ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ తన దూకుడు చూపించింది. స్థానిక సంస్థలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప, కర్నూలుతో పాటు నెల్లూరు ఎమ్మెల్సీలను టీడీపీ కైవసం చేసుకుంది. శుక్రవారం ప్రారంభమైన కౌంటింగ్‌లో ముందుగా నెల్లూరుతో టీడీపీ బోనీ కొట్టింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి వైసీపీ అభ్యర్థి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డిపై 87 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ అభ్యర్థి […]
Category: Latest News
జనసేనలోకి మెగాస్టార్..? ఆ ఇద్దరు మధ్యవర్తిత్వం..!
ఇద్దరు అన్నదమ్ములు టాలీవుడ్‌ను ఓ యేలు యేలుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి 9 యేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా ఖైదీ నెంబర్ 150 సినిమాతో తన ఛరిష్మా ఏ మాత్రం తగ్గలేదని ఫ్రూవ్ చేసుకున్నాడు. ఇక చిరు తమ్ముడు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అయితే అన్న ప్రజారాజ్యానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన యువరాజ్యానికి అధ్యక్షుడిగా పనిచేసి ఇక గత ఎన్నికలకు ముందు జనసేన రాజకీయ పార్టీ స్థాపించాడు. ఆ ఎన్నికల్లో పవన్ టీడీపీ+బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చాడు. ఇక […]
నంద్యాలలో చంద్రబాబు మైండ్ బ్లాక్ చేసిన జగన్
ఇటీవల ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణం చెందడంతో అక్కడ ఐదారు నెలల్లో ఉప ఎన్నిక జరగనుంది. నంద్యాల ఉప ఎన్నిక ప్రస్తావన అప్పుడే ఏపీ రాజకీయవర్గాల్లో చర్చకు వస్తోంది. దీనిపై విపక్ష వైసీపీ అధినేత జగన్ ముందుగానే డెసిషన్ తీసేసుకున్నారు. నంద్యాల సీటు తమదే అని…అక్కడ నుంచి వైసీపీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని ప్రకటించడంతో నంద్యాలలో ఉప ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ క్రమంలోనే చంద్రబాబు ఇక్కడి నుంచి […]
టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం..!
యూపీ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆపరషన్ తెలంగాణ మీదే ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వచ్చే 2019 ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడం లేదా ప్రధాన ప్రతిపక్షంగా టీఆర్ఎస్‌కు ధీటుగా ఉండేలా అమిత్ ప్లాన్లు వేస్తున్నారట. తెలంగాణలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. 2019 ఎన్నికల నాటికి బీజేపీ ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణలో అధికారంలోకి రావడంతో పాటు అక్కడ నుంచి వీలున్నన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవడం. […]
తమిళనాట షాక్: దీప ఓ పార్టీ, దీప భర్త మరో పార్టీ
తమిళనాట మరో సంచలనం! దివంగత మాజీ సీఎం జయలలిత సమాధి.. ఎన్నో ఆసక్తికర అంశాలకు వేదికగా నిలుస్తోంది. ఊహించని పరిణామాలతో రోజుకో మలుపు తిరుగుతున్న తమిళ రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్! అమ్మ వారసురాలిగా తెరపైకి వచ్చిన ఆమె మేనకోడలు దీపకు అనుకోని వ్యక్తి నుంచి అనూహ్యంగా షాక్ ఎదురైంది. దీప ఇంట్లోనే రెండు పార్టీలు ఏర్పడబోతున్నాయి. ఇప్పటికే దీప ఒక పార్టీని ఏర్పాటుచేయగా.. ఇప్పుడు ఆమె భర్త కూడా సొంతంగా ఒక పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించి కలకలం […]
రుణ`మాఫీ`తో ఇద్దరు చంద్రులకు చెక్
తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడానికి బీజేపీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో భారీ విజయం సాధించిన తర్వాత.. ఆ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం రైతులకు `రుణమాఫీ` చేస్తుందని, ఆభారం కేంద్రమే భరిస్తుందని చేసిన కేంద్రమంత్రి పకటనతో.. ఇప్పుడు ఇద్దరు చంద్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 2014 ఎన్నికల్లో రుణమాఫీ నే ప్రచారంగా చేసుకుని అటు చంద్రబాబు, ఇటు కేసీఆర్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇప్పుడు అదే అస్త్రాన్ని 2019 ఎన్నికల్లో ఉపయోగించే దిశగా కేంద్రం అడుగులేస్తోంది. […]
భూమా వర్గాన్ని బలహీనం చేస్తుంది ఎవరు?
నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణంతో.. ఆయన వర్గం దిక్కలేనిది అయిపోయింది. ఇప్పటివరకూ నంధ్యాలలో పరిస్థితిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక తీవ్రంగా మధనపడింది పార్టీ అధిష్ఠానం! ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటి వరకూ బలంగా ఉన్న భూమా వర్గాన్ని బలహీనం చేసేందుకు వెనుక నుంచి శర వేగంగా పావులు కదుపుతోంది. నంద్యాల రాజకీయాలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఆసక్తికరంగా మార్చేశారు. భూమా నాగిరెడ్డి మరణం తరువాత ఉప […]
శశికళను పక్కన పెట్టిన అన్నాడీఎంకే
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు కాలం కలిసి రావట్లేదు! తన వర్గం వారే ఇప్పుడు ఆమెను పట్టించుకోవడం లేదు! తన తరఫున సీఎం పదవిలో కూర్చోపెట్టిన పళని స్వామి ఇప్పుడు చిన్నమ్మ వంకే చూడటం లేదట. అన్నాడీఎంకే కార్యకర్తలు కూడా ఆమెను లైట్ తీసుకోవడం మొదలుపెట్టారట. దీంతో నమ్మిన వారే ఇలా చేయడంతో శశికళ తీవ్రంగా ఆగ్రహానికి గురవుతున్నారట. ఇప్పుడు దీనికి తోడు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో ఆమె ఉంటారో లేదో రెండు రోజుల్లో స్పష్టత […]
2019 వార్: ఏపీ-తెలంగాణలో రాజకీయాలను శాసిస్తున్న కులాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడి అప్పుడే మూడేళ్లు గడిచిపోయింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి మధ్యలో జరిగే చిన్నా చితకా ఎలక్షన్లతో పాటు 2019 ఎన్నికలపైనే ఉంది. 2019లో ఏపీ, తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది ? ఏ పార్టీల మధ్య ప్రధానంగా పోరు ఉంటుంది ? అసలు ఎవరి బలం ఎంత? ఎవరి బలగం ఎంత? ఒంటరిగా బరిలో నిలిచి ఒకే పార్టీ అధికారం దక్కించుకునే అవకాశం ఉందా ? ఇలా ఎన్నో ప్రశ్నలు […]