ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ.. పరిస్థితి మరో తెలుగు రాష్ట్రం తెలంగాణంలో మాత్రం అగమ్యగోచరంగా మారింది! జాతీయ పార్టీగా అవతరించి.. నేషనల్ లెవల్ లో చక్రం తిప్పాలని చంద్రబాబు భావించారు. అయితే, అనూహ్యంగా పరిస్థితి యూటర్న్ తీసుకుంది. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ పక్కరాష్ట్రం అందునా హైదరాబాద్‌ను నేనే డెవలప్ చేశానని పదేపదే చెప్పుకొనే బాబుకి ఇప్పుడు ఆ రాష్ట్రంలో పార్టీని నిలుపుకొనే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. విషయం లోకి వెళ్తే.. తెలంగాణలో టీడీపీ […]
Author: admin
మంత్రుల మధ్య వార్.. మరింత పెరుగుతోంది!
టీడీపీ మంత్రులు అయ్యన్న, గంటాల మధ్య తలెత్తిన వివాదం మరింతగా రాజుకుంది. విశాఖలో భూ కుంభకోణాలపై తలెత్తిన వివాదం చిలికి చిలికి పెద్దాయన దాకా చేరడం, దీనిపై సిట్ వేయడం, అదీకాక, పార్టీ పరంగా ఇద్దరు మినిస్టర్ల మధ్య ఎందుకు వివాదం రేగిందో పరిశీలించేందుకు త్రిసభ్య కమిటీని కూడా నియమించడం యుద్ధ ప్రాతిపదికన జరిగిపోయింది. దీనికి ముందు పరిణామాలు చూస్తే.. అయ్యన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ విశాఖ భూములపై ఏకేశారు. నేరుగా మంత్రి గంటా పేరు […]
జనసేన సీటు రేటు కోట్లు పలుకుతోందా…
ప్రశ్నిద్దాం అంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పార్టీ పెట్టారు. గత ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ+బీజేపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. ఆ తర్వాత ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు వివిధ అంశాల్లో ఆ రెండు పార్టీలతో క్రమక్రమంగా విబేధిస్తూ వచ్చిన పవన్ వచ్చే ఎన్నికల్లో ఒంటరిపోరుకు రెడీ అవుతున్నారు. జనసేన వచ్చే ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో పోటీ చేసి తీరుతుందని, తాను ఏపీలోని అనంతపురం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పవన్ స్వయంగా ప్రకటించి […]
వైసీపీ నిన్న హ్యాపీ… నేడు డీలా
కర్నూలు జిల్లా వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. నిన్న మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి పార్టీలో చేరడంతో ఫుల్ ఖుషీగా ఉన్న జగన్ పార్టీకి ఆ మరుసటి రోజే ఎవ్వరూ ఊహించని షాక్ తగిలింది. భూమా ఫ్యామిలీకి చెందిన మంత్రి అఖిలప్రియ ప్రాథినిత్యం వహిస్తోన్న ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బోరెడ్డి లక్ష్మీరెడ్డి తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేసిన లక్ష్మీరెడ్డి పార్టీ అధిష్టానంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీలో డబ్బున్న […]
అమిత్‌షాపై టి-బీజేపీ నేతల గుస్సా!
తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం ఫోకస్ పెట్టింది. అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. తెలంగాణలో పర్యటించి శ్రేణులకు దిశానిర్దేశం కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలోని సీనియర్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. ఆయన వ్యూహాలతో తమకు వచ్చే ఎన్నికల్లో సీటు దక్కుతుందో దక్కదోనని టెన్షన్ పడుతున్నారట. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ప్రాధాన్యమిచ్చేలా అమిత్ షా నిర్ణయాలు తీసుకుంటుండటంతో.. దిక్కుతోచని […]
టీటీడీ చైర్మన్‌గా సీతయ్య..! బాలయ్య ఒప్పుకుంటేనే!!
ప్రస్తుతం టీడీపీ నేతల్లో విస్తృతంగా చర్చకు దారితీస్తున్న పదవి… టీటీడీ చైర్మన్. దీనికి విపరీతమైన పోటీ ఉంది. ఈ విషయంలోనే రాజమండ్రి, నరసరావు పేట ఎంపీల మధ్య పెద్ద అంతర్గత యుద్ధమే జరిగింది. దీనికి చంద్రబాబు తన స్టైల్లో ఫుల్ స్టాప్ పెట్టడంతో.. పేట ఎంపీ రాయపాటి సాంబశివరావు బాబుపై అలిగాడు కూడా. అలాంటి కీలకమైన పోస్టును చంద్రబాబు ఇప్పుడు తన బావగారైన సీతయ్య.. నందమూరి హరికృష్ణకు అప్పగించాలని భావిస్తున్నారట!! ప్రస్తుతం ఈ వార్త హల్ చల్ […]
పార్టీకి గుడ్ బై యోచనలో ఏపీ టీడీపీ ఎమ్మెల్యే..?
గుంటూరులో టీడీపీకి త్వరలోనే షాక్ తగలబోతోందా? కొంత కాలం నుంచీ ప్రభుత్వ పనితీరు, అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే.. పార్టీకి `ఇక సెలవు` అంటూ తన దారి తాను చూసుకోవాలని నిర్ణయించుకున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. గుంటూరు-2 ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వ్యవహార శైలి పార్టీ నేతలకు అంతుచిక్కడం లేదు. మంత్రులే టార్గెట్గా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. స్వపక్షంలో ఉంటూనే విపక్షంలా ఉండటం మింగుడు పడని అంశం! తనపై […]
ఆ మంత్రి ఆరగింపు సేవ.. ఖర్చు.. అక్షరాలా నాలుగు లక్షలు!
తనది కాకపోతే.. కాశీదాకా ఎదురు డేకచ్చని సామెత! ఇప్పుడు కర్ణాటక మంత్రి వర్యుడు ఒకాయన వ్యవహారం కూడా అచ్చు ఇలానే ఉందట. ఆయన గారి పదిరోజుల భోజనం ఖర్చు 4 లక్షల రూపాయలట! సాధారణంగా ఎంత పెద్ద హోటల్‌లో భోజనం చేసినా పూటకి 4 వేలకు మించి బిల్లు కాదు. ఇక, సాధారణ బోజనం అయితే, రూ.200 బిల్లు దాటనే దాటుదు. అయినప్పటికీ.. కర్ణాటకలోని ఓ మంత్రి మాత్రం వస్తోంది కదా ఊరికినే అని పది రోజుల్లో […]
విశాఖ కుంభకోణాన్ని పక్కదోవ పట్టించేశారా?
విశాఖ భూ కబ్జా వ్యవహారం అటు తిరిగి.. ఇటు తిరిగి ఆ జిల్లాకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడి మధ్య వివాదంగా మారింది. ఒకరిపై ఒకరు బాహాటంగానే విమర్శలు చేసుకునే స్థాయికి చేరింది. ఈ పంచాయితీ సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. భూకుంభకోణం గురించి ప్రజలు ఆలోచించకుండా.. దానిని నీరుగారే ప్రయత్నం జరుగుతోందనే చర్చ మొదలైంది. సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్న సమయంలో.. అయ్యన్నపై మంత్రి గంటా లేఖ […]