా పోరాడి బయటపడుతుంటే మరికొందరు ప్రాణాలు విడిచారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు..ఇలా అధికారుల దగ్గిరి నుంచి కార్యకలాపాలు సాగించే నాయకుల వరకూ కరోనా మహమ్మారికి బాధపడుతూనే ఉన్నారు. ఇప్పటికే ఎంతో మందిని బలి తీసుకున్న ఈ […]
బ్రేకింగ్ : రఘురామ కృష్ణంరాజు అరెస్ట్..ఎందుకంటే..?
ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నర్సాపురం ఎంపీ, వైసీపీ నేత రఘురామకృష్ణ రాజును ఏపీ సీఐడీ పోలీసులు 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసులో అరెస్ట్ చేశారు. నివేదికల ప్రకారం 30 మంది సీఐడీ అధికారులు 10 కార్లలో రఘురామకృష్ణ రాజును అరెస్ట్ చేయడానికి హైదరాబాద్‌లోని అతని నివాసానికి వెళ్లగా వారిని సీఆర్పీఎఫ్ పోలీసులు అడ్డగించారు ఐతే తమ ఉన్నతాధికారుల పర్మిషన్ ఉంటేనే అదుపులోకి తీసుకునేందుకు తాము అంగీకరిస్తామని సీఆర్పీఎఫ్ […]
సినీ నటి కీర్తి రెడ్డి ఇంట్లో విషాదం
సినీ ఇండస్ట్రీలో రోజుకో విషాదం చోటుచేసుకుంటూ ఉంది. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు..ఇలా చాలా మంది కరోనా బారిన పడి ప్రాణాలు విడుస్తున్నారు. నిజామాబాద్‌కు చెందిన టిఆర్‌ఎస్ నాయకులు, ప్రముఖ సినీ నటి కీర్తి రెడ్డి తండ్రి కేశ్‌పల్లి (గడ్డం) ఆనంద్ రెడ్డి (60) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమాశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆనంద్ రెడ్డికి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆనంద్ రెడ్డి […]
మత్స్యకారులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు రాష్ట్రంలో ఇరవై వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నారు. ఈ మహమ్మారిని అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ జగన్ సర్కార్ సంక్షేమ పథకాల అమలులో ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. తాజాగా మత్స్యకారులకు సీఎం జగన్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద వరుసగా మూడో […]
వాయిదా పడ్డ ఎమ్మెల్సీ ఎన్నికలు..?
కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. విద్యార్థులకు చాలా వరకూ పరీక్షల్ని రద్దు చేశాయి. మరి కొన్నింటిని వాయిదా వేశాయి. ఇటువంటి తరుణంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా వాయిదా వేశాయి. ఇంకొన్ని రోజుల్లో ఏపీ, తెలంగాణలోని పలువురు ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తవ్వుతుంది. మొత్తంగా చూసినట్లైతే ఆంధ్రప్రదేశ్ లోని ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం మేనెల 31వ తేదితో పూర్తయ్యిపోతుంది. ఇకపోతే తెలంగాణలో కూడా ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ నెల 3వతేదితో […]
ఏపీ మంత్రి ఇంట విషాదం..!
కరోనా టైంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఇంట విషాదాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే సెలబ్రిటీల కుటుంబాల్లో కొందరు ప్రాణాలు వదిలిన సంఘటనలు ఉన్నాయి. అందులో కొందరు అనారోగ్యం వల్ల చనిపోతే మరికొందరు కరోనాకు బలైపోయిన వారు ఉన్నారు. తాజాగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి వెల్లంపల్లి సూర్యనారాయణ (80) గురువారం ఉదయం తన తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సూర్యనారాయణ స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సూర్యనారాయణ […]