కాటమరాయుడు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంత ఫలితం రాకపోయినా పవన్ అవేమి పట్టించుకోకుండా తన నెక్స్ట్ సినిమా చిరకాల మిత్రుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో బారి బడ్జెట్ సినిమాకి తెర తీశారు, సుమారు 100 కోట్ల బడ్జెట్ అని మాట వినిపిస్తుంది. ఆల్రెడీ ఈ సినిమా తాలూకు పూజ కార్యక్రమాలు అయిపోయాయి, ఇప్పటికి ఈ సినిమాకి సంబందించిన కొంతభాగం రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేశారని సమాచారం. ఈ సినిమాకోసం పవన్ ౩౦ కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నాడట […]
Author: admin
చింతమనేని అలక వెనుక..అదే రహస్యం
దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మంత్రి పదవి రాకపోవడం తో అలక పాన్పు పై నుండి దిగక పోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.తనకు పదవి రాకపోవడం కంటే తన చిరకాల ప్రత్యర్థి,తన రాజకీయ ఎదుగుదలకు అడుగడునా అడ్డు తగిలిన పైడికొండల మాణిక్యాల రావు ని కాబినెట్ బెర్త్ లో కూర్చోబెట్టడం తో చింతమనేని ఆగ్రహం కట్టలు తెచ్చుకుందట.ఏంటి ఇదంతా నిజమే..ఇసుక మాఫియాలో..వనజాక్షి విషయం లో బాబు గోరు నీకంత చేస్తే ఇదేనా […]
రామోజీతో కేసీఆర్ రాజీ… ఫిల్మ్‌సిటీ అక్కౌంట్‌లోకి వందల ఎకరాలు
తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా తీసుకున్న నిర్ణయం ఒకటి అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది!! తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ నోటితో అయితే రామోజీని తిట్టిపోసి.. ఆయన కట్టుకున్న స్వతంత్ర రాజ్యం ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానన్న కేసీఆర్ ఇప్పుడు అదే రామోజీకి దాసోహం అయిపోయారా? అని తెలంగాణ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీకి రంగారెడ్డి జిల్లాలోని అనాజ్‌పూర్ సహా చుట్టుపక్కల సుమారు 375 ఎకరాల స్థలాన్ని కారు చౌకగా కట్టబెడుతున్నారు. ఇప్పుడు […]
జనసేన సిద్ధాంతకర్తగా టీడీపీ ఎమ్మెల్సీ
మంత్రి పదవి ఆశించి భంగపడిన వారిలో టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా ఒకరు. టీడీపీ స్థాపించిన నాటి నుంచి పార్టీ కోసం ఎంతో శ్రమించిన ఆయనకు ఈసారి తీవ్ర నిరాశే ఎదురైంది. దీంతో ఇక ఆయన పార్టీ మారతారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేగాక ఆయనో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అసంతృప్తిలో రగిలిపోతున్న ఆయన.. ఇప్పుడు జనసేనలో చేరాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అంతేగాక ఈ విషయంపై అధినేత పవన్ కల్యాణ్‌తోనూ మంతనాలు […]
లోకేశ్‌పై ఊస్టింగ్ మినిస్టర్ సెటైర్లు
టీడీపీలో మంత్రివర్గ ప్రక్షాళన ఏ రేంజ్‌లో సెగలు రేపుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చంద్రబాబును టార్గెట్‌గా చేసుకుని సీనియర్లు ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. ఇక ఉద్వాసనకు గురైన మంత్రులు సైతం రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని అనారోగ్యం పేరుతో మంత్రివర్గం నుంచి తొలగించినా ఆయన మాత్రం ‘పంచ్ లు’ వేస్తున్నారు. బొజ్జలకు చంద్రబాబు ఎంత నచ్చచెప్పినా ఆయన, ఆయన తనయుడు సుధీర్‌రెడ్డి మాత్రం అసంతృప్తిని బాహటంగానే వ్యక్తం చేస్తున్నారు. బొజ్జల […]
టీడీపీలో పురందేశ్వరి లేఖ కలకలం
ఏపీలో కేబినెట్ ప్రక్షాళన ఎంత రచ్చ రచ్చగా మారింతో మీడియాలో వస్తోన్న వార్తలే చెపుతున్నాయి. నలుగురు ఫిరాయింపుదారులకు చంద్రబాబు తన కేబినెట్‌లో చోటు కల్పించారు. గతంలో తెలంగాణలో టీడీపీ తరపున గెలిచిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు కేసీఆర్ తన కేబినెట్‌లో చోటు కల్పించడంతో టీడీపీ అండ్ కోతో పాటు చంద్రబాబు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇదే అంశాన్ని వారు సుప్రీంకోర్టుతో పాటు రాష్ట్రపతి వరకు తీసుకెళ్లారు. ఇక నాడు కేసీఆర్ చేసింది తప్పు అని జాతీయస్థాయిలో […]
అమాంతం పడిపోయిన టీడీపీ నేత గ్రాఫ్
పార్టీలో ర్యాకింగ్స్ ఎప్పుడూ కీలకమే! ఎవరెవరు ఏఏ స్థానాల్లో ఉన్నారో దానిని బట్టే పదవులు దక్కే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఒకప్పుడు అధ్యక్షుడి తర్వాత నిలిచిన వారే.. తర్వాత ఎక్కడా కనిపించకుండా మాయమైపోతారు. ప్రస్తుతం టీడీపీ నేత పయ్యావుల కేశవ్ పరిస్థితి కూడా ఇలానే మారింది. గతంలో పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఆయన హవా ఇప్పుడు కనిపించడం లేదు. చివరకు మంత్రి వర్గ విస్తరణలోనూ ఆయనన్ను పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. దీనికి కారణాలు కూడా లేకపోలేదనేది […]
బుజ్జగింపుల్లో బాబు మార్క్ వ్యూహం
టీడీపీ అంటే కమ్మ సామాజికవర్గ నేతల హవా ఎక్కువగా ఉంటుందనేది తెలిసిందే! కానీ ఇప్పుడు ఇతర సామాజికవర్గ నేతలు ముఖ్యంగా రెడ్డు, కాపు నాయకుల హవా పెరుగుతోంది. మంత్రి వర్గ విస్తరణ ద్వారా ఇది మరింత తేటతెల్లమైంది. ముఖ్యంగా అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు రెడ్డి, కాపు సామాజికవర్గ నేతలను రంగంలోకి దించారు సీఎం చంద్రబాబు. ఇది కూడా బాబు మార్కు రాజకీయ వ్యూహంగానే కనిపిస్తోందనేది విశ్లేషకుల అభిప్రాయం. మంత్రి వర్గ విస్తరణతో టీడీపీలోని కమ్మ సామాజికవర్గ నేతలు […]