గత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ వచ్చింది జగన్‌కు..పులివెందులలో దాదాపు 90 వేల ఓట్ల మెజారిటీతో వచ్చింది. ఇక జగన్ తర్వాత అత్యధిక మెజారిటీ వచ్చింది అన్నా రాంబాబుకు…గిద్దలూరులో దాదాపు 81 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే ఇంత మెజారిటీతో గెలిచిన రాంబాబుకు చెక్ పెట్టడం అనేది చాలా కష్టమైన పని. 81 వేల మెజారిటీని తగ్గించి..తిరిగి గెలవాలని టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డికి చంద్రబాబు టార్గెట్ గా పెట్టారు. తాజాగా గిద్దలూరుకు సంబంధించి అశోక్ […]
Author: Krishna
గుడివాడలో టీడీపీకి దరిద్రం..బరిలో ఎంతమంది?
అందివచ్చిన అవకాశాలని చెడగొట్టుకోవడంలో టీడీపీ నేతలు ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. రాష్ట్రంలో వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది..అటు కొన్ని స్థానాల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తోంది. కానీ ఈ వ్యతిరేకతని ఉపయోగించుకుని బలపడటంలో టీడీపీ నేతలు విఫలమవుతున్నారు. పైగా సీటు కోసం కుమ్ముకుంటున్నారు. ఈ పరిస్తితి గుడివాడ నియోజకవర్గంలో క్లియర్ గా కనిపిస్తోంది. గత రెండు ఎన్నికల్లో కొడాలి నానికి చెక్ పెట్టలేకపోయింది..పైగా అధికారంలోకి వచ్చాక నాని..చంద్రబాబుని టార్గెట్ చేసి పచ్చి బూతులు తిడుతూ వస్తున్నారు. దీంతో కొడాలిపై […]
జగన్ మార్క్: ఎలక్షన్ టీంలో భారీ మార్పులు.!
రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళుతున్న జగన్..ఓ వైపు ప్రజా బలం ఏ మాత్రం తగ్గకుండా చూసుకోవాలని చెప్పి..ప్రజల్లోకి వెళుతూ, తమ ఎమ్మెల్యేలని ప్రజలని తిప్పుతున్న విషయం తెలిసిందే. 175కి 175 సీట్లు గెలవడమే టార్గెట్ గా పెట్టుకుని ముందుకెళుతున్నారు. ఇటు పార్టీ పరంగా కూడా బలంగా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదే క్రమంలో ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని జిల్లాల అధ్యక్షులని భారీ స్థాయిలో మార్చారు. ఇప్పటికే కొందరు జిల్లా అధ్యక్షుల తమ పదవుల నుంచి తప్పుకోగా, […]
తాడిపత్రి హీట్..టార్గెట్ అస్మిత్..!
తాడిపత్రి రాజకీయాలు ఎప్పుడు వాడి వేడిగానే నడుస్తాయి..గత ఎన్నికల దగ్గర నుంచి ఇక్కడ జేసీ వర్సెస్ పెద్దారెడ్డి అన్నట్లు వార్ నడుస్తోంది. అసలు ఇంతవరకు తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ ఓడిపోలేదు. కానీ 2019 ఎన్నికల్లో తొలిసారి ఓటమి పాలైంది. టీడీపీ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి పోటీ చేసి పెద్దారెడ్డిపై ఓడిపోయారు. ఓడిపోయాక తాడిపత్రి రాజకీయాలు మరింత మారాయి. మధ్యలో ప్రభాకర్, అస్మిత్‌లు కొన్ని కేసుల్లో జైలుకు వెళ్ళి రావడంతో, తాడిపత్రిలో రాజకీయం […]
లోకేష్ పాదయాత్ర..యంగ్ టీం రెడీ..!
తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు కష్టపడుతున్న విషయం తెలిసిందే..ఈ వయసులో కూడా విశ్రాంతి లేకుండా కష్టపడుతూ..తమ పార్టీ నేతలని యాక్టివ్ చేస్తున్నారు. ఓ వైపు నియోజకవర్గ ఇంచార్జ్‌లతో వన్ టూ వన్ సమావేశం నిర్వహిస్తూ, నియోజకవర్గాల్లో పరిస్తితులు తెలుసుకుంటూ, మరో వైపు జగన్ ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తిచూపుతూ, బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాల అంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఇప్పటికే రోడ్ షో లతో బాబు బిజీగా ఉన్నారు. ఇలా […]
నెల్లూరు టీడీపీలో భారీ మార్పులు..కొత్తవారికి సీట్లు.!
వైసీపీ కంచుకోట జిల్లాలో ఒకటిగా ఉన్న నెల్లూరులో టీడీపీ బలం చాలా తక్కువ. ఈ జిల్లాలో టీడీపీ మొదట నుంచి సత్తా చాటలేకపోతుంది. జిల్లాలో పది సీట్లు ఉంటే 2014 ఎన్నికల్లో 3, 2019 ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోలేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది..ఆ వ్యతిరేకతని మిగిలిన జిల్లాల్లోని టీడీపీ నేతలు యూజ్ చేసుకుని బలపడుతున్నారు గాని.. నెల్లూరు జిల్లా తమ్ముళ్ళు మాత్రం యూజ్ చేసుకోవడం లేదు. దీంతో చంద్రబాబు […]
కర్నూలు కోటలో హిట్..ఆ ముగ్గురికి సీట్లు ఫిక్స్!
దాదాపు మూడున్నర ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఆదరణ కనిపిస్తోంది. వైసీపీపై వ్యతిరేకత పెరగడం కావచ్చు..చంద్రబాబుపై సానుభూతి పెరగడం కావచ్చు. టీడీపీ వైపు ప్రజలు మొగ్గు చూపడం కావచ్చు..ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు పర్యటనలకు భారీ స్పందన వస్తుంది. 2019 ఎన్నికల ముందు జగన్ పాదయాత్ర సమయంలో సభలకు ఎలాంటి స్పందన వచ్చిందో..అదే తరహాలో జనంలోకి వెళుతున్న బాబుకు భారీ స్పందన కనిపిస్తోంది. మహానాడు, మినీ మహానాడు, బాదుడేబాదుడే కార్యక్రమాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున […]
2024లో తేల్చుకుందాం..ప్రకాష్‌కు సునీతమ్మ చెక్.!
మరోసారి రాప్తాడు రాజకీయం రాష్ట్ర స్థాయిలో హైలైట్ అవుతుంది..గత టీడీపీ హయాంలో అక్కడకు వచ్చిన జాకీ పరిశ్రమని..కమీషన్లు అడిగి వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, ఆయన అనుచరులు భయపెట్టి పక్క రాష్ట్రానికి వెళ్లిపోయేలా చేశారని చేసి మాజీ మంత్రి సునీతమ్మ, శ్రీరామ్‌లు ఆరోపించారు. భూములని కొల్లగొట్టడానికే సునీతమ్మ జాకీ సంస్థ పేరుతో డ్రామాలు ఆడారని ప్రకాష్ కౌంటర్ ఇచ్చారు. ఈ విమర్శలు తర్వాత ఈనాడు పత్రికలో జాకీ పరిశ్రమ తరలిపోవడంపై మొదట పేజీలో కథనం వచ్చింది. టీడీపీ […]
వైసీపీలో వసంత చిచ్చు..సీటుపై ఆశలు వదులుకున్న ఎమ్మెల్యే!
ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడం ముమ్మాటికి తప్పే అని, అలాగే కమ్మ వర్గంపై జగన్ ప్రభుత్వం కక్ష సాధించే దిశగా వెళుతుందని పరోక్షంగా వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో 35 శాతం కమ్మ వర్గం జగన్ గెలుపు కోసం పనిచేసిందని, అయినా జగన్ క్యాబినెట్‌లో కమ్మ మంత్రి లేరని, పక్క రాష్ట్రంలోనే కమ్మ వర్గానికి మంచి ప్రాధాన్యత ఉందని చెప్పుకొచ్చారు. […]