వావ్‌, మోడీని పొగిడేసిన రాహుల్‌ 

ప్రధానమంత్రిగా రెండేళ్ళ పదవీ కాలంలో నరేంద్రమోడీ చేసిన ఒకే ఒక్క పని ఏంటంటే, పాకిస్తాన్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌కి సైన్యాన్ని ముందుకు నడిపించడమేనట. మామూలుగా అయితే రాజకీయాల్లో ఉన్నాక, అధికారంలో ఉన్నవారు ఏ మంచి పని చేసినా, దాన్ని విపక్షాలు హర్షించవు. అయితే ఇది దేశ భద్రతతో కూడుకున్న విషయం. దేశ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. దాంతో నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వడానికి వీల్లేదు.  ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ని సమర్థిస్తున్నాం అని చెప్పి ఊరుకుంటాయి ఇష్టం లేకపోయినాసరే […]

హైపర్ TJ రివ్యూ

సినిమా : హైపర్ రేటింగ్:3.25/5 టాగ్ లైన్:ఎనర్జీ+ఎమోషన్=హైపర్ నటీనటులు : ఎనర్జిటిక్ స్టార్ రామ్, రాశి ఖన్నా, సత్యరాజ్, రావు రమేష్, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, తులసి, హేమ సినిమాటోగ్రఫీ : సమీర్రెడ్డి. మాటలు:అబ్బూరి రవి ఎడిటింగ్: గౌతంరాజు. నిర్మాత : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర. బ్యానర్ ; 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్. లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా. సంగీతం : జిబ్రాన్. కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం:సంతోష్ శ్రీనివాస్ సగటు […]

టీడీపీ, టీఆర్ఎస్‌ను మోడీ కావాల‌నే టార్గెట్ చేస్తున్నారా

కేంద్ర ప్ర‌భుత్వాల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను టార్గెట్ చేయ‌డం కొత్త‌కాదు! త‌మ‌కు న‌చ్చ‌ని ప్ర‌భుత్వాల‌ను, త‌మ‌కు ప్ర‌త్య‌ర్థిగా ఉన్న పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించ‌డం కేంద్రంలోని పాల‌కుల‌కు తేలికైన విద్య‌.! ఈ విష‌యంలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు! ఈ పార్టీకి న‌చ్చ‌ని పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల‌పై పెత్త‌నం చేయ‌డం, ఇబ్బందులు పెట్ట‌డం కాంగ్రెస్ పాల‌కుల నైజం. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ సీబీఐని ఇష్టానుసారంగా ప్ర‌యోగించేద‌ని ప్ర‌చారంల ఉందేది. ఇక‌, […]

చంద్ర‌బాబు భజన మీడియాకే బోర్ కొట్టిస్తున్నారా

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు, ఆయ‌న పార్టీ టీడీపీకి లాయ‌ల్‌గా ఉన్న మీడియాలో ఆంధ్ర‌జ్యోతి ముఖ్య‌మైంది. పాత ఆంధ్ర‌జ్యోతి ప‌త్రికను కొనుగోలు చేయ‌డానికి ముందు నుంచి ప్ర‌స్తుత ఆంధ్ర‌జ్యోతి ఎండీ టీడీపీకి అనుకూలంగానే ఉండేవారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న హైద‌రాబాద్‌లోని జ‌ర్న‌లిస్టు కాల‌నీలో స్థ‌లాలు, రాయితీలు కూడా పొందారు. ముఖ్యంగా ఆయన ఓల్డ్ ఆంధ్ర‌జ్యోతిని కొనేందుకు చంద్ర‌బాబే మీడియేట‌ర్‌గా ఉన్నార‌నేది ఒక‌ప్ప‌టి టాక్‌. అంతేకాదు, డ‌బ్బుల విష‌యంలోనూ ఆయ‌న సాయం చేశార‌ని అంటారు అప్ప‌టి ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టులు. దీంతో […]

కేసీఆర్ వాళ్ల ప‌ని ప‌డ‌తార‌ట‌

అవును. నిజ‌మే! తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు మంచి ఫైర్ మీదున్నారు. గ‌త నాలుగురోజుల కింద‌ట కురిసిన వ‌ర్షాల‌తో భాగ్య‌న‌గ‌రం మునిగిపోయింది. దీంతో ఉమ్మ‌డి రాజ‌ధాని ప్రాంతంలోని ప‌లు లోత‌ట్టు ప్రాంతాలు స‌హా కొన్ని అపార్టు మెంట్ల‌లోకి భారీ ఎత్తున వ‌రద చేసింది. ప‌లు ప్రాంతాల్లో ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. వారి కొద్దిపాటి దుస్తులు, బియ్యం వంటివి నీటికి కొట్టుకుపోయాయి. దీంతో ఆస‌రాలేక నానాతిప్ప‌లుప‌డ్డారు. అయితే, అదే స‌మ‌యంలో కొంద‌రు తాము ఓట్లు వేసి ఎన్నుకున్న కార్పొరేట‌ర్లు ఏం […]

వెంక‌య్య చెప్పిన శృంగారం క‌థ‌లు ఇవే

ఏంటి? ఎంతో బిజీగా క్ష‌ణం తీరిక కూడా లేకుండా ఉండే కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు శృంగారం గురించి మాట్లాడ‌డం ఏంట‌ని బుగ్గ‌లు నొక్కుకుంటున్నారా? అంతొద్దు! ఆయ‌న నిజంగానే శృంగారం గురించి పెద్ద ఎత్తున లెక్చ‌ర్ దంచేశారు! అయితే, అది ఏ బ‌హిరంగ స‌భ‌లోనో, ఎన్నికల ప్ర‌చార ర్యాలీలోనోకాదు. రామోజీ ఫిలింసిటీలో జ‌రిగిన ఇండీవుడ్ ఫిలిం ఫంక్ష‌న్‌లో! రామోజీ ఫిలిం సిటీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఇండీవుడ్ కార్నివాల్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈనాడు సంస్థల […]

ఏపీలో వెన్నుపోటు బ్ర‌ద‌ర్స్ ఎవ‌రో తెలుసా..

వైకాపా ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా.. ఉర‌ఫ్ రోజ‌మ్మ‌.. మ‌రోసారి ఏపీ సీఎం చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో ఫైరైపోయారు. ప‌నిలోప‌నిగా కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడుపైనా నిప్పులు చెరిగారు. ప్ర‌త్యేక హోదాను ఏపీకి ఇవ్వ‌క‌పోగా ప్యాకేజీపై పోటా పోటీ స్టోరీలు చెబుతున్నార‌ని ఆమె విరుచుకుప‌డ్డారు. వాస్త‌వానికి నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబునే టార్గెట్ చేసిన రోజా.. తాజాగా ప్యాకేజీ వ‌చ్చిన త‌ర్వాత నుంచి వెంక‌య్య‌ను కూడా అప్పుడ‌ప్పుడు టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. అయితే,  తాజాగా మాత్రం మ‌రింతగా ఇద్ద‌రిపైనా […]

చంద్ర‌బాబు డైలాగ్ జోకుల‌కే పెద్ద జోకు

ఏపీ సీఎం చంద్ర‌బాబు పాల‌నా ప‌రంగా పెద్ద హిట్‌! ఈ విష‌యంలో విప‌క్ష నేత‌లు సైతం ఆఫ్ ది రికార్డ్ అంగీక‌రించే విష‌యం. ఆయ‌నెప్పుడూ సీరియ‌స్‌గానే ఉంటారు. ఆయ‌న ముఖంలో చూద్దామ‌న్నా న‌వ్వు క‌నిపించ‌దు. అలాంటి చంద్ర‌బాబు నిన్న చెప్పిన ఓ డైలాగ్‌.. పెద్ద జోక్‌గా మారిపోయింది. బుధ‌వారం నుంచి విజ‌య‌వాడ‌లో క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు జ‌రుగుతోంది. దీనిలో అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారిని ఉద్దేశించి ప్ర‌సంగించిన సీఎం చంద్ర‌బాబు.. ఓ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య […]

టీడీపీ ఎమ్మెల్యే కాలేజ్‌లో నోట్ల క‌ట్ట‌లు

టీడీపీ ఎమ్మెల్యే కాలేజీలో 500 రూపాయ‌లు, 1000 రూపాయ‌ల నోట్ల క‌ట్ట‌లు కుప్ప‌లు తెప్ప‌లుగా ద‌ర్శ‌న‌మిచ్చాయి. ఎంత తోడుతుంటే అంత అన్న‌ట్టుగా తీసిన‌కొద్దీ క‌ట్ట‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి.! ఆశ్చ‌ర్యంగా అనిపించినా ఇది నిజం! నిన్న‌గాక మొన్న టీడీపీ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి సంస్థ‌ల‌పై బెంగ‌ళూరులో ఐటీ అధికారులు దాడి చేశార‌నే వార్త సంచ‌ల‌నం రేపి 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క‌ముందే అదే తెలుగు దేశం పార్టీకి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే డీ కే స‌త్య‌ప్ర‌భ‌(టీడీపీ […]