‘రేసు గుర్రం’ రిపీట్ చేస్తున్నారు

సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. హీరోహీరోయిన్లు-హీరోడైరక్టర్-డైరక్టర్ హీరోయిన్ ఈ కలయికలో చాలా సినిమాలు రిపీట్ అవుతుంటాయి. ప్రేక్షకులను కట్టిపడేస్తుంటాయి. తాజాగా ఇలాంటి క్రేజీ కాంబినేషన్ పునరావృతం కానుంది. ‘రేసు గుర్రం’లో ఆకట్టుకున్న అల్లు అర్జున్-శృతి హాసన్ లు మళ్లీ ఓ సినిమాలో నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ‘రేసు గుర్రం’లో శుతి హాసన్ అల్లు అర్జున్ తో జోడీ కట్టింది. ఇటు హరీశ్ శంకర్ కూ […]

తమ్ముడి సినిమాలో అన్నయ్య మెరుపులు!

ఓ హీరో మూవీలో మరో హీరో తుళుక్కున మెరిస్తే.. ప్రేక్షకుడికి ఆనందం రెట్టింపవుతుంది. ఇలా కనిపించే పాత్ర నిడివి తక్కువే అయినా.. అదో తుత్తి తరహాలో సంబరపడిపోతుంటాం. దర్శక-నిర్మాతలు కూడా ఉత్సాహంగా తమ సినిమాల్లో పలువురు హీరో-హీరోయిన్లను గెస్ట్ రోల్స్ లో మెరిపించారు. ఇలాంటి పాత్రలు చేయడానికి స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపి.. మరో హీరో మూవీలో సందడి చేశారు. త్వరలోనే ఇలాంటి సీన్ మరో సినిమాలో ఆవిష్కృతం కానుంది. అయితే.. హీరో.. గెస్ట్ గా […]

స్వీటీ కోసం దర్శకేంద్రుడు వెయిటింగ్!

హీరోయిన్స్ ను అందంగా-గ్లామరస్ గా చూపించడంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు స్టైలే వేరు. ఆయన డైరక్ట్ చేసిన నటీమణుల్లో అనేకమంది ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశారు. టాలీవుడ్-కోలీవుడ్-బాలీవుడ్ ల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే.. దర్శకేంద్రుడు డైరక్షన్ లో నటించేందుకు హీరోయిన్స్ ఉత్సాహం చూపుతుంటారు. ఆయన సినిమాలో అవకాశం వస్తే అదే పదివేలనుకునే వారికీ కొదువలేదు. ఇంతటి ఘనాపాటి ఓ అమ్మాయి కోసం పడిగాపులు పడ్డారంటే నమ్మగలరా? ఆ సుందరి ఎవరో కాదు. మన అందాల స్వీటి.. అనుష్క. […]

ఫర్ ఎ ఛేంజ్:రికార్డ్స్ ని భయపెడుతున్న NTR

నందమూరి తారక రామారావు పేరే ఒక సంచలనం ఆయన అంశము పుణికి పుచ్చుకుని మే 20 1983 పుట్టిన నందమూరి తారక రామరారావు(jr NTR ), రూపంలోనూ ,వాక్చాతుర్యం లోను ,నటనలోనూ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు .ఆయన ప్రస్థానం బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో ప్రారంభం అయి, స్టూడెంట్ నెం -1 తో తనలోని నటుడిని బయటపెట్టి ఆది సినిమాతో ఇండస్ట్రీ కి సరికొత్త సంచలాన్ని చూపిస్తూ సింహాద్రితో సరికొత్త రికార్డ్స్ సృష్టించి అలా మొదలైనా ఆయన […]

అంతకంతకు పెరుగుతున్న అంతరం

అధికారం పంచుకుంటున్న మిత్రపక్షాలు ధ్వంధ్వ విధానాలను అనుసరిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ అధికార తెలుగుదేశంపార్టీకి నిజమైన మిత్రపక్షమా? లేక అంశాలవారీగా మద్దతుఇస్తున్న విపక్షమా అన్న సందేహాలు కలిగిస్తోంది. పైకి అంశాలవారీగా కొన్నిసార్లు ప్రతిపక్షంగాను లోన మాత్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మిత్రపక్షంగాను భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. దాంతో అంశాలవారీగా సందర్భానికి తగ్గట్లుగా ఒక్కో విధంగా వ్యవహరిస్తున్న కమలనాధుల తీరుతో ఇటు పార్టీ శ్రేణుల్లోనే కాకుండా ప్రజల్లో కూడా అయోమయం నెలకొంటోంది. ఇందుకు […]

సమంతా 50 కోట్లు కొల్లగొట్టింది

సమంతా ఏంటి 50 కోట్లు కొల్లగొట్టడం ఏంటా అనుకుంటున్నారా?అదేనండి సమంతా లీడ్ రోల్ లో నితిన్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన “అఆ” చిత్రం 50 కోట్ల వసూళ్లు సాధించి ముందుకు దూసుకుపోతోంది.50 కోట్ల క్లబ్ లో చేరిన అతి కొద్దీ తెలుగు సినిమాల్లో అఆ కూడా నిలిచి ట్రేడ్ వర్గాల్ని సైతం ఆశ్చర్యపరిచింది. ఎటువంటి పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ లేకుండా హీరోయిన్ చుట్టూ తిరిగే కథతో నితిన్ లాంటి హీరో తో […]

హ్యాట్రిక్ డైరెక్టర్ గోపిచంద్ కి హిట్ ఇస్తాడా?

డిఫ‌రెంట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్స్‌ లో న‌టిస్తూ త‌న‌కంటూ మాస్ హీరోగా  ప్ర‌త్యేకత‌ను సంపాదించుకున్నాడు గోపీచంద్. `య‌జ్ఞం`, `ఆంధ్రుడు`, `ల‌క్ష్యం`, `శౌర్యం`, `శంఖం`, `గోలీమార్` జిల్ వంటి హిట్ చిత్రాలతో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ఇప్పుడు `ఆక్సిజ‌న్` అనే మరో డిఫ‌రెంట్ యాక్ష‌న్ చిత్రంలో నటిస్తున్న గోపీచంద్ హీరోగా హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్ టైనర్ రూపొందనుంది. `ఏమైంది ఈవేళ` అనే యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్‌తో స‌క్సెస్ కొట్టి త‌ర్వాత […]

అయితే…ఓకే:అయినా అనుమానమే!

లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని భారత ఎన్నికల కమిషనర్ నజీమ్ జైదీ స్పష్టం చేశారు. అయితే ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలు తీసుకురావాలని, అదే విధంగా రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయాన్ని పాదుకొల్పాలని స్పష్టం చేశారు. లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని న్యాయ మంత్రిత్వ శాఖకు తాము సిఫార్సు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే భారత్ వంటి దేశంలో ఈ స్థాయిలో ఎన్నికలు నిర్వహించాలంటే […]

పట్టిసీమ పరవళ్లు భళా

గోదావరి నది వరద నీరు కృష్ణా నదిలో పరవ ళ్లు తొక్కనుంది. లక్షా 50 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రస్తుతం గోదావరి నదికి వస్తుండటంతో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా పంపింగ్ ప్రారంభిం చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ ప్రకటన చేయడంతో కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీరు విడుదల కానుంది. .కృష్ణా పశ్చిమ డెల్టాకు నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ ఆధారంగా జూలై 16న సాగునీరు విడుదల చేయడం కొన్నేళ్ల నుంచి ఆనవాయితీగా […]