చిరంజీవి సినిమాకు టైటిల్ కోసం వెతుకులాట ఇంకా కొనసాగుతూనే ఉంది. టైటిల్ విషయంలో సినిమా యూనిట్ మాత్రమే కాకుండా అభిమానుల అభిప్రాయాలకి కూడా అవకాశమిచ్చింది చిత్ర యూనిట్. దాంతో అభిమానులు తమ అభిమాన హీరోని ఎలా చూసుకోవాలనుకుంటున్నారో అందరికీ తెలియజేయడానికి సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతోంది. అందుకే చిరంజీవి కొత్త సినిమా కోసం అభిమానులు ఓ టైటిల్ ఫిక్స్ చేసి, దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. అదే ‘నెపోలియన్’. సినిమా టైటిల్ అయితే అదిరిపోయింది. కానీ […]
Author: admin
రివ్యూ రాయుళ్ళపై రజిని డాటర్ లైవ్ యాక్షన్!
సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ ‘కబాలి’ సూపర్ బజ్ సృష్టించింది. అయితే.. అంచనాలు అందుకోలేకపోయింది. రికార్డ్ లెవల్ వసూళ్లైతే వచ్చాయి గానీ మూవీపై నెగిటివ్ టాక్ వెళ్లాల్సినంత దూరం వెళ్లిపోయింది. అయితే.. 10 రోజుల వరకూ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయ్ కాబట్టి కలెక్షన్స్ కి ఢోకా లేదని అంటున్నారు. కానీ.. రివ్యూల విషయంలో రజినీ కుమార్తె సౌందర్య రియాక్టవుతున్న తీరుకు చాలామంది విస్తుపోతున్నారు. థియేటర్ లో మొదటి ఆటపడుతున్నపుడే లైవ్ రివ్యూలు రాయడం ఇప్పుడు సాధారణం. అయితే.. […]
మెగా మంచు ఆత్మీయత అదుర్స్
తెలుగు చిత్రసీమలో చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారు. వారిలో ఒక స్నేహితుల జంట కాస్త విచిత్రంగా ఉంటుంది. అసంతృప్తులేవైనా ఉంటే బహిరంగంగానే ప్రదర్శిస్తుంటారు. అంతకు మించి ఆత్మీయంగా మసలుకుంటారు. ఈ చిత్రమైన జోడి మెగాస్టార్ చిరంజీవి – కలెక్షన్ కింగ్ మోహన్ బాబులది. వీరిద్దరి బంధాన్ని ‘టామ్ అండ్ జెర్రీ’లతో కొందరు సరదాగా పోల్చుతుంటారు కూడా. ఈ సంగతెలా ఉన్నా… వీరి పిల్లలు మాత్రం చిన్నప్పటినుండీ క్లోజ్‌గానే ఉంటున్నారు. వీకెండ్ పార్టీల్లోనూ ఫ్యామిలీ ఫంక్షన్స్ లోనూ […]
75 రోజులు 200 సెంటర్లు : ఇది వైలెంట్ హిట్
బిచ్చగాడు’కి డిమాండ్ బాగా ఉంది. 200 సెంటర్లలో 75 రోజులుగా ఈ ‘బిచ్చగాడు’కి కలెక్షన్ల గలగలలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈపాటికే మీకు అర్థమైపోయిందనుకుంటా? మనం మాట్లాడుకుంటుంది బిచ్చగాడు సినిమా గురించి అని.! సైలెంట్‌గా వచ్చి వైలెంట్ హిట్ కొట్టిన బిచ్చగాడు సినిమా, ఈ మధ్యకాలంలో ఏ స్టార్ హీరో సినిమాకి సాధ్యపడని విధంగా ఏకంగా 200 థియేటర్లలో 75 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకొని 100 రోజుల వైపు దూసుకెళుతుంది. బిచ్చగాడు రిలీజైనప్పటి నుంచి హిట్‌టాక్‌తో నడిచింది. […]
కమల్ ను ఏడ్పిస్తున్న కామెడీ మూవీ
లోకనాయకుడు కమల్ హాసన్, ఆయన కూతురు శృతి హాసన్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలుగా తెరకెక్కాల్సిన కామెడీ- అడ్వెంచరస్ చిత్రం ‘శభాష్ నాయుడు’. తెలుగు, తమిళం, హిందీ మూడు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి రచయితగా, నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా కమల్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. కమల్ తాను నటించిన దశావతారం చిత్రంలోని బలరాం నాయుడు పాత్రనే ఈ సినిమాలో పోషించనున్నారు. అయితే ఈ ‘శభాష్ నాయుడు’ చిత్రానికి అడుగడుగునా అడ్డంకులే ఏర్పడుతున్నాయి. నిజానికి […]
ఏపీ కాంగ్రెస్ కి అదే సంజీవిని!
ఏపిలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ప్రభావం చూపలేకపోతోందని కాంగ్రెస్ పార్టీ నేతలే ధృవీకరిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సర్వంకోల్పోయిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నా మైలేజీ పార్టీకి చేరడంలేదు . ఏపిలో కాంగ్రెస్ పార్టీ ఇంకా కొంత బతికివుందంటే అది పార్టీకి అంటిపెట్టుకొన్న కొంత మంది సీనియర్ నేతల వల్లేనని రాజకీయ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి. పార్టీలో సీనియర్ నేతలు, సమయానుసారం ప్రజా సమస్యలపై స్పందిస్తున్నా విభజిత ఆంధ్ర ప్రదేశ్ […]
టీడీపీ, టీఆర్‌ఎస్ ఆశలపై కేంద్రం నీళ్ళు
పార్టీ ఫిరాయింపులకు పాల్పడేందుకు తెలంగాణలో టిఆర్‌ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి వాడుకున్న అస్త్రం ‘అసెంబ్లీ సీట్ల పెంపు’. ఆకాశంలో మేడలు కట్టేయడంలో ఈ రెండు పార్టీలూ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. 2019 నాటికి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి కాబట్టి, ‘ఈలోగా మా పార్టీలోకి వచ్చెయ్యండి’ అని విపక్ష నేతలకు గాలం వేశాయి టిడిపి, టిఆర్‌ఎస్. ఈ మూడు నాలుగేళ్ళు అధికారంలో ఉంటాం, ఆ తర్వాత సీటు గ్యారంటీ అనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిథులు తెలంగాణ, […]
కడియం శ్రీహరికి చెక్ పెడ్తారా?
తెలంగాణలో ఎంసెట్ వివాదాస్పదమయ్యింది. నీట్ పరీక్ష కారణంగా ఎంసెట్-1, ఎంసెట్-2 రాయాల్సి వచ్చింది మెడిసిన్ అభ్యర్థులు. అయితే ఎంసెట్-2 లీక్ అయ్యిందని సిఐడి విచారణలో తేలింది. దాంతో ఎంసెట్-2 ఇంకోసారి నిర్వహించాల్సి వచ్చేలా ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఇంకోసారి ఎంసెట్ నిర్వహించడం వల్ల తమకు తీవ్రంగా నష్టం జరుగుతుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 69 మంది విద్యార్థులు అక్రమంగా ఎంసెట్-2లో ర్యాంకులు పొందారు. పేపర్ లీకేజీ వెనుక పెద్ద కుట్రే దాగుందని సిఐడి తేల్చింది 50 […]
ఒంటరిగా ఏడ్చిన అనుష్క !
అందాల అనుష్కకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. స్టార్ నాయకిగా ఎదిగిన ఆమె ఈ స్థాయికి రావడానికి ఎంతే కష్టపడిందట. తాను పడ్డ శ్రమ, కృషిల గురించి స్వీటీ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కెరీర్ ఆరంభంలో అంతా గందరగోళంగా అనిపించి .. ఇంటికి వెళ్లి చదువుకోవాలని అనిపించేదని చెప్పింది. వరుస షూటింగులతో అలసిపోయి .. గదిలో ఒంటరిగా కూర్చుని ఏడ్చిన సందర్భాలు వున్నాయని చెప్పింది. సెట్లో మాత్రం ఆ బాధను దాచేసి కనింపేదాన్నని తెలిపింది. హీరోల […]