జిల్లాల్లో రెండు రోజులపాటు బండి ..!

వరి కొనుగోలు వ్యవహారం తెలంగాణలో వేడిపుట్టిస్తోంది. రైతులకు మద్దతుగా బీజేపీ, టీఆర్ఎస్ మాట్లాడుతున్నా.. వారికి పెద్దగా ప్రయోజనం మాత్రం ఉండటం లేదు. మీరు కొనండి.. మీరు కొనండి అని ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు తప్ప.. రైతులకు మాత్రం భరోసా ఇవ్వడం లేదు. టీఆర్ఎస్ పార్టీ కేంద్రం పద్ధతికి నిరసనగా ధర్నాలు చేస్తే..బీజేపీ కారు పార్టీ తీరును తప్పుపడుతూ ఆందోళన చేపట్టింది. పోనీ సమస్య పరిష్కారం అయిందా అంటే.. లేదు.. అక్కడే ఆగిపోయింది. ఇపుడు టీ.బీజేపీ చీఫ్ […]

అయ్యో…ఇంతటి అవమానమా?

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుపతికి వచ్చారు.. దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశంలో పాల్గన్నారు.. ఇతర ముఖ్యమంత్రులు కూడా వచ్చారు.. తెలంగాణసీఎం కేసీఆర్ కూడా సమావేశానికి వెళ్లాల్సింది.. అయితే ఆయనకు బదులుగా రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్.. ఇంతవరకు బాగానే ఉంది.. అయితే అందరికీ లభించినట్లు తెలంగాణ టీమ్ కు మర్యాద దక్కలేదని సీఎస్ నిరసన వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే.. సాధారణంగా సమావేశానికి వచ్చే ప్రతినిధులకు […]

బాబు ప్రాభవానికి గండికొట్టే ఎన్నికలివి!

కుప్పం మునిసిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ప్రాభవానికి గండి పడే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. 25 వార్డులు ఉన్న కుప్పం మునిసిపాలిటీలో- 15 వార్డుల వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని సమాచారం. అదే జరిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి గెలుపొందగలరా అనేది కూడా ప్రశ్నార్థకమే అవుతుంది! తన సొంత ఊరు ఉన్న చంద్రగిరి నియోజకవర్గం తనను తిరస్కరించిన తర్వాత.. చంద్రబాబు జిల్లాకు ఒక మూలగా […]

జగన్‌కు పనిచెప్పడమే పవన్ కల్యాణ్ పోరాటమా?

విశాఖ ఉక్కును తాను కాపాడేస్తానని జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖ వాసులకు చాలా గట్టిగా హామీ ఇచ్చారు. ఓ బహిరంగ సభ కూడా నిర్వహించారు. వారికి తాను అండగా ఉంటానన్నారు. అదే వేదిక మీదనుంచి.. జగన్మోహన్ రెడ్డి ఏం పనులు చేయాలో, విశాఖ ఉక్కును ఎలా కాపాడుకోవాలో.. కొన్ని పనులను పవన్ కల్యాణ్ డిక్టేట్ చేశారు. విశాఖ ఉక్కుకోసం ఆయన పోరాటంలో తొలి అధ్యాయం అలా ముగిసింది. సినిమాల షూటింగులకు మధ్య వచ్చే షెడ్యూల్ గ్యాప్‌లో పవన్ […]

రాజకీయ విమర్శలే వాంగ్మూలంలోకి వచ్చాయే!

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన నాటినుంచి.. ఆ దుర్ఘటనను వాడుకునిన జగన్మోహన రెడ్డి ని ఇరుకున పెట్టడానికి విపక్ష తెలుగుదేశం అనేక రకాల కుట్రపూరిత ప్రచారాలకు తెరలేపింది. ‘చిన్నాన్న హత్యతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ప్రత్యక్ష ప్రమేయం ఉంది’ అనే విమర్శ చేయలేదు తప్ప.. అలాంటి భావనను కలిగించేలా తెలుగుదేశం నాయకులు రకరకాల విమర్శలు చేశారు. కేసు విచారణను జగన్ కావాలనే పక్కదారి పట్టిస్తున్నట్టుగా, కేసు విచారణలో కాలయాపనకు కారణం అవుతున్నట్లుగా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. […]

డీఎస్ కోసం తలుపులు తెరిచిన కాంగ్రెస్, బీజేపీ

డి.శ్రీనివాస్.. ధర్మపురి శ్రీనివాస్.. తెలుగు రాష్ట్రాల్లో ఈయన పేరు తెలియని వారుండరు.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్ హవా ఓ రేంజ్ లో ఉండేది.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోవడంతో ఈయన ప్రభ కూడా తగ్గిపోయింది. దీంతో టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. కారు పార్టీలో చేరినా పెద్దగా చురుగ్గా లేరు. ఈయన కుమారుడు అరవింద్ నిజామాబాద్ లో ఎంపీగా విజయం సాధించారు. బీజేపీ తరపున అరవింద్ గెలవడంతో డీఎస్ టీఆర్ఎస్ లో […]

ఎవరికీ కలిసిరాని వైద్యశాఖ.. మరి హరీశ్ రావుకు కలిసొస్తుందా?

తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖ అంటేనే నాయకులు వామ్మో.. వద్దులే అని ఆ పదవికి దూరంగా ఉంటున్నారు. ఎవరూ ఒప్పుకోకపోవడం వల్ల కూడా ఆ బాధ్యతను కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారట. ఇక పనిభారం పెరగడంతో బాధ్యతను అల్లుడు హరీశ్ రావుకు అప్పగించారు. అయితే.. వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడటం లేదు.. ఎందుకంటే.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన […]

తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలజగడం సద్దుమణుగుతోంది.. సమస్య పరిష్కరాం దిశగా ఇరు రాష్ట్రాల అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.. అయితే ఉన్నట్టుండి రెండు తెలుగు రాష్ట్రాల పాలకుల మధ్య మాటల యుద్దం ప్రారంభమైంది. నీటి సమస్య అంటే.. అది మామూలే.. తప్పదు అనుకోవచ్చు. మరి డబ్బుల విషయం.. అంటే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి గురించి మంత్రులు కామెంట్ చేసుకోవడాన్ని జనం విచిత్రంగా చూస్తున్నారు. ఎవరి రాష్ట్రాలు వారివి.. ఎవరి సమస్యలు వారివి.. ఎవరి పథకాలు వారివి.. అంతే.. […]

సారూ.. ఇందిరా పార్కు మిమ్మల్ని చూసి నవ్వుతోంది

ఇందిరాపార్క్ ధర్నా చౌక్.. తెలంగాణలో.. ముఖ్యంగా హైదరాబాదులో ఏ సమస్య వచ్చినా తమ సమస్య పరిష్కారం కోసం ధర్నా చేస్తారు.. ఎక్కడంటే అక్కడ కాదు.. ధర్నా చౌక్.. ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా ధర్నా చౌక్ అని కూడా పిలుస్తారు.. పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు.. ఇలా ఎందరో..ఇంకెందరో ఇందిరాపార్కు వేదికగా నిరసన తెలిపి తమ సమస్యను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లారు.. తీసుకెళుతున్నారు కూడా. ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమాలు ఎక్కువ కావడంతో ప్రభుత్వం […]