గాంధీభవన్ పటేల్ నగర్లో ఉద్రిక్తం.. అల్ల‌రిమూక‌ల వీరంగం..

హైద‌రాబాద్ గాంధీభవన్ పటేల్ నగర్ బ‌స్తీలో ఉద్రిక్త‌త నెల‌కొంది. బ‌స్తీలో స్పీడ్ డ్రైవింగ్ చేయ‌వ‌ద్ద‌ని సూచించినందుకు కొంతమంది అల్ల‌రు మూకలు బ‌స్తీకి చెందిన‌ పెద్ద శేఖర్ తో పాటు మరో వ్యక్తి సతీష్ పై దాడికి పాల్పడ్డారు. సతిష్ కు తీవ్ర గాయాలు కాగా, వారిని హుటాహుటిన వైద్య‌శాల‌కు తరలించారు బేగంబజార్ పోలీసులు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సెంట్రల్ జోన్ ఆడిసినల్ సిపి విశ్వ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నాయి. భారీగా పోలీసులు మోహరించ‌డంతో […]

క‌రోనా నేప‌థ్యంలో కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం..!

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్నరాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పని వత్తిడి తగ్గించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా రాష్ట్ర వ్య్తాప్తంగా దాదాపు 50 వేల మంది ఎంబీబీఎస్ పూర్తిచేసి సిద్దంగా వున్న అర్హులైన వైద్యులనుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని నిర్ణయించారు. రెండు, మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ని తక్షణమే నియమించుకోవాలని, కరోనా వైద్యంలో […]

ప్రైవేట్ టీచ‌ర్ల‌కు, రేష‌న్‌దారులకు కేసీఆర్ తీపిక‌బురు..!

క‌రోనా సెకండ్ వేవ్‌తో ప‌రిస్థితి బీతావాహంగా మారిపోయింది. ఆర్థిక వ్య‌వ‌స్త కుప్ప‌కూలిపోయింది. సామాన్యులు ఉపాధి, ఆదాయం లేక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. రోజువారీ ఖ‌ర్చుల‌కూ నానా తంటాలు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ మ‌రోసారి మాన‌వ‌త‌ను చాటుకున్నారు. రేష‌న్‌కార్డు దారుల‌కు తీపి క‌బురును అందించారు. తెలంగాణ రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులందరికీ, మనిషికొక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని రెండు నెలల పాటు ఉచితంగా అందచేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. ఇక అదేవిధంగా ప్రైవేట్ టీచ‌ర్ల‌కు […]

‘క్యాలీఫ్లవర్’ సినిమా టీజర్ మీ కోసం..!

టాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి హృద‌య కాలేయం చిత్రంతో ఎంట్రీ ఇచ్చి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సంపూర్ణేష్ బాబు. ఎప్పటికప్పుడు డిఫ‌రెంట్ మూవీస్ చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అలరిస్తూ వస్తున్నాడు సంపూ. 2014లో వచ్చిన హృదయకాలేయం మూవీతో బ‌ర్నింగ్ స్టార్‌గా మారిన సంపూర్ణేష్ బాబు టాలీవుడ్‌లో మంచి పేరు పొందాడు. ప్ర‌స్తుతం సంపూర్ణేష్ బాబు బ‌జార్ రౌడీ మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆర్‌.కె.మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో క్యాలీ ఫ్ల‌వ‌ర్ అనే టైటిల్‌తో సంపూర్ణేష్ బాబు ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. […]

కొడుకు అమానుషం.. తండ్రి అంత్య‌క్రియ‌ల‌కు స‌సేమిరా..

క‌రోనా వైర‌స్ మాన‌వ సంబంధాల‌ను మంట‌గ‌లుపుతున్న‌ది. కుటుంబ అనుబంధాల‌ను సైతం చిధ్రం చేస్తున్న‌ది. అప్యాయ‌త పంచాల్సిన వారే అనుమానంతో ప‌రాయివాళ్లుగా మారేలా చేస్తున్న‌ది. అంద‌రూ ఉన్నా అనాథాలుగా మారాల్సిన దుస్థితికి తీసుకొస్తున్న‌ది. వైర‌స్ బారిన ప‌డిన త‌ల్లిదండ్రుల‌ను, పిల్ల‌ల‌ను కొంద‌రు ప్రాణాల‌కు తెగించి కాపాడుకుంటుంటే, మ‌రికొంద‌రు మాత్రం బ‌తుకుతీపితో అమానుషంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది కృష్ణ‌జిల్లాలో వెలుగుచూసిన ఈ సంఘ‌ట‌న‌. కరోనా నెగిటివ్‌ వచ్చినప్పటికీ తండ్రి అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించకుండా వెళ్లిపోయాడు ఓ దుర్మార్గ కొడుకు. వివ‌రాల్లోకి […]

కార్తీ ‘సర్దార్‌’కు అదే హైలెట్ అట..!

ప్రముఖ కోలీవుడ్ స్టార్ కార్తీ తెలుగులోనూ ప్రముఖ నటుడే. తాజాగా కార్తీ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం సర్దార్. ఈ చిత్రానికి సంబంధించి వేసిన సెంట్రల్ జైల్ సెట్ ఈ మూవీకి ఎంతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని మూవీ యూనిట్ తెలిపారు. ఈ చిత్రంలో కార్తీ సరసన హీరోయిన్ గా అందాల భామ రాశి ఖన్నా నటిస్తోంది. ఈ మధ్యే రిలీజ్ అయిన సర్దార్ మూవీ ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించింది. […]

జ్యువెల్ల‌రీ షాపులో భారీ చోరీ.. సీసీఫుటేజీల‌నూ వ‌ద‌ల‌ని దొంగ‌లు

ఒక‌వైపు క‌రోనా సెకండ్ వేవ్ విల‌య‌తాండం చేస్తున్న‌ది. వేలాది మంది ప్రాణాల‌ను పొట్ట‌న పెట్టుకుంటున్న‌ది. ల‌క్ష‌లాది మంది వైర‌స్ బారిన వైద్య‌శాల‌ల్లో చికిత్స పొందుతున్నారు. వైర‌స్‌ను అరిక‌ట్టేందుకు అటు వైద్యులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఇక పోలీసులు సైతం 24 గంట‌లు అందుబాటులో ఉంటూ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు. ఎవ‌రి ప‌నుల్లో త‌ల‌మున‌క‌లైపోతుండా దొంగ‌లు సైతం వారి ప‌ని వారు సాగిస్తున్నారు. అధికారుల‌కు మ‌రిన్ని త‌ల‌నొప్పులు తెస్తున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిల‌స్తుంది ఈ సంఘ‌ట‌న‌. హైద‌రాబాద్ చందానగర్ […]

సంపూ ‘క్యాలీఫ్లవర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ …!

బర్నింగ్ స్టార్ గా టాలీవుడ్ లో పేరుపొందిన సంపూర్ణేష్ బాబు ఈసారి మరో ప్రయోగంతో దూసుకొస్తున్నాడు. అతడి గెటప్ అసాధారణంగా ఉంటుందని తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ చెబుతోంది. నేడు సంపూ బర్త్ డే సందర్భంగా కెరీర్ లో ఐదో సినిమా అయిన `క్యాలీఫ్లవర్` లుక్ లాంచ్ అయ్యింది. గుర్రంపై సంపూ దూసుకొస్తున్న ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సంపూర్ణేష్ బాబు తెల్లదొరగా ఉన్నారు. మొదటి బ్యాంగ్ వీడియోలో భారతీయ మహిళా స్వచ్ఛత […]

ఏపీలో రేషన్ షాపులు బంద్..!

రేషన్‌ డీలర్ల సమస్యలను పరిష్కారించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ షాపులను బంద్‌ చేస్తున్నట్లు రేషన్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు మండాది వెంకట్రావు తెలిపారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్రంలో సగం మంది బియ్యం పంపిణీ వాహనదారులు(ఎండియు) పనిచేయడంలేదని పేర్కొన్నారు. డోర్‌ డెలివరీ రేషన్‌ పంపిణీపై విజిలెన్స్‌ విచారణ నిర్వహించాలని, దీనిలో ఉన్న లోపాలను గుర్తించాలని తెలిపారు. ఎండియు లు చేయాల్సిన రేషన్‌ పంపిణీని డీలర్లు చేయాలని అధికారులు […]