నటరత్న నందమూరి బాలకృష్ణ ప్రతిష్ఠాత్మక 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి` ప్రదర్శిస్తున్న థియేటర్ సీజ్ చేయడం ఇప్పుడు రాజకీయంగా వివాదానికి దారితీసింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి పీతల సుజాత ఇందులో చిక్కుకున్నారు. ప్రోటోకాల్ అంశంలో తలెత్తిన వివాదం అనేక మలుపులు తిరిగి రాజకీయ రంగు పులుముకుంది. ముఖ్యంగా పశ్చిమగోదావరిలో ఈ వివాదం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో పీతల సుజాతపై బాలయ్య అభిమానులు, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో పండగ ముందు […]
Category: Latest News
టీఆర్ఎస్ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే
పాలిటిక్స్‌లో ఎవరూ ఎవరికీ శాశ్వత మిత్రులు కారు. శాశ్వత శత్రువులు కారు! అది నేతలు ఒకే పార్టీలో ఉన్నా.. లేక రెండు పార్టీల్లో ఉన్నా. ఇప్పుడు ఇలాంటి వాతావరణమే తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో కనిపిస్తోంది. ముఖ్యంగా ఉద్యమాల జిల్లా ఓరుగల్లులో టీఆర్ ఎస్ కీలక నేతలుగా సీఎం కేసీఆర్ వద్ద మార్కులు కొట్టేసిన ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌లు ఇద్దరూ ఇప్పుడు ఉప్పు నిప్పులా తయారయ్యారట! ప్రజల్లో అభిమానం చూరగొన్న ఇద్దరు […]
సాక్షికి జై కొట్టిన టీడీపీ మంత్రి
వినడానికి, నమ్మడానికి ఒకింత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. ఇది నిజమే! టీడీపీ బద్ధ శత్రువైన వైకాపా అధినేత జగన్ పత్రికను ఆకాశానికి ఎత్తేశారు చంద్రబాబు మంత్రి వర్గంలోని చింతకాయల అయ్యన్నపాత్రుడు. సాక్షి పత్రికను చదవంతే పొద్దు పొడవదని తేల్చి చెప్పడంతో విన్నవాళ్లందరూ ఇది నిజమా?! అని ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. వాస్తవానికి సాక్షి పత్రికకు, టీడీపీ నేతలకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమని మండే వాతావరణమే ఉంటుంది. పలువురు మంత్రులు, నేతలు సైతం సాక్షి పత్రిక వేస్ట్ అని, […]
టీఆర్ఎస్ లేడీ ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి
తెలంగాణ అధికార పార్టీలో నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. గత కొన్నాళ్లుగా నేతల మధ్య ఒకరంటే ఒకరికి పడడం లేదనే టాక్ వస్తోంది. ఎవరి ఆధిపత్య ధోరణిని వారు ప్రదర్శిస్తుండడం వల్లే.. ఈ పరిస్థితి ఉత్పన్నమవుతోందని తెలుస్తోంది. అయితే, ఇది మరింత ముదిరితే పరిస్తితి ఏంటనేది ప్రశ్న. తాజాగా జరిగిన ఓ ఘటన.. ఓ మహిళా ఎమ్మెల్యే, ఓ మంత్రిని మీడియాకు ఎక్కేలా చేసింది. పాత ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ […]
`రద్దు డ్యామేజ్` కంట్రోల్‌కు మోడీ ప్లాన్
దేశంలో 80 శాతానికి పైగా చలామణీలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం దేశాన్ని అతలాకుతలం చేసింది. అవినీతిని అంతమొందించేందుకేనని ప్రధాని చెప్పిన మాటలను ప్రజలు విశ్వసించారు. అయితే రెండున్నరేళ్లుగా ప్రధాని మోడీని ఆకాశానికెత్తేసిన అంతర్జాతీయ మీడియా.. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించింది. దీంతో డ్యామేజ్ కంట్రోల్‌కి బీజేపీ రంగంలోకి దిగింది. ముఖ్యంగా ఈ నిర్ణయం నుంచి ప్రజలను మళ్లించేందుకు తాయిలాలు ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. 50 రోజులు ఆగాలన్నారు. ప్రజలు సహనంగా […]
టీఆర్ఎస్-బీజేపీ పొత్తుపై కొత్త పేచీ
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బలమైన జాతీయ పార్టీగా అవతరించాలని పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న బీజేపీకి సరికొత్త సమస్యలు అడ్డువస్తున్నాయి! 2014లో ఏపీలో చంద్రబాబు పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుని నాలుగు స్థానాలు కైవసం చేసుకుంది. అదేవిధంగా మంత్రివర్గంలో రెండు సీట్లను సైతం కొట్టేసింది బీజేపీ. ఇక, ఇదే తరహాలో తెలంగాణలోనూ అధికార కేసీఆర్‌తో చెలిమి చేయడం ద్వారా లాభపడాలనేది కమల నాథుల వ్యూహంగా కనిపిస్తోంది. అయితే, కొందరు మాత్రం ఏపీ మాదిరిగా టీడీపీతో పొత్తు […]
చంద్రబాబును సెల్వం అడిగింది అదేనా..
తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం అమరావతి బాట పట్టారు. ఆయన బృందంతో కలిసి గురువారం ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. చెన్నైకి నీటి ఇబ్బందులు పెరిగిపోయాయని, తెలుగు గంగ ద్వారా నీళ్లను ఇచ్చి ఆదుకోవాలని ఆయన బాబుకు విన్నవించారు. చెన్నైలోని నీటి సమస్యపై రెండు పేజీల లేఖను చంద్రబాబుకు సెల్వం అందజేశారు. కర్నాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5 టిఎంసిల చొప్పున నీటిని తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా సరఫరా చేయాల్సి ఉందని పన్నీర్ చెప్పారు. ఇప్పుడు […]
ఖైదీ వర్సెస్ శాతకర్ణి… ఎవరు గెలిచారు.
తెలుగు సినిమాల్లో అగ్ర హీరోలైన నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిలు పందెం కోళ్లలా థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఒకరిది 150వ సినిమా అయితే మరొకరిది 100వ సినిమా!! ఇద్దరివీ ప్రతిష్ఠాత్మక సినిమాలే!! ఒకరు సామాజిక అంశాన్ని కథాంశంగా తీసుకుంటే.. మరొకరు చరిత్రాత్మక చిత్రంతో బరిలోకి దిగారు. ఈ అగ్రహీరోలిద్దరూ ఇలా సంక్రాంతి బరిలో నిలవడం ఇదే తొలిసారి కాకపోయినా.. ఈసారి మాత్రం ఇద్దరికీ ప్రతిష్ఠాత్మకమే! అయితే ఇందులో ఎవరు పైచేయి సాధించారు? ఎవరు గెలిచారు? అనే చర్చ […]
ఖైదీలో ఆ డైలాగులు చూసి మేథావుల షాక్
మెగాస్టార్ చిరంజీవి దాదాపు పదేళ్ల తర్వాత `ఖైదీ నెంబరు 150` ద్వారా తెరపై కనిపించారు. మునుపెన్నడూ లేని విధంగా చిరు గ్లామర్‌గా కనిపిస్తుంటం అభిమానులను అలరిస్తోంది. తమిళ సినిమా కత్తి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో.. తన పొలిటికల్ కెరీర్‌పైనా ప్రభావం చూపేలా కొన్ని డైలాగులు ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సినిమాలోని డైలాగులు సాధారణంగా కనిపిస్తున్నా.. అంతర్లీనంగా వాటికి చాలా అర్థం ఉందంటున్నారు విశ్లేషకులు. సినిమాల్లో మెగాస్టార్ సూపర్ హిట్ అయినా… రాజకీయాల్లో మాత్రం […]
