పవన్ ప్రత్యర్ధికి సీటు డౌటేనా?

గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ని ఓడించి…తిప్పల నాగిరెడ్డి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే…గాజువాక బరిలో తిప్పల నాగిరెడ్డి మంచి విజయమే అందుకున్నారు. వాస్తవానికి గాజువాక వైసీపీకి  పెద్దగా అనుకూలమైన నియోజకవర్గం కాదు…2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన గాజువాకలో…మొదట ప్రజారాజ్యం గెలిచింది. ఇక 2014లో టీడీపీ గెలిచింది. అయితే 2019 ఎన్నికల్లో అనూహ్యంగా పవన్ పోటీ చేయడంతో ముక్కోణపు పోటీ నడిచింది…వైసీపీ-టీడీపీ-జనసేనల మధ్య పోటీ జరిగింది. కానీ ఇక్కడ వైసీపీ గెలవడానికి ఒకే ఒక కారణం…టీడీపీ-జనసేనల […]

ముగ్గురు ఎంపీలు…మూడు కథలు!

ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో ఎంపీల విషయంలో రకరకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే..ఎంపీలు టీడీపీ అధిష్టానానికి షాక్ ఇచ్చేలా ముందుకెళ్తున్నారని కథనాలు వస్తున్నాయి. టీడీపీకి ఉన్నది ముగ్గురు ఎంపీలు రామ్మోహన్, కేశినేని నాని, గల్లా జయదేవ్.. అయితే టీడీపీలో వీరికి మంచి ఫాలోయింగ్ ఉంది…అలాగే లోక్ సభ లో తమ వాయిస్ బలంగా వినిపించే నేతలు. ఇక అంతా బాగానే ఉందనుకుంటే…ఈ ముగ్గురు ఎంపీలకు సంబంధించి..మూడు స్టోరీలు నడుస్తున్నాయి. ఇందులో మొదట కేశినేని నాని గురించి […]

వైసీపీలో జంపింగుల గోల…రెడ్లే మెయిన్!

ఈ మధ్య అధికార వైసీపీలో జంపింగుల కలకలం చెలరేగింది…వైసీపీని కొంతమంది ఎమ్మెల్యేలు వీడొచ్చని ప్రచారం జరుగుతుంది..సాధారణంగా అధికార పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్లాలని అనుకోరు..అయితే ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకునే పనిలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అది కూడా వైసీపీకి అండగా ఉండే రెడ్డి ఎమ్మెల్యేలపైనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో పలువురు రెడ్డి ఎమ్మెల్యేలు వైసీపీని వీడొచ్చని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే వెంకటగిరి ఎమ్మెల్యే […]

వైఎస్‌. విజ‌య‌మ్మ‌కు త‌ప్పిన ప్ర‌మాదం… ఎక్క‌డంటే…!

దివంగ‌త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి త‌ల్లి అయిన‌ వైయస్ విజయమ్మకు తృటిలో ప్రమాదం తప్పింది. అనంతపురంలో జరిగిన వివాహానికి హాజరైన‌ ఆమె… ఆ తర్వాత కర్నూల్ లోని వైఎస్సార్ మిత్రుడిని పరామర్శించేందుకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా గుత్తి పెట్రోల్ బంకు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. రెండు టైర్లు పేలి.. కారు అదుపు తప్పింది. దీంతో విజ‌య‌మ్మ ఏం జ‌రిగిందో […]

నాయీ బ్రాహ్మణులను కించ ప‌రిచే ప‌దాల‌పై ఏపీలో నిషేధం… ఆ ప‌దాలు ఇవే…!

నాయీ బ్రాహ్మణులను, వారి కులాన్ని, వారి వృత్తిని కించపరిచే పదాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. మంగలి, మంగలోడా, బొచ్చుగొరిగేవాడా, మంగలిది, కొండ మంగలి ఇటువంటి ప‌దాల‌ను నాయీబ్రాహ్మణులను ఉద్దేశించి ఉపయోగిస్తే.. వారి మనోభావాలను గాయపరిచినట్టుగా పరిగణిస్తారు. అందుకు కార‌ణ‌మైన వారిపై భారత శిక్షాస్పృతి 1860 కింద న్యాయ‌పరమైన చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి జీవో ఎంఎస్‌ 50 జారీ చేశారు. ఆగస్టు 7న జారీ చేసిన ఈ […]

జంపింగ్: బాలినేనిపైనే డౌటా?

ఎన్నికల దగ్గరపడుతున్న నేపథ్యంలో కొందరు నేతలు…గెలిచే పార్టీని ముందే ఊహించి జంపిగులు చేయడానికి రెడీ అవుతున్నారు. అసలు ఎన్నికల సమయంలో ఇలాంటి జంపింగులు సర్వసాధారణమే. గెలుపు ఊపు ఉన్న పార్టీలోకి నేతలు ఎక్కువ వెళ్తారు…అలాగే ఒక పార్టీలో టికెట్ దక్కకపోతే మరొక పార్టీలోకి వెళ్తారు. ఇలా రాజకీయ జంపింగులు మామూలుగానే జరుగుతాయి. అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జంపింగులు మళ్ళీ మొదలయ్యేలా ఉన్నాయి..కాకపోతే ఇప్పుడు ఏ పార్టీకి ఎక్కువ బలం ఉందో అంచనా వేయలేని పరిస్తితి. అటు […]

విశాఖలో సిట్టింగులకు మళ్ళీ ఛాన్స్?

సరిగ్గా పనిచేయకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వనని ఇప్పటికే సీఎం జగన్ తేల్చి చెప్పేసిన విషయం తెలిసిందే…అధికార వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం బాగోలేదని తెలుస్తోంది…అలాగే వారిపై ప్రజా వ్యతిరేకత కూడా ఎక్కువ ఉందని, నెక్స్ట్ మళ్ళీ వారికి సీట్లు ఇస్తే గెలవడం కష్టమని పీకే టీం సర్వేలో తేలిందని సమాచారం. దీని బట్టి చూసుకునే…ఆరు నెలల్లో పనితీరు మెరుగుపరుచుకోకపోతే…నెక్స్ట్ మొహమాటం లేకుండా సీటు ఇవ్వనని జగన్ చెప్పేశారు. అయితే ఆరు నెలల్లో […]

వారసురాలు కోసం యనమల తిప్పలు?

తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 గా రాజకీయం చేస్తున్న యనమల రామకృష్ణుడు…ఫ్యామిలీకి రాజకీయంగా ఏ మాత్రం కలిసి రావడం లేదని చెప్పొచ్చు. 1983 నుంచి 2004 వరకు వరుసపెట్టి గెలుస్తూ సత్తా చాటుతూ వచ్చిన యనమలకు…2009లో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. 2009లో ఆయన విజయానికి బ్రేక్ పడింది..కంచుకోట లాంటి తుని నియోజకవర్గంలో చిత్తుగా ఓడిపోయారు. ఇక అప్పుడు మొదలు ఇప్పటివరకు తునిలో యనమల ఫ్యామిలీ గెలవలేదు. 2014, 2019 ఎన్నికల్లో యనమల తమ్ముడు కృష్ణుడు పోటీ […]

చినబాబుకు షాక్..మంగళగిరిలో రివర్స్?

తొలిసారి ఎన్నికల బరిలో దిగి…ఓటమి పాలైన దగ్గర నుంచి…మళ్ళీ అదేచోట గెలిచి తీరాలని చెప్పి నారా లోకేష్ తీవ్రంగా కష్టపడుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు వారసుడుగా బరిలో దిగిన లోకేష్ విజయంపై 2019 ఎన్నికల్లో పెద్ద చర్చ నడిచింది…ఆయన విజయం దాదాపు ఖాయమే అని అంతా అనుకున్నారు. కానీ జగన్ గాలిలో లోకేష్ సైతం ఓటమి పాలయ్యారు. మంగళగిరి నుంచి బరిలో దిగి ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక ఓడిపోయిన దగ్గర నుంచి అదే స్థానంలో […]