దక్షిణాది రాష్ట్రాల్లో ఆధిపత్యం కోసం పరితపిస్తున్న బీజేపీకి తమిళనాడు ద్వారా ఆ అవకాశం దక్కిందా? ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న సంక్షోభంలో జోక్యం చేసుకోబోమని కేంద్రం పైకి చెబుతున్నా.. రిమోట్ కంట్రోల్ మాత్రం తన దగ్గరే ఉంచుకోబోతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా గవర్నర్ విద్యాసాగర రావు ద్వారా పావులు నడిపిస్తోంది కేంద్ర నాయకత్వం! అమ్మకు నమ్మిన బంటు అయిన పన్నీర్ సెల్వానికి మద్దతు ఇచ్చి తెర వెనుక చక్రం తిప్పేందుకు సిద్ధమవుతోంది. మరి హస్తిన ఆధిపత్యాన్నితమిళులు […]
Author: admin
వైసీపీ నేతకు మంత్రి తనయుడి బెదిరింపు .. వివాదాల్లో మంత్రి
ఏపీ మంత్రుల తనయుల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కారులో వెళుతూ ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించి ఒక మంత్రి తనయుడు వార్తల్లోకెక్కారు! ఇద్దరు ముగ్గురు మంత్రుల తనయులు ఒక గ్రూపుగా ఏర్పడి సెటిల్‌మెంట్లకు పాల్పడుతూ మరో సీనియర్ మంత్రికే షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మంత్రి బొజ్జల తనయుడు కూడా చేరిపోయారు. వైసీపీ నేతను చంపేస్తానని బెదిరించిన సంఘటన ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. అలాగే మంత్రి భార్య కూడా అధికారులపై బెదిరింపులకు పాల్పడారు. దీంతో మంత్రి […]
కడప తమ్ముళ్లకు సీరియస్ వార్నింగ్ అందుకేనా
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కంచుకోటను బద్దలు కొట్టాలని ఏపీసీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తుంటే వాటికి కార్యకర్తలు తూట్లు పొడుస్తున్నారు! ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది పోయి.. నిర్లక్ష్యం వహిస్తున్నారు. చంద్రబాబు ముందు ఒకలా.. ఆయన వెనుక మరోలా వ్యవహరిస్తూ దాగుడు మూతలు ఆడుతున్నారు. ఎంత చెప్పినా కడప నాయకుల తీరు మారకపోవడంతో.. చంద్రబాబు ఇక వారికి ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. నిర్లక్ష్యం వీడకపోతే.. ఇక ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. కడప జిల్లాపై సీఎం […]
ఈవారం టాలీవుడ్ ట్రేడ్ ట్రాక్…రిజల్ట్ ఇదే
టాలీవుడ్‌లో ఈ వారం సినిమాల ట్రేడ్ టాక్‌లో నేను లోకల్ ఫస్ట్ ప్లేసులో ఉంది. ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. కేవలం 5 రోజుల్లోనే రూ.20 కోట్ల షేర్ మార్క్ రాబట్టింది. ఫస్ట్ వీక్ ముగిసే సరికే నేను లోకల్ బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల భాట పట్టేసింది. ఈ సినిమా విజయంతో నాని వరుసగా ఆరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుని డబుల్ హ్యాట్రిక్ హిట్ కొట్టిన హీరోగా అరుదైన రికార్డు సృష్టించాడు. […]
ఓం నమో వెంకటేశాయ TJ రివ్యూ
సినిమా : ఓం నమో వేంకటేశాయ రేటింగ్ : 2.75/5 పంచ్ లైన్ : భక్తి ..విరక్తి కాంబో ప్యాక్ నటీనటులు : అక్కినేని నాగార్జున, సౌరబ్‌జైన్, అనుష్క, జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్, విమలా రామన్, రావు రమేష్, వెన్నెల కిషోర్, ప్రభాకర్, రఘుబాబు.. సంగీతం: ఎం.ఎం. కీరవాణి ఛాయాగ్రహణం: ఎస్.గోపాల్‌రెడ్డి కథ, మాటలు: జె.కె.భారవి నిర్మాత: మహేశ్‌రెడ్డి దర్శకత్వం: రాఘవేంద్రరావు భక్తి,రక్తి,ముక్తి మూడింటిని అటు విడి విడిగాను ఇటు కలబోత గానూ ఇప్పటికే దాదాపు టచ్ […]
అన్నాడీఎంకే ఎమ్మెల్యేల కుటుంబాలలో టెన్షన్ టెన్షన్
తమిళనాడులో రాజకీయ పరిస్థితులు ఏమవుతాయోనని, ఏక్షణంలో ఎలా మారతాయోనని అన్ని రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. గవర్నర్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియక నరాలు తెగే ఉత్కంఠ మధ్య టీవీలకు అతుక్కుపోతున్నారు! కానీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. రాజభోగాలు అనుభవిస్తూ.. కులాసాగా గడిపేస్తున్నారు. అయితే తమ వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలియక ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తన భార్య, అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని ఆమె […]
తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్లని … ఎవరిని తొలగించాలి?
రాష్ట్ర విభజన ద్వారా ఏపీలో ఓడిపోయినా.. తెలంగాణలో అధికారంలోకి వస్తాని భావించిన కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాతి పరిణామాలతో ఖంగుతిన్నది. టీఆర్ ఎస్ అధికారంలోకి రావడం, ఆశించిన స్థాయిలో సీట్లను కైవసం చేసుకోకపోవడమే కాకుండా కాంగ్రెస్ నేతలు జంపింగ్‌లుగా మారరు. ఈ నేపథ్యంలో ఉన్న నేతలు సక్రమంగా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారా? అంటే అది కూడా లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణపై దృష్టి పెట్టిన కాంగ్రెస్.. 2019 నాటికి పార్టీని ప్రక్షాళన చేయడం ద్వారా […]
సింగం-3 TJ రివ్యూ
సినిమా : S3-యముడు-౩ రేటింగ్ : 3 .25 /5 పంచ్ లైన్ : సిరీస్ మారినా స్పీడ్ తగ్గలేదు నటీనటులు : సూర్య, అనుష్క, శ్రుతిహసన్, రాధికా శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర ఛాయాగ్రహణం : ప్రియన్ సంగీతం : హారిస్ జయరాజ్ కూర్పు : విటి విజయన్, టి.ఎస్.జయ్ నిర్మాత : మల్కాపురం శివకుమార్ సంస్థ : స్డూడియో గ్రీన్, పెన్ మూవీస్. రచన.. దర్శకత్వం : హరి ఇదిగో వస్తోంది..అదిగో వస్తోంది..అంతలోనే తూచ్ ఇప్పుడే […]
మైహోం చేతికి భద్రాద్రి పాలనా పగ్గాలు
తెలంగాణలో తిరుమలలా ప్రసిద్ధి చెందిన భద్రాద్రి జిల్లా సీతారామచంద్రమూర్తి ఆలయం(భద్రాద్రి ఆలయం) పాలనా పగ్గాలు త్వరలోనే మై హోం వ్యవస్థాపకుడు జూపల్లి రామేశ్వరరావుకు అందనున్నాయట! ఆయనను చిన జీయర్ స్వామి సిఫార్సు చేశారని, దీనికి సీఎం కేసీఆర్ లాంఛనంగా ఆమోదించారని, త్వరలోనే ఉత్తర్వులు వెలువడ నున్నాయని అంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా రంగు పులుము కుంటుండడం గమనార్హం. ఎంతో మందిని కాదని రామేశ్వరరావుకు ఈ పోస్టు అప్పగించడంపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జూపల్లి […]