కలిసొచ్చేదెవరు? లీడ్ చేసేదెవరు..?

తెలుగు సినీ పరిశ్రమ ఇంతకుముందెప్పుడూ లేని సంక్షోభం ఎదుర్కొంటోంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తెరకెక్కించి తీరా బొమ్మ వేద్దామనే లోపే కొత్త కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. తెలంగాణలో పరిస్థితులు బాగానే ఉన్నా ఏపీలో మాత్రం బొమ్మకు గడ్డు రోజులు వచ్చి పడ్డాయి. థియేటర్లలో అడ్డదిడ్డంగా ధరలు వసూలు చేస్తుండటంతో ప్రభుత్వం మేల్కొంది. మీ ఇష్టానుసారం టికెట్ ధరలు వసూలు చేసేందుకు వీల్లేదు.. మేమే నిర్ణయిస్తామని రేట్లను సవరించింది. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే టికెట్ […]

ఆయన రాక వెనుక అంతరార్థం ఏమిటో..?

ఎప్పుడూ అలా వచ్చి ఇలా వెళ్లిపోతాడు.. ఉండమన్నా ఉండడు.. నాయకులు, కార్యకర్తలు బలవంత పెడితే కాసేపు మాట్లాడతాడు.. ముఖ్య నాయకులతో సమావేశం కావాలంటే ఇక్కడకు వచ్చినపుడు కుదరదు.. ఢిల్లీకి వెళ్లి కలవాల్సిందే.. అంత బిజీ ఆయన.. ఆయన ఎవరో కాదు భారతీయ జనతా పార్టీని పగ్గాలు పట్టుకొని నడిపిస్తున్న జేపీ నడ్డా.. ప్రధాని మోదీకి అత్యంత ఇష్టుడు.. ఓ జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి..అందులోనూ అధికారంలో ఉన్న పార్టీని నడిపిస్తున్న నడ్డా హైదరాబాదుకు వస్తున్నాడు. అందులో ఏముంది […]

ఆర్ఆర్ఆర్.. సీఐడీ కాదు, ఈసారి సీబీఐ కేసు!

సీఐడీ- సీబీఐ కేసు అనగానే .. ఇదేదో సినిమా ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన వ్యవహారం కాదని.. వివాదాస్పద రాజకీయ నాయకుడు రఘురామక్రిష్ణ రాజుకు సంబంధించిన గొడవ అని ఎవరికైనా సులువుగానే అర్థమైపోతుంది. ఆయన ప్రస్తుతం దాదాపు 1300 కోట్ల రూపాయలకు పైగా బ్యాంకు రుణాలను ఎగవేసిన కేసుల్లో సీబీఐ కేసులో ఇరుక్కున్నారు. గతంలో ఆయన మీద ఏపీ సీఐడీ పోలీసులు వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు కేసులు నమోదు చేశారు. అయితే.. ప్రతిసారీ.. జగన్మోహన్ రెడ్డి సీఐడీ పోలీసుల […]

సినిమా టికెట్ ధరలపై చెప్పకనే చెప్పేసిన జగన్

ఏపీలో సినిమా ధరల తగ్గింపు, టికెట్లను ప్రభుత్వమే విక్రయించడం.. సౌకర్యాలు లేని థియేటర్లను సీజ్ చేయడం .. లాంటివి కొద్ది రోజులుగా జరుగుతున్నాయి. అధికారులు సినిమా థియేటర్లను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని సీజ్ చేశారు. ఇక వీటికితోడు తక్కువ ధరకు టికెట్లు విక్రయిస్తే థియేటర్ నిర్వహణ కూడా కష్టమవుతుందని కొందరు థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎవ్వరూ నేరుగా ఖండించడం లేదు. సినిమా పెద్దలైతే మంచి రోజులొస్తాయి.. సీఎం నిర్ణయం […]

RRR : కథ అడ్డం తిరిగింది

రఘురామ క్రిష్ణం రాజు.. సింపుల్ గా RRR.. ఏపీలో అధికారికంగా అధికార పార్టీ ఎంపీ.. అయితే ఆయన మాత్రం అధికార పార్టీకి బద్ధ వ్యతిరేకి.. ఏకంగా పార్టీ అధినేతపైనే తిరుగుబావుటా ఎగురవేసిన వ్యక్తి.. జగన్ పార్టీ తరఫున నరసాపురం నుంచి ఎంపీగా విజయం సాధించి తరువాత పార్టీలో ఉంటూ పార్టీనే తిడుతూ పార్టీకి దూరమయ్యాడు. ప్రస్తుతం ఆయన వైసీపీలోనే ఉన్నాడు. అయినా పార్టీ ఆయనను పట్టించుకోదు.. ఆయన కూడా దాని గురించి ఆలోచించడు. RRRకు కోపం ఎంత […]

జగ్గారెడ్డికి పొగ పెడుతున్నారా?

టి.కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటుగా ఉండి.. పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉండకుండా ఇష్టానుసారం ప్రవర్తిస్తారా అని ప్రశ్నిస్తోంది. మీరే ఇలా ప్రవర్తిస్తే .. ఇక సామాన్య కార్యకర్తలకు ఎటువంటి మెసేజ్ వెళుతుందని పేర్కొంటున్నారు. అసలు విషయమేంటంటే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల సీఎం దత్తత గ్రామమైన ఎరవల్లిలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడకు వెళ్లేందుకు భారీ […]

కేటీఆర్ ఏం స్పెషలా అంటున్న రేవంత్

ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు.. అందులోనూ రాష్ట్ర మంత్రి.. రాష్ట్రంలో ఆయన చెప్పింది జరిగి తీరాల్సిందే.. అతనే కేటీఆర్..అయితే కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఇపుడు నేరుగా విమర్శణాస్ర్తాలు సంధిస్తున్నాడు. పవర్ ఉన్న వ్యక్తి నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు పట్టించుకోరా అని పోలీసులను ప్రశ్నిస్తున్నాడు. రాష్ట్రంలో సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టమైన ఆదేశాలున్నా పోలీసులు మాత్రం కేసు నమోదు చేయకుండా ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని నిలదీస్తున్నాడు. కేటీఆర్ పై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద […]

దోపిడీని అడ్డుకుంటే సినిమా ఆపేస్తారా?

భారీ చిత్రాల ముసుగులో.. సినిమా ఇండస్ట్రీ సాగిస్తున్నది కేవలం దోపిడీ మాత్రమే అని చెప్పడానికి ఇది మరొక స్పష్టమైన ఉదాహరణ. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల వాయిదాపడడం ఇదే విషయాన్ని నిరూపిస్తోంది. ఎన్నడో అక్టోబరులోనే విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రాన్ని.. అటూ ఇటూ చేసి.. సంక్రాంతి బరిలోకి తెస్తున్నాం అంటూ మొత్తానికి జనవరి 7న విడుదల అయ్యేలా ప్లాన్ చేశారు. ప్రస్తుతం అది కూడా వాయిదా పడింది. చాలా రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు మూత పడుతున్న నేపథ్యంలో […]

దొందూ దొందే.. ఎన్ని సార్లు కలిసినా ఏమీ తేలదు!

సాధారణంగా మనం దొందూ దొందే అనే సామెతను ఒకే రకంగా బుద్ధులు ప్రదర్శించే ఇద్దరు వ్యక్తుల గురించి అంటూ ఉంటాం. అయితే ఇక్కడ వ్యవహారం అది కాదు. రెండు సమస్యల గురించి. అవి స్తంభించిపోయిన తీరు గురించి. ఏపీ రాష్ట్ర వ్యవహారాల్లో రెండు కీలకమైన విషయాలు.. ఒకేరీతిగా స్తంభించిపోయి ఉన్నాయి. ఇవి మాత్రం దొందూ దొందే. ఇప్పట్లో అవి తేలి, ఒక కొలిక్కి వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. అవేంటంటే.. (1) ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న […]