మనం ఎవరిని అయిన అభిమానించామంటే వాళ్ళతో ఫోటో దిగాలని, వాళ్ళ ఆటోగ్రాఫ్ తీసుకోవాలని అనుకుంటూ ఉంటాము కదా. ఉదాహరణకి సినీ హీరోలు, హీరోయిన్స్, రాజకీయ నాయకులు ఇలా మనం అభిమానించే వ్యక్తితో ఫోటో దిగాలంటే అది సాధ్యమైనంత పని కాదు. ఎందుకంటే మనం అభిమానించే వ్యక్తి మనకి దగ్గరలో ఉన్నప్పుడు మాత్రమే ఆ కోరిక నెరవేరుతుంది. అయితే ఈ క్రమంలోనే ఓ కార్యకర్త తాను ఎంతగానో అభిమానించే ఒక రాజకీయ వేత్తతో ఒక సెల్ఫీ దిగడానికి ప్రయత్నం […]
Category: Politics
బ్యాట్ పట్టి క్రికెట్ ఆడిన సీఎం జగన్..వీడియో వైరల్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ ప్రభుత్వ కార్యకలాపాలు, పార్టీ వ్యవహారాలు, ప్రజా సంబంధ విషయాలతో తలమునకలుగా ఉంటారు. అటువంటి ఆయన తాజాగా బ్యాట్ పట్టి ఎంతో ఉల్లాసంగా క్రికెట్ ఆడారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..కడప జిల్లా పర్యటనలో భాగంగా తన తాతగారైన వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంను శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సందర్శించారు.స్టేడియంలో అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం సరదాగా స్టేడియంలో క్రికెట్ […]
టీడీపీకి ఎల్ రమణ రాజీనామా..?
తాజాగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ పార్టీకి రాజీనామా చేస్తూ, తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు అందచేశారు. అయితే తన రాజీనామా లేఖలో కేవలం మూడు వాఖ్యాలతో లేఖను ముగించారు. 30 సంవత్సరాలుగా తోడ్పాటు అందించిన చంద్రబాబుకు తన ధన్యవాదాలు అని ఎల్. రమణ తెలిపారు. ఇది ఇలా ఉండగా మరో వైపు టీఆర్‌ఎస్ పార్టీలోకి మారబోతున్నట్లు రమణ అధికారికంగా తెలిపారు. ఇలా పార్టీ మారడానికి గల కారణం విషయానికి వస్తే […]
జల వివాదం: తెలంగాణ నేతలపై మండిపడ్డ జగన్..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా తెలంగాణ జల వివాదం పై పెదవి విప్పారు. గురువారం రోజు అనంతపురం జిల్లాలో రైతు దినోత్సవంలో పాల్గొన్న జగన్ తెలంగాణ రాజకీయ నేతలు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వెళ్లగక్కారు. గతంలోనే నీటి కేటాయింపుల విషయంలో ఒప్పందాలు జరిగాయని.. ఆ ఒప్పందాల ప్రకారమే తాము నీళ్లను వినియోగించుకుంటున్నామని.. ఇందులో తాము చేస్తున్న తప్పేంటి? అని తెలంగాణ నేతలను జగన్ సూటిగా ప్రశ్నించారు. నీటి కేటాయింపులపై సంతకాలు కూడా చేశారని […]
వైఎస్ఆర్ జయంతి..మోహన్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు!
దివంగత ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి నేడు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాల్లోనూ వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద కుటుంబసభ్యులు, అభిమానులు నివాళి అర్పిస్తున్నారు. ఇదిలా ఉంటే.. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా విలక్షన నటుడు, టాలీవుడ్ కలక్షన్ కింగ్ మోహన్ బాబు సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. `స్నేహశీలీ, రాజఠీవి, రాజకీయ దురంధరుడు, మాట తప్పడు […]
కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు.. విద్యావంతులకు అవకాశం!
గత కొద్ది రోజులుగా కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేయబోతున్నాయని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో భాగంగా ఇప్పటికే తొమ్మిది మంది మంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయించారు కూడా. కాగా మరో ముగ్గురు కూడా అదే దిశలో ఉన్నట్లు రీసెంట్ గా తెలిసింది. కేంద్ర మంత్రి వర్గంలో ఉన్న సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్ లాంటి కీలక నేతలతో పాటు సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్, అశ్విన్ […]
కేంద్ర మంత్రి హర్షవర్ధన్ రాజీనామా..?
నేడు జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రాజీనామా చేశారు. దీంతో మొత్తం 7 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్, సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్ లు రాజీనామా చేసిన వారి లిస్ట్ లో ఉన్నారు. ముఖ్యంగా అన్ని వర్గాలకు సంబంధించి సమతూకం చేయాలని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి ప్రయత్నిస్తున్నట్లు […]
ఏపీలో పాఠశాలల పున:ప్రారంభం ఎప్పుడంటే..?
తాజాగా ఏపీలో పాఠశాలల పున: ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగష్టు 16 నుంచి పాఠశాలను తిరిగి పున: ప్రారంభం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సురేష్ తెలియచేసారు. అంతే కాకుండా జూలై 12వ తేదీ నుంచి ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించయేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే ఆగష్టు నెలలోపు విద్యాసంస్థల్లో పెండింగ్ లోఇంకా పూర్తి అవ్వని నాడు నేడు పనులను అన్ని కూడా పూర్తి చేయాలని అధికారులు సీఎం ఆదేశించారని […]
పొలిటికల్ ఎంట్రీపై కేటీఆర్ తనయుడు షాకింగ్ కామెంట్స్!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చిన్న వయసులోనే సమాజానికి సేవ చేస్తున్న హిమాన్షు.. ఈ మధ్యే ప్రతిష్ఠాత్మక డయానా అవార్డును కూడా అందుకున్నాడు. ఇదిలా ఉంటే..తాత కేసీఆర్, తండ్రి కేటీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని.. మూడో తరంగా హిమన్షురావు రాజకీయాల్లోకి వస్తాడని, వారిలానే చక్రం తిప్పుతాడని ఎప్పటి నుంచో వర్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తాజా హిమాన్షు సోషల్ మీడియా వేదికగా షాకింగ్ […]