నంద్యాల MLA భూమా నాగిరెడ్డి అకాల మరణం పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరిని కలచివేసింది మాట వాస్తవం.ఇలాంటి టైం లో తల్లి దండ్రుల్ని కోల్పోయి పుట్టెడు దుఃఖం లో మునిపోయిన భూమా పిల్లలకి ప్రతి ఒక్కరు బాసటగా నిలవాలి.విచిత్రం ఏంటంటే బాసటగా నిలవడం లోను రాజకీయమే..చివరికి సంతాపము రాజకీయమే…ఆఖరికి భూమా మరణమే ఒక శవ రాజకీయమైపోయింది. ఇక్కడ భూమా మరణం వెనుక అధికార టీడీపీ పాత్ర మరీ ముక్యంగా అధ్యక్షుడు చంద్రబాబు పాత్ర ఎంత అనే చర్చ జరుగుతున్న […]
Category: Latest News
అమ్మ వారసుడు ఉన్నాడా ..? ఆస్తులు నాకే సొంతం
మొన్నటికి మొన్న `మెగాస్టార్ చిరంజీవి కొడుకును నేను` అని ఒక వ్యక్తి సృష్టించిన హల్ చల్ అంతా ఇంతా కాదు!! ఇప్పుడు తమిళనాడు మాజీ సీఎం జయలలిత విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోంది. తమిళనాడు రాజకీయాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. కానీ ఉరుము లేని పిడుగులా వస్తున్న `నేను అమ్మ కూతురిని` అని మొన్ననే ఒక యువతి హల్‌చల్ చేసింది. ఇప్పుడు `నేను అమ్మ కొడుకుని` అంటూ మరో వ్యక్తి తెరపైకి వచ్చాడు! ఇన్నాళ్లూ ఎందుకు […]
పయ్యావుల కేబినెట్ ఎంట్రీకి అడ్డు పుల్లెవరు..!
ఏపీలో కేబినెట్ ప్రక్షాళన వార్తలు గత కొద్ది రోజులుగా జోరుగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రకాక్షళనలో ఆశావాహుల లెక్కలు భారీగానే ఉన్నాయి. ఎమ్మెల్యేలుగా ఉన్న వారు, సీనియర్లు, జంపింగ్ జపాంగ్‌లు, ఎమ్మెల్సీలు ఇలా ఎవరికి వారు తమకు కేబినెట్‌లో బెర్త్ ఖాయమని ఆశల్లో మునిగి తేలుతున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు ఫస్ట్ బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన నంద్యాల ఎమ్మెల్యే […]
భూమా మృతికి సంతాపమా? ఎన్నికల ప్రచారమా?
కాదేదీ కవితకనర్హం అన్నాడో మహాకవి!! ఇప్పుడు కాదేదీ రాజకీయాలకనర్హం అంటున్నారు రాజకీయ నాయకులు! ఏ అంశాన్నయినా రాజకీయాన్ని చేసి.. దానిని తమ అవసరాలకు ఉపయోగించుకోవడం ప్రస్తుత రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య! కరెక్టుగా ఇప్పుడు భూమా నాగిరెడ్డి మరణాన్ని కూడా ఎవరికి వారు.. తమకు అనుకూలంగా మార్చుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. చివరికి ఆయనకు సంతాప సభ కూడా రాజకీయాలకు వేదికగా మారిపోవడం దురదృష్టకరం!! ఒక నాయకుడు మృతి చెందిన వెంటనే ఆ నాయకుడికి, ఆ నాయకుడి […]
అమిత్ మ్యాజిక్ ఇక్కడ పని చేస్తుందా..!
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన అనంతరం.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటన సర్వత్రా ఆసక్తి నెలకొల్పుతోంది. ముఖ్యంగా షా తదుపరి లక్ష్యం తెలంగాణ అని ఇప్పటికే సంకేతాలు వెలువడిన నేపథ్యంలో.. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కట్టడి చేసేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో బలమైన నాయకుడిగా మారిన కేసీఆర్‌ను.. షా ఎలాంటి వ్యూహాలు రచిస్తారు? మరి అందరిలానే అమిత్ షా వలలో కేసీఆర్ చిక్కుతాడా? అనే […]
మూడేళ్ల జనసేన ఇన్నర్ రిపోర్ట్
ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పాడు పవన్!! ఇలా చెప్పి మూడేళ్లు పూర్తయింది. అడపాదడపా రావడం.. ఆవేశంగా మాట్లాడటం.. కొన్ని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం.. తనపై విమర్శలు చేసిన వారికి ఒకేసారి బదులు చెప్పడం.. ఏదైనా సంఘటన జరిగినపుడు ట్విటర్‌లో నాలుగు ముక్కలు రాసేయడం.. మినహా ఈ మూడేళ్లలో పవన్ పెద్ద విజయాలు సాధించలేదనే చెప్పాలి. పవన్ కు ఉన్న ఫాలోయింగ్ తో ఆయనపై పొలిటికల్ ఎంట్రీపై బాగానే ఆశలు పెట్టుకున్నారు. ప్రజల సమస్యలపై సమరశంఖారావం పూరిస్తారని […]
కేంద్రం నియోజకవర్గాల పెంపు…బాబుకి కొత్త జిల్లాల డిమాండ్
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే నియోజకవర్గాల పెంపు అంశం తెరపైకి వచ్చింది. విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన అంశాన్ని కేంద్రం పక్కన పెట్టింది. అయితే కొన్ని రోజులుగా ఈ అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల సమయానికే నియోజకవర్గాలను పెంచాలని కేంద్రం నిర్ణయించిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే.. నియోజకవర్గాలే గాక.. ఇప్పుడు కొత్త జిల్లాల అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న 13 […]
నెల్లూరు ఎమ్మెల్సీ పోరులో ఆధిపత్య పోరు
ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నెల్లూరు జిల్లా రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీకి చుక్కెదురయ్యేలా కనిపిస్తోంది. మొత్తం మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గాను.. రెండింటిలో సునాయాసంగా గెలుస్తామని నేతలు ధీమాగా ఉన్నారు. ఇక మూడో స్థానంలో మాత్రం ప్రతిపక్షానికి దక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం! ముఖ్యంగా తమ అభ్యర్థుల విజయం కోసం మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర రెడ్డి వర్గం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇదే సమయంలో తమ […]
అఖిల్ ప్రియ ఎంట్రీతో ఎవరికి చెక్..!
తండ్రికి దక్కనిది కూతురికి దక్కుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతోంది. నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో.. ఆయన అనుచరులను తీవ్రంగా కలిచివేస్తోంది. మంత్రి వర్గంలో చేరాలనే కోరిక.. తీరకుండానే ఆయన కన్నుమూశారు! దీంతో ఇప్పుడు ఆయన కూతురు అఖిల ప్రియకు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈనేపథ్యంలో కేబినెట్‌లోకి ఆమె ఎంట్రీ ఇస్తే.. ఇప్పుడు ఎవరికి చెక్ చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ముగ్గురు మహిళలు మంత్రులుగా కేబినెట్లో ఉన్నారు. మరి అఖిలప్రియకు […]