దాస‌రి ఫ్యామిలీలో అప్పుడే ఆస్తి గొడ‌వ‌లా..?

ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ‌రావు మ‌ర‌ణాన్ని ప్ర‌స్తుతం తెలుగు వాళ్లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ఈ దిగ్గజద‌ర్శ‌కుడు ఆక‌స్మిక మ‌ర‌ణంతో తెలుగు ప్ర‌జ‌లంద‌రూ ఓ వైపు బాధ‌ప‌డుతుంటూ మ‌రోవైపు దాస‌రి ఫ్యామిలీలో అప్పుడే ఆస్తి చిచ్చు మొద‌లైన‌ట్టు ఆ ఫ్యామిలీ మెంబ‌ర్స్ వ్యాఖ్య‌ల ద్వారా తెలుస్తోంది.

దాస‌రి మృతిప‌ట్ల ఓ వైపు దేశ‌వ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తుతుంటే దాస‌రి పెద్ద కోడ‌లు సుశీల మాత్రం దాస‌రిది స‌హ‌జ మ‌ర‌ణం కాద‌ని…ఆయ‌న మ‌ర‌ణం ఆస్తి కోసం జ‌రిగి ఉండ‌వ‌చ్చ‌న్న సందేహాలు ఆమె వ్య‌క్తం చేశారు. దాస‌రి త‌న‌యుడు అయిన తార‌క‌ప్ర‌భు భార్యే ఈ సుశీల‌. సుశీల గ‌తంలో త‌న భ‌ర్త‌పై వ‌ర‌క‌ట్నం ఆరోప‌ణ‌లు చేసి పోలీస్‌స్టేష‌న్ వ‌రకు కూడా వెళ్లింది. త‌ర్వాత ఆమె అడ్ర‌స్ లేదు. ఇప్పుడు దాస‌రి మృతి త‌ర్వాత తిరిగి తెర‌మీద‌కు వ‌చ్చింది.

తాను రెండు వారాల క్రితం దాస‌రిని క‌లిశాన‌ని..త‌న‌కు స‌ర్జ‌రీ త‌ర్వాత ఆస్తుల పంప‌కాన్ని చేప‌డ‌తాన‌ని ఆయ‌న త‌న‌కు హామీ ఇచ్చార‌ని ఆమె చెపుతోంది. ఇక త‌న త‌న‌యుడిని ద‌గ్గ‌ర‌కు తీసుకునేందుకు కూడా ఆయ‌న అనుమ‌తించిన‌ట్టు సుశీల చెపుతోంది. అలాగే దాస‌రి మృతికి రెండు రోజుల ముందు తాను ఆయ‌న్ను క‌లిసేందుకు ప్ర‌య‌త్నించ‌గా తనకు అనుమతినివ్వలేదని సుశీల వాపోయింది.

ఆస్తుల పంప‌కంపై ఆయ‌న ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే మృతిచెంద‌డం ప‌లు అనుమానాల‌కు తావిచ్చేలా ఉంద‌ని సుశీల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం ఇప్పుడు ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ఇక దీనిపై ఇండ‌స్ట్రీలో ఇన్న‌ర్‌గా దాస‌రి ఫ్యామిలీతో ఆస్తి పంప‌కాల‌పై గొడ‌వ‌లు జ‌రుగుతున్న‌ట్టు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. మ‌రి ఈ క‌థ ఎటు మ‌లుపులు తిరుగుతుందో చూడాలి.