మహేష్-సూర్య మల్టీస్టారర్ పక్కా!!

‘బాహుబలి’ని తలదనే్న మల్టీస్టారర్ సినిమా తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాలీవుడ్ టాక్. ఇప్పటివరకు భారత సినిమా చరిత్రలో ‘బాహుబలి’ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా చాటిన సినిమా అది. పైగా జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు కూడా అందుకుంది. అయితే అదే స్థాయిలో భారీ బడ్జెట్‌తో వచ్చిన సినిమాలు మాత్రం డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ఇప్పుడు బాబహుబలిని మించిన సినిమా తెరకెక్కించే ప్రయత్నాల్లో వున్నాడు దర్శకుడు సుందర్.సి. ఈ చిత్రంలో సౌత్ […]

సెల్ఫ్ డిఫెన్స్ లో ఏపీ సీఎం

ముఖ్యమంత్రి చంద్రబాబునాయడును ఒక్కసారిగా సమస్యలు కమ్ముకుంటున్నాయి. ఎదురవుతున్న అన్నీ సమస్యలనూ తానే చూసుకోవాల్సి రావటంతో సిఎం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఒకవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కేంద్రంగా ఉభయగోదావరిలో ఉద్రిక్తత. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వరుసపెట్టి మాటల దాడులు. ప్రధాన ప్రతిపక్షానికి చెందిన పలువురు ఎంఎల్ఏలు ఆరోపణలు, విమర్శలు, ఇంకోవైపు హైదరాబాద్‌లోని సచివాలయం నుండి విజయవాడ ప్రాంతానికి తరలి రావటానికి ఇష్టపడని ఉద్యోగులు. ఇన్ని సమస్యల మద్య చంద్రబాబు ఉక్కిరి […]

చెప్పులు, చీపురు మైలేజ్ ఎంత!!

ఇటీవల రైతు భరోసాయాత్ర చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి తన మాటలవేడి పెంచి రాష్ట్ర రాజకీయాలలో పెద్ద దుమారం రేపారు. సిఎం చంద్రబాబునాయుడిపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయని సిఎంను చెప్పులతో, రాళ్లతో కొట్టండి అని విమర్శలు గుప్పించారు. దీనిపై టిడిపి నేతలు ప్రతిదాడికి చేయగా ఇంకా ఒక అడుగు ముందుకేసిన జగన్మోహన్‌రెడ్డి చెప్పులు, రాళ్లతో కొడితే బాగోదటా అందుకే మీరు చీపురు చూపండి అని మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. […]

మళ్లీ పూరి నితిన్ – ఈసారి హార్ట్ ఎటాక్ ఎవరికో!!

పూరీ, నితిన్‌ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కబోతోంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ,ఆ..’ సినిమాతో నితిన్‌ రేంజ్‌ మారిపోయింది. అనేక పరాజయాలను అనుభవించి, చాన్నాళ్ల తరువాత విజయం అందుకున్నాడు నితిన్‌. దీంతో నితిన్‌ కెరీర్‌లో మళ్ళీ జోరు పెరిగింది. ఆ జోష్‌లోనే కొత్త కొత్త కథలను వింటున్నాడు నితిన్‌. గతంలో పూరి జగన్నాథ్‌తో ‘హార్ట్‌ ఎటాక్‌’ చేసిన నితిన్‌, మళ్ళీ పూరితోనే ఇంకో సినిమా చేయాలని అప్పట్లోనే అనుకున్నాడు. నితిన్‌తో ఇంకో సినిమా చేస్తానని పూరి కూడా […]

ఈసారి చంద్రబాబు దెబ్బ అదుర్స్..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, హైదరాబాద్‌ నుంచి ఉద్యోగుల్ని తరలించే అంశంపై తలెత్తుతున్న వివాదాన్ని భలేగా డీల్‌ చేశారు. పెర్‌ఫెక్ట్‌ టైమింగ్‌లో ‘స్థానికత’ అంశాన్ని ప్రయోగించారు. ఎప్పటినుంచో కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న స్థానికత అంశంపై చంద్రబాబు క్లారిటీ తీసుకురాగలిగారు. జూన్‌ 2, 2017 నాటికి ఆంధ్రప్రదేశ్‌కి ఎవరైతే వెళతారో వారంతా అక్కడి స్థానికతను పొందుతారని చంద్రబాబు ఇదివరకే చెప్పారు. దానికి కేంద్రం ఆమోద ముద్ర వెయ్యవలసి ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రం ఇటీవల ఆ […]

సుకుమార్ నిత్యమీనన్ ఎం చేయబోతున్నారో తెలుసా..

క్యూట్‌ గ్లామర్‌తో యూత్‌ని ఎట్రక్ట్‌ చేసే టాలెంట్‌ నిత్యామీనన్‌ది. యూత్‌ ఎట్రాక్షనే కాదు.. ఏ తరహా నటనైనా అవలీలగా చేసేసే సత్తా ఈ ముద్దుగుమ్మది. హైట్‌లో షార్ట్‌ గానీ, నటనలో టాప్‌. నేచురల్‌ నటన, ఫ్రీ డైలాగ్‌ డెలీవరీ, ఆకట్టుకునే ఎక్స్‌ప్రెషన్స్‌ ఈ ముద్దుగుమ్మకే సొంతం. అంతేకాదు సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకోగలదు. అవకాశం ఇస్తే పాటలు కూడా పాడెయ్యగలదు. ఇన్ని స్పెషాలిటీస్‌ ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే చాలా ప్రయోగాత్మక చిత్రాలు చేసేసింది. తాజాగా, సుకుమార్‌ నిర్మాణంలో […]

కొత్త జిల్లాలు – ఇవి చాలా కాస్ట్లీ గురూ

కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంవల్ల ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2వేల కోట్ల వరకు భారం పడనున్నట్టు ప్రాథమిక అంచనాలో తేలినట్టు తెలిసింది.ఎందుకా అంత అనుకుంటున్నారా! ఏర్పాటు కాబోయే 14-15 కోత్హ జిల్లాలకు భవనాల నిర్మాణానికే జిల్లాకు రూ. 100 కోట్ల. ఈ లెక్క ప్రకారమే దాదాపురూ. 14 నుంచి 15 వందల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. దీనికి తోడు భవనాల నిర్మాణం కోసం ఖర్చు చేసే నిధులతోపాటు వాహనాలు, ఫర్నిచర్, సామగ్రి, భవనాల […]

మళ్లీ అందాల ఆరబోతకు రెడీ అవుతున్న “రష్మి”….

బాలీవుడ్‌లో ఆడల్ట్‌ సినిమాల కల్చర్‌ ఎక్కువగా వుంటుంది. ఈ మధ్య కామెడీ పేరుతో అలాంటి సినిమాలు ఎక్కువ అయిపోతున్నాయి. ఇలాంటి సినిమాల కోసమే పోర్న్‌ రంగం నుంచి ప్రత్యేకించి సన్నీలియోన్‌ని బాలీవుడ్‌కి దించారు. అయితే ఇప్పుడు సన్నీనే కాకుండా ఎందరో భామలు తమ అందచందాలతో ఈ అడల్ట్‌ మూవీస్‌లో తమ అందాల విందు చేస్తున్నారు. తక్కువ కాస్టింగ్‌తో, అతి తక్కువ ఖర్చుతో చాలా తక్కువ టైంలోనే ఈ సినిమాలు కంప్లీట్‌ అయిపోతాయి. దాంతో సినిమా హిట్‌, ఫ్లాప్‌తో […]

విషపు దీక్షలు-వింత చేష్టలు

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమంలో భాగంగా ఇప్పటికే ఓసారి తన ఇంట్లో నిరామార దీక్ష చేశారు ఈ మధ్యకాలంలో. అయితే ఆ దీక్ష ఫలించలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ దక్కకుండానే దీక్ష విరమించారు ముద్రగడ అప్పట్లో. మళ్ళీ ఇంకోసారి ప్రభుత్వ తీరుకు నిరసనగా ముద్రగడ పద్మనాభం, తన భార్యతో కలిసి నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే పోలీసులు ఆయన్ని వివిధ కేసుల్లో అరెస్టు చేసేందుకు ప్రయత్నించినా, అందుకాయన అనుమతించడంలేదు. ఇంట్లోకి వెళ్ళి గడియ […]