యంగ్ హీరో నితిన్ క్లాస్ సినిమాలతో సక్సెస్‌ల మీద సక్సెస్‌లు కొడుతున్నాడు. ‘ఇష్క్’, ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘అఆ’ సినిమాలతో జోరు మీదున్న ఈ యంగ్ హీరో, కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఈ మధ్యకాలంలో చవిచూశాడు. ఒకప్పుడు మాస్ హీరో అయిపోదామనుకుని బొక్క బోర్లా పడ్డ నితిన్, ఆ తరువాత మళ్లీ క్లాస్ బాట పట్టాడు. మాస్ తనకి సూట్ కాలేదనుకున్నాడు కాబోలు క్లాస్ టచ్ ఇస్తూ విజయాల బాటలో దూసుకెళ్తున్నాడు. తాజాగా ‘అ,ఆ..’ సినిమాతో నితిన్ […]
Category: Latest News
మీసం మెలేస్తున్న పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్
‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా నెగిటివ్ టాక్ ఇచ్చింది. కానీ నెక్స్ట్ సినిమాకి అనౌన్స్‌మెంట్ జరిగింది. ఇంకేముంది పవన్ కొత్త సినిమా ముహూర్తానికి కొబ్బరి కాయ కొట్టేశాడు. ఇక సెట్స్ మీదికెళ్లడమే లేటు అనుకుంటున్న తరుణంలో రకరకాల కారణాలతో ఆ సినిమా వెనక్కి వెళ్లిపోయింది. ఎస్.జె సూర్య డైరెక్షన్‌లో రావాల్సిన ఈ సినిమా కోసం డైరెక్టర్ల మీద డైరెక్టర్లను మారుస్తూ పవన్ అభిమానుల్ని సందిగ్థంలో పడేశాడు. చివరికి త్రివిక్రమ్ చేతికి చిక్కింది ఈ ప్రాజెక్టు. ఈ సినిమాకి […]
తెలుగులో సూర్య రేంజ్ తెలిస్తే షాక్ అవుతారు
సూర్య తమిళ కథానాయకుడే అయినా తెలుగు ప్రేక్షకులు ఆయన్ను తమవాడిగానే ఆదరిస్తారు. అందుకే.. ఆయన సినిమాలు తమిళంతో పాటూ తెలుగులోనూ సమాంతరంగా విడుదలవుతుంటాయి. ఇక్కడివారి ఆదరాభిమానాలతోనే తన ప్రాజెక్టులు ద్విభాషా చిత్రాలుగా ఉండేలా చూసుకుంటాడు సూర్య. ఇదిలా ఉంటే.. లేటెస్ట్ న్యూస్ ప్రకారం సూర్య కొత్త మూవీ భారీ రేటుకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ‘సింగం-3’ ఆంధ్రా-నైజాం రైట్స్ రూ.18కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మల్కాపురం శివకుమార్ ఈ హక్కులను సొంతం చేసుకున్నారని చెప్తున్నారు. ‘సింగం-3’కి ఇంత […]
యువరాజ్, హర్భజన్ లను కొట్టిన అక్తర్
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.. భారత క్రికెటర్లపై దాడి చేశాడా..? ఆగ్రహానికి కేరాఫ్ అడ్రస్ అయిన యువీ, భజ్జీలను అక్తర్ ఎందుకు కొట్టాడు? అసలేం జరిగిందనేగా మీ డౌట్. అయితే ఈ స్టోరీ చదవండి. దాదాపు 12ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనను తాజా హర్భజన్ సింగ్ బయటపెట్టాడు. అప్పుడు జరిగిన వివాదం తాలూకు వివరాలను చెప్పాడు. 2004లో పాకిస్తాన్ పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు హర్భజన్ తెలిపాడు. తనను, యువరాజ్ […]
సుల్తాన్ సునామి మాములుగా లేదు!
సుల్తాన్ సినిమా… ఎంటైర్ ఇండియా వైడ్ కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది.ఈసినిమా దెబ్బకు బిటౌన్ పాత రికార్డులు తుడుచు పెట్టుకు పోతున్నాయి.దీంతో ఎక్కడ చూసినా సల్మాన్ గురించే… ముచ్చట్లు .ఇవి మరీ ఎక్కువైపోతున్నాయి.వరుస విజయాలతో అటు సల్మాన్ కూడా ఉబ్బి తబ్బిబై పోతున్నాడు. బిటౌన్ అనే కాదు ఇటు సౌత్ సినిమాకు మొదటిరోజు 10-15 కోట్ల కలెక్షన్లు వస్తే సూపర్ హిట్ అంటారు. అలాంటిది బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మల్లయోధుడిగా నటించిన ‘సుల్తాన్’ సినిమా.. అతడి […]
పవన్ కొత్త సినిమా మళ్ళీ ట్విస్ట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమాపై రకరకాల రూమర్స్ వస్తున్నాయి. ఈ మూవీకి ఆరంభంలోనే అవాంతరాలు ఎదురయ్యాయి. డైరెక్టర్ ఎస్.జే సూర్య తప్పుకోవడం., ఆ తర్వాత డాలీకి ఛాన్స్ ఇవ్వడం చక చకా జరిగిపోయాయి. కానీ షూటింగ్ ఇంతవరకు స్టార్ట్ కాలేదు. ఐతే లేటెస్ట్ గా ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. పవన్ ఆ సినిమాని పక్కనబెట్టేశాడంటూ ప్రచారం జరిగింది. త్రివిక్రమ్ కథతోనే ఆయన ముందుకెళ్తున్నట్లు టాలీవుడ్ లో టాక్ నడిచింది. కానీ వీటిలో […]
హరీష్, కేటీఆర్‌లలో ఎవరికి దక్కేనో!
మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌ల మధ్య విపరీతమైన పోటీ ఉంది. వీరిలో హరీష్‌రావు స్వయానా తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌కి మేనల్లుడు. కేటీఆర్ అయితే కెసియార్ తనయుడే. ఇద్దరూ మంత్రులే. తెలంగాణ రాష్ర సమితి పార్టీకి వీరిద్దరూ ముఖ్యమైన వ్యక్తులు, మూలస్తంభాల్లాంటివారు. ఇద్దరిలో కెటియార్ ఒకింత ఎక్కువ. ముఖ్యమైన శాఖలన్నీ కెటియార్ వద్దనే ఉన్నాయి. కానీ కెటియార్‌కి ఇంకో ముఖ్యమైన బాధ్యతలు అప్పగించాలని చూడటం ద్వారా హరీష్‌రావుని ఇంకా తక్కువ చెయ్యాలనుకుంటున్నారట ముఖ్యమంత్రి కెసియూర్. అదెలాగంటే బాధ్యతలు పెరిగే కొద్దీ […]
మోడీ చుట్టూ అంతమంది కోటీశ్వరులా!
తాజా మంత్రివర్గ విస్తరణతో ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కోటీశ్వరుల సంఖ్య 72కు చేరుకుందని, అలాగే క్రిమినల్ కేసులున్నట్లు ప్రకటించిన మంత్రుల సంఖ్య 24కు పెరిగిందని ఢిల్లీకి చెందిన ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ అనే ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అధ్యయనంలో పేర్కొంది. లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎన్నికల కమిషన్‌కు అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్‌లలో పేర్కొన్న వివరాల ఆధారంగా ఆ సంస్థ ఈ అధ్యయనం జరిపింది. కొత్తగా మంత్రివర్గంలో చేర్చుకున్న మంత్రుల […]
బాబు సంపాదన ఎంతో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వార్షికాదాయం రూ. 36 లక్షలు. సిఎంతో సహా ఆయన ఐదుగురు కుటుంబ సభ్యుల ఆధార్, ఓటర్ ఐడీ అన్నీ హైదరాబాద్‌లో ఉండగా స్థిర, చరాస్తులు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. తొలిరోజు స్మార్ట్ పల్స్ సర్వేను ముఖ్యమంత్రి ఉండవల్లిలోని తన నివాసం నుంచి ప్రారంభించారు. తొలుత ఎన్యుమరేటర్లు ముఖ్యమంత్రికి సంబంధించిన వివరాలు సేకరించారు. సిఎంగా తనకు వచ్చే ఆదాయం అన్నింటితో కలుపుకుని రూ. 36 లక్షలని చంద్రబాబు ఎన్యుమరేటర్లకు వివరించారు. తన స్వగ్రామం చిత్తూరుజిల్లా […]