పతాక సన్నివేశాల్లో ‘బాబు బంగారం’

కొంత గ్యాప్ తర్వాత విక్టరీ వెంకటేష్ బాబు బంగారంగా వస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు రెడీ అవుతున్నారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ లో ఆయన మార్క్ వినోదం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక చివర్లో ఆయన పలికిన “అయ్యో అయ్యో అయ్యయ్యో..” డైలాగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన క్లైమాక్స్ దృశ్యాల చిత్రీకరణ హైదరాబాద్ – గచ్చీబౌలీలో సాగుతోంది. వెంకటేశ్, నయనతార, ప్రధాన తారాగణం పాల్గొన్న పతాక సన్నివేశాలను దర్శకుడు మారుతి […]

జార్జియాలో ‘శాతకర్ణి’ పోరాటం!

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ టైటిలే చాలా గంభీరంగా ఉంది. ఇక హీరో బాలయ్య లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. ఇటీవలే విడుదల పోస్టర్ ఆయన అభిమానలోకాన్నే కాక సినీప్రియులు, విమర్శకులను ఆకట్టుకుంది. మొరాకోలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కోసం డైరక్టర్ క్రిష్ పడుతున్న తపన అంతాఇంతా కాదు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ను జార్జియాలో ప్లాన్ చేశారు. జులై 2 నుంచి 22 రోజులు భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించాలని అనుకుంటున్నారు. ఈ షెడ్యూల్ […]

ఇంటి వేటలో సమంతా!

అమాయకత్వం, చిలిపితనం, మరికొంచెం గడుసుతనం తెరపై పండించాలంటే సమంతాకు మించినవారులేరు. టాలీవుడ్, కోలీవుడ్ ల్లో బ్లాక్ బస్టర్స్ ను ఖాతాలో వేసుకుని జోష్ మీద ఉన్న ఈ బ్యూటీ ఇంటి వేటలో ఉన్నట్లు తెలుస్తోంది. హైద్రాబాద్ లో ఆమె ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఆమె ఇల్లు తీసుకోవాలని అనుకుంటున్నది భాగ్యనగరంలో కావడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో ఎక్కువ అవకాశాలు ఉండడం […]

హిట్టయితే 15 కోట్లు..ఫట్టయితే 5 కోట్లు

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే రియలిస్టిక్ యాక్టర్ గా పేరు సంపాదించుకున్న హీరో కమల్ హాసన్. కమల్ హాసన్ చేసిన ప్రయత్నాలు మరే హీరోనూ చేయలేదు. సినిమాల్లో డబ్బు సంపాదించుకోవటంతోనే పెద్ద స్టార్ గా మారిపోయాము అనుకునే హీరోల్లా కాకుండా, డబ్బుతోపాటు నిజమైన యాక్టర్ గా నిరూపించుకోవాలని తహతహలాడే యాక్టర్ గా కమల్ హాసన్ నిలిచాడు. తను ఎంతైతే ఇండస్ట్రీలో సంపాదించుకున్నాడో, అంతకు మించి ఇండస్ట్రీలో పోగొట్టుకున్నాడు. ఇప్పుడిప్పటే అటువంటి ప్రయత్నాలు నుండి దూరంగా జరిగి, కాస్త డబ్బుని […]

మెరుపుతీగ బొద్దుగుమ్మలా మారుతోంది

నాజూకైన అందం ముద్దుగుమ్మ శ్రియది. వయసు పెరిగినా కానీ తన దేహాకృతిలో ఏ మాత్రం మార్పు రాకుండా మెయింటైన్‌ చేస్తోంది శ్రియ. అటువంటి మెరుపుతీగ శ్రియ ఇప్పుడు బొద్దుగుమ్మలా మారబోతోంది. ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాలో బాలయ్య పక్కన జోడీ కోసమట. బొద్దుగా అంటే మరీ ఎక్కువగా కాకుండా, జీరోసైజ్‌ నుంచి కాస్త కండ పట్టేలా శ్రియ తన శరీరాన్ని మార్చుకోనుంది దర్శకుడి సూచన మేరకు శ్రియ ఈ ప్రయత్నం చేస్తోందట. ఈ మధ్య మరీ సన్నగా […]

మెగాస్టార్‌ చిరంజీవి సర్వసన్నద్ధం

చిరంజీవి సినిమా కోసం పూర్తిగా సన్నద్ధమైపోయారు. పూర్తి హ్యాండ్‌సమ్‌ లుక్స్‌లోకి వచ్చేశారు. రాజకీయాల్లో ఉంటూ, సినిమాల్లో నటించడం ఒకింత కష్టమైన ప్రక్రియే అయినప్పటికీ మెగాస్టార్‌ తన అభిమానుల కోరకను తీర్చడం కోసం కొంచెం ఎక్కువగానే కష్టపడాల్సి వచ్చింది. తమిళ్‌ సినిమా ‘కత్తి’కి రీమేక్‌గా రానున్న ఈ సినిమాకి ‘కత్తిలాంటోడు’ అనే పేరు పరిశీలనలో ఉంది. వినాయక్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా అతి త్వరలో సెట్స్‌ పైకి వెళ్లనుంది. హీరోయిన్‌ ఎవరన్న దానిపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. […]

కొరటాల హీరోలకు అందడేమో!

ఇద్దరు పెద్ద హీరోలు, రెండు పెద్ద సినిమాలు, భారీ విజయాలు. అంతే ఆ డైరెక్టర్‌ దశ తిరిగిపోయింది. అంతవరకూ స్టోరీ రైటర్‌గా ఉన్న ఆయన ఇంకెవరో కాదు కొరటాల శివ. ప్రభాస్‌తో ఆయన చేసిన ‘మిర్చి’ ఘాటైన విజయం తెచ్చి పెట్టింది. సూపర్‌ స్టార్‌ మహేష్‌తో చేసిన ‘శ్రీమంతుడు’ సూపర్బ్‌ విజయాన్ని అందించింది. దాంతో కొరటాల రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు ఆయన కోసం స్టార్‌ హీరోలు క్యూ కట్టేస్తున్నారు. సాదా సీదా హీరోలకెవ్వరికీ ఈ స్టార్‌ […]

మహేష్ రెమ్యునరేషన్ చూస్తే షాకే!!

జులైలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు, ఎ.ఆర్.మురుగడాస్‌ల చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఠాగూర్‌మధు-ఎన్వీప్ర సాద్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈచిత్రానికి మహేష్ తీసుకుంటున్న పారితోషికం అక్షరాలా 23కోట్లు అని సమాచారం. ఇక తమిళ, తెలుగులోనే కాదు.. తన సైటల్ ఆఫ్ టేకింగ్‌తో ఇండియాలోనే టాప్ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న మురుగదాస్ ఈ చిత్రానికి 20కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని ఫిల్మ్‌నగర్ టాక్. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ […]

రెమ్యూనరేషన్‌లో వెనకబడిపోయిన రజనీ

‘రోబో’ తర్వాత రజనీకాంత్, శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతూ మరో సంచలనానికి తెరతీస్తోన్న చిత్రం ‘రోబో2.0’. సాధారణంగా రజనీకాంత్ సినిమా అంటే కేవలం ఆయనకున్న ఇమేజ్, క్రేజ్‌తోనే ఆ చిత్రాల బిజినెస్, కలెక్షన్లు వస్తుంటాయి. అందుకే ఆ సినిమాలకు పనిచేసిన అందరి కంటే రజనీకే ఎక్కువ పారితోషికం ముడుతూ ఉంటుంది. ఇది ఏ స్టార్‌హీరో చిత్రానికైనా సహజం. కానీ ‘రోబో2.0’ చిత్రం విషయంలో రజనీ పరిస్థితి అలా లేదని సమాచారం. ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ […]