పవన్ అభిమానులకు శుభవార్త ..!

జనసేన అధినేత, టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొద్ది రోజుల క్రితం క‌రోనా బారిన ప‌డిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా త‌న ఫాం హౌజ్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఆయ‌న కోలుకున్న విష‌యాన్ని జ‌నసేన పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించింది. మూడు రోజుల కింద‌ట పవన్ కళ్యాణ్ కు ఆర్‌టీపీసీఆర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఆ ప‌రీక్ష‌ల‌లో ఆయనకు నెగెటివ్ వ‌చ్చింది. ఆరోగ్య‌ప‌రంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కి ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని వైద్యులు తెలిపిన‌ట్టు […]

మెగా ఆఫ‌ర్ ప‌ట్టిన ఎన్టీఆర్ హీరోయిన్‌?

మమతా మోహన్ దాస్‌.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎన్టీఆర్ హీరోగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన యమ‌దొంగ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన మ‌మ‌తా.. న‌టిగానే కాకుండా సింగ‌ర్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కెరీర్ ఊపందుకుంటున్న స‌మ‌యంలో ఈ బ్యూటీ అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా సడన్‌గా కనుమరుగయ్యారు. మ‌ళ్లీ చాలా ఏళ్ల త‌ర్వాత మ‌మ‌తా లాల్ భాగ్ అనే త్రిభాషా సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. అలాగే మ‌రికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఈమె చేతిలో […]

బ్రేకింగ్ : కడప జిల్లాలో ఘోర ప్రమాదం..!

ఏపీలో ఘోరం జరిగింది. ముగ్గురాయి గనిలో పేలుడు వద్ద ప్రమాదం చోటుచేసుకోవడంతో 9 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం కడపజిల్లాలోని కలసపాడు మండలంలో చోటుచేసుకుంది. ముగ్గురాయి గనిలో కార్మికులు ముగ్గురాయి తొలగించేందుకు జిలిటెన్‌ స్టిక్స్‌ పేలుస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పేలుడు వల్ల కొందరి పరిస్థితి విషమంగా తయారైంది. జిలిటెన్‌ స్టిక్స్‌ వాహనంలో తీసుకువస్తుండగా, ప్రమాదవశాత్తు పేలినట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురాయి గనిలో పనుల కోసం […]

క‌రోనా దెబ్బ‌..ఓటీటీలో రాబోతున్న గోపీచంద్ `సీటీమార్‌`?

యాక్ష‌న్ హీరో గోపీచంద్ తాజా చిత్రం సీటీమార్. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ టీమ్ కోచ్‌గా, తమన్నా తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్‌గా క‌నిపించ‌నున్నారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3గా హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అన్ని అనుకున్న‌ట్టు జ‌రిగితే ఏప్రిల్ 2నే ఈ చిత్రం విడుద‌ల […]

చీటింగ్ కేసులో దర్శకుడు అరెస్ట్..!!?

ప్రముఖ మళయాళీ సినీ దర్శకుడు, యాడ్ ఫిల్మ్‌మేకర్ వీఏ శ్రీకుమార్‌ మీనన్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ గ్రూప్‌ బిజినెస్‌లో రూ. 7 కోట్ల మేర మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. శ్రీవాసలం బిజినెస్ గ్రూప్‌కి చెందిన రాజేంద్రన్ పిళ్లై ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీకుమార్‌ని అరెస్ట్‌ చేశారు. గురువారం వీఏ శ్రీకుమార్ మీనన్ ను కోర్టులో హాజరుపరిచారు. అతనిపై సెక్షన్ 406, సెక్షన్ 420ల కింద యాక్షన్ […]

క‌రోనా బారిన ప‌డ్డ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌!

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్‌లో దేశ ప్ర‌జ‌ల‌ను ఏ స్థాయిలో అత‌లా కుత‌లం చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే రోజు రోజుకు ల‌క్ష‌ల సంఖ్య‌లో క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి. సామాన్య ప్రజలు మాత్రమే కాదు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా క‌రోనా బారిన ప‌డుతూ నానా ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌, కాంట్రవర్సీ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ కు కూడా కరోనా సోకింది. త‌న‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌నే […]

బాలీవుడ్ ఎంట్రీకి అదే అడ్డంకి..సీక్రెట్స్ రివిల్ చేసిన నాని!

టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం వ‌రుస సిసిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో టక్ జగదీష్ చిత్రాన్ని పూర్తి చేసిన నాని.. రాహుల్ సాంకృత్యాయన్ డైరెక్ష‌న్‌లో శ్యామ్ సింగరాయ్, వివేక్ ఆత్రేయ డైరెక్ష‌న్‌లో అంటే సుందరానికి..! చిత్రాల‌ను చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ రెండు చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇదిలా ఉంటే..ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది హీరోలు తమ మార్కెట్ ను ఇత‌ర భాష‌ల్లో కూడా పెంచుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. […]

నిర్మాత ఎం.ఎస్‌. ప్రసాద్‌ మృతి..!

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. నిన్నటి రాత్రి ప్రముఖ నిర్మాత మర్రిపాటి సత్యనారాయణ ప్రసాద్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యపాలైన ఆయన గుండెపోటుతో చెన్నైలో కన్ను మూశారు. సినీ ఇండస్ట్రీలో ఈయన పలు విజయవంతమైన సినిమాలను నిర్మించారు. చిత్ర పరిశ్రమలో ఎం.ఎస్‌. ప్రసాద్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 1945 జూలై 18న మచిలిపట్నంలో జన్మించిన సత్యనారాయణ ప్రముఖ దర్శకుడు అయిన ఆదుర్తి సుబ్బారావు బావగారు. సుబ్బారావుతో కలిసి కృష్ణ హీరోగా ‘మాయదారి మల్లిగాడు’, ‘గాజుల కిష్టయ్య’ చిత్రాలు నిర్మించారు. […]

`ఉప్పెన` హీరోకు క‌రోనా క‌ష్టాలు..ఓటీటీలో రెండో చిత్రం?!

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ ఉప్పెన సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్న వైష్ణ‌వ్ త‌న రెండో చిత్రాన్ని క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చేశాడు. ఉప్పెన విడుద‌ల‌కు ముందే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి రాసిన పాపులర్ నవల కొండపోలం ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రానికి కొండ‌పొలం అనే […]