” రారండోయ్ వేడుక చూద్దాం ” 2 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌

అక్కినేని నాగ‌చైత‌న్య – టాలీవుడ్ గోల్డెన్‌గ‌ర్ల్ ర‌కుల్‌ప్రీత్‌సింగ్ జంట‌గా న‌టించిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి ప్రారంభ వ‌సూళ్లు సాధిస్తోంది. సోగ్గాడే చిన్ని నాయ‌నా ఫేం కుర‌సాల క‌ళ్యాణ్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు ముందు నుంచి పాజిటివ్ బ‌జ్ ఉండడం, స‌మ్మ‌ర్ సెల‌వులు కావ‌డంతో బాగా క‌లిసొచ్చింది. దీంతో ఈ సినిమాకు ఏపీ, తెలంగాణ‌లో తొలి రెండు రోజుల‌కు క‌లిపి రూ 5.9 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ వ‌సూళ్లు నాగ‌చైత‌న్య […]

త‌న స‌ర్వేతో.. హ‌రీశ్‌ని వెన‌క్కి నెట్టిన కేసీఆర్‌

తెలంగాణ అధికార పార్టీలో ఒకే కుటుంబం నుంచి మంత్రులుగా ఉన్న వారు కేటీఆర్‌, హ‌రీశ్‌రావు. ఇద్ద‌రూ కూడా టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌కి ఒక‌రు కొడుకు, మ‌రొక‌రు మేన‌ల్లుడు! అయితే, ఇట‌వ‌ల కాలంలో హ‌రీశ్ రావు హ‌వా పెరుగుతోంద‌ని కొన్ని ప్రైవేటు స‌ర్వేలు చాటాయి. దీనికి మిష‌న్ భ‌గీర‌థ‌, కాక‌తీయ మిష‌న్ వంటి కార్య‌క్ర‌మాలు భారీగా తోడ్ప‌డ్డాయ‌ని కూడా క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇక‌, అదేస‌మ‌యంలో.. కేసీఆర్ కుమారుడు, ఐటీ మంత్రి కేటీఆర్ ఒకింత వెనుక‌బ‌డ్డార‌నే వార్త‌లు వ‌చ్చాయి. […]

కేంద్ర మంత్రి అశోక్‌కి టీడీపీ చెక్‌?!

అశోక గ‌జ‌ప‌తి రాజు. ఈ పేరుకు ప‌రిచ‌యం అక్క‌ర్లేదు! ముఖ్యంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పూస‌పాటి వంశానికి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. ఇక‌, ప్ర‌స్తుతం ఇక్క‌డి నుంచి టీడీపీలో చ‌క్రం తిప్పుతున్న అశోక్ గ‌జ‌ప‌తిరాజు.. జిల్లా రాజ‌కీయాల్లో అంతా త‌న మాటే వినాల‌నే ధోర‌ణిని కొన‌సాగిస్తున్నారు. అయితే, దీనిపై టీడీపీ అధినాయ‌క‌త్వం ఒకింత ఆగ్ర‌హంగా ఉన్న‌ట్టు స‌మాచారం. దీంతో అశోక్ గ‌జ‌ప‌తి హ‌వాను తగ్గించాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు […]

ప్ర‌కాశంలో టీడీపీకి ఎర్త్ పెట్టేందుకు వైసీపీ వేసిన ఎత్తుగ‌డ‌కు కరణం బ్రేక్!

పాలిటిక్స్‌లో ఒక‌రు ఏడుస్తుంటే.. మ‌రొక‌రు ఆనందిస్తుంటారు! బ‌హుశ అందుకేనేమో.. ఈ ఏడుపులే మాకు దీవెన‌లు అనే నానుడి కూడా వ‌చ్చింది! ఇప్పుడిదంతా ఎందుకంటే..ఇటీవ‌ల కాలంలో ఏపీ అధికార పార్టీ టీడీపీలో త‌మ్ముళ్లు కొట్టుకోవ‌డం, రోడ్డెక్క‌డం ష‌రా మామూలే అయింది. దీనికి మొన్నామ‌ధ్య ప్ర‌కాశం మ‌రింతగా పాపుల‌ర్ అయిపోయింది. ఇక్క‌డి పాలిటిక్స్‌లో ద‌శాబ్దాల త‌ర‌బ‌డి చ‌క్రం తిప్పుతున్న టీడీపీ నేత క‌ర‌ణం బ‌ల‌రాంకి.. మొన్నామ‌ధ్య వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన గొట్టిపాటి ర‌వికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా […]

టీ కాంగ్రెస్‌లో ఆ ఇద్ద‌రే మొన‌గాళ్ల‌న్న కేసీఆర్ స‌ర్వే

తెలంగాణ సీఎం కేసీఆర్‌ తమ పార్టీ ఎమ్మెల్యేలకు తీపి కబురు చెప్పారు. కేసీఆర్ ప్ర‌తి మూడు నెల‌ల‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల‌పై స‌ర్వేలు చేయిస్తున్నారు. తాజా స‌ర్వేలో ఏం బాంబు పేల్చుతారో అని గుండెలు ప‌ట్టుకుని చూసిన టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఈ స‌ర్వే ఫ‌లితాలు పెద్ద ఉప‌శ‌మ‌నం క‌లిగించాయి. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్ష సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి కేసీఆర్ ఈ స‌ర్వే ఫ‌లితాలు వెల్ల‌డించారు. ఈ […]

బాలయ్య చూపు ఆ జిల్లా పైనా!

దివంగత ఎన్టీరామారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్ టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోట‌. టీడీపీ పుట్టిన‌ప్ప‌టి నుంచి ఇక్క‌డ ఆ పార్టీ ఓడిపోలేదు. 2014 ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్టీఆర్ వార‌సుడు బాల‌య్య ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. బాల‌య్య ఇక్క‌డ ఎమ్మెల్యేగా గెలిచినా గ‌తంలో త‌న తండ్రికి వ‌చ్చిన మెజార్టీ మాత్రం బాల‌య్య‌కు రాలేదు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన తొలి రెండేళ్ల‌లో బాల‌య్య బాగానే అభివృద్ధి ప‌నులు చేప‌ట్టారు. […]

స‌చిన్: ఎ బిలియ‌న్ డ్రీమ్స్ ఫ‌స్ట్ డే షాకింగ్ క‌లెక్ష‌న్స్

భార‌త లెజెండ‌రీ క్రికెట‌ర్ స‌చిన్ టెండుల్క‌ర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన స‌చిన్‌: ఎ బ‌లియ‌న్ డ్రీమ్స్ సినిమా ఎలాంటి ప‌బ్లిసిటీ లేకుండా భారీగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఈ సినిమాకు తొలి రోజు నుంచే అనూహ్య‌మైన రెస్పాన్స్ వచ్చింది. హిందీ – మరాఠి – తమిళ్- తెలుగు – ఇంగ్లీష్ భాషల్లో రియాక్ష‌న్ అయిన ఈ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ వ‌ద్ద రూ 8.40 కోట్లు కొల్ల‌గొట్టింది. రెగ్యుల‌ర్ సినిమాలా కాకుండా ఓ డాక్యుమెంటరీ తరహాలో […]

ఏపీలో ఎమ్మెల్యే సీట్ల పెంపుపై వైసీపీ యాంటీ ప్ర‌చారం

రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం.. ఏపీ, తెలంగాణ‌లో అసెంబ్లీ స్థానాల‌ను పెంచాల్సి ఉంటుంది. అంటే ప్ర‌స్తుతం ఉన్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌నే పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించి సంఖ్య‌ను పెంచ‌డం ద్వారా స‌భ‌ల‌ను బ‌లోపేతం చేయాలి. దీనిపై ఇటు ఏపీ సీఎం చంద్ర‌బాబు, అటు తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రీ ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాల్లో బ‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న బీజేపీ కూడా తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. అయితే, ఇక్క‌డ ఓ ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంటోంది. ఏపీలో ఏకైక బ‌ల‌మైన విప‌క్షంగా ఉన్న […]

కేసీఆర్‌కు యాంటీగా యూపీ సీఎం యోగి

తెలంగాణలో రాజ‌కీయం మ‌రింత వేడెక్కుతోంది! నాలుగు రోజుల కింద‌ట బీజేపీ ర‌థ‌సార‌థి అమిత్ షా.. తెలంగాణ‌లో మూడు రోజుల ప‌ర్య‌ట‌న చేయ‌డం, భారీ బ‌హిరంగ స‌భ పెట్ట‌డం, కేసీఆర్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించ‌డం, కేంద్రం ల‌క్ష కోట్ల‌కు పైగానే తెలంగాణ‌కు సాయం చేసింద‌ని చెప్ప‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార‌మే ధ్యేయంగా బీజేపీ నేత‌లు ముందుకు సాగుతుండ‌డం వంటి విష‌యాల నేప‌థ్యంలో ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. అంతేనా? తెలంగాణ సీఎం, తెలంగాణ […]