టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేతి నిండా అరడజన్‌కు పైగా సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో తాజాగా ఆయన ఎయిర్పోర్ట్‌లో చేతిలో ఒక పుస్తకంతో దర్శనమిచ్చి అఫీషియల్ గా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చేశాడు. అది త్రివిక్రమ్ డైరెక్షన్‌లో రూపొందనుంది. ఇంతకీ ఆ పుస్తకం ఏంటంటే.. మురుగన్ ది లార్డ్ ఆఫ్ వార్.. ది గాడ్ ఆఫ్ విస్డం. ఈ పుస్తకంతో తారక్ కనిపించడంతో అభిమానులకు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో రానున్న మురుగన్ సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్నాడని క్లారిటీ వచ్చేసింది. నిజానికి ఈ సినిమా మొదట బన్నీతో చేయాలని త్రివిక్రమ్ భావించాడు. కానీ.. కొన్ని కారణాలతో బన్నీ చేతి నుంచి ప్రాజెక్ట్ తప్పుకుంది.
ఈ ప్లేస్‌లో తారక్ రావడం విశేషం. ఇలాంటి క్రమంలో తాజాగా సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఎన్టీఆర్.. మురుగన్ లీడ్ రోల్‌లో కనిపించనుండగా.. ఈ సినిమాలో తారక్ హీరోయిన్గా త్రివిక్రమ్ టాలీవుడ్ క్రేజీ బ్యూటీని సెలెక్ట్ చేసుకున్నడంటూ టాక్ వైరల్‌గా మారుతుంది. ఆమె మరెవరో కాదు సమంత. ఈ అమ్మడి ఎంట్రీ కోసం.. టాలీవుడ్ ఆడియన్స్ అంతా కళ్ళు కాయలుకాచేలా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. సమంత టాలీవుడ్‌లో కనిపించి.. దాదాపు మూడు ఏళ్లు అయిపోయింది. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తారక మురుగన్ సినిమాలో సమంత నటించనుందని తెలియడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. త్రివిక్రమ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
అసలు మ్యాటర్ ఏంటంటే గతంలో ఆలియా భట్ నటించిన జిగ్ర సినిమా టాలీవుడ్ ప్రమోషన్స్‌లో త్రివిక్రమ్, సమంత సందడి చేశారు. ఈ ఈవెంట్‌లో స్టేజ్ పై త్రివిక్రమ్ మాట్లాడుతూ మీరు తెలుగు సినిమాల్లో కనిపించాలని తెగ ఆరాటపడుతున్నారని అడగ్గా.. సమంత కథలు రాసి. అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేస్తానని క్లారిటీ ఇచ్చేసింది. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ డైరెక్షన్లో సమంత హీరోయిన్గా ఒక సినిమా వస్తే బాగుంటుంది అని ఎప్పటినుంచో ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. ఫైనల్లి త్రివిక్రమ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడట. తారక్ మురుగన్ సినిమాలో సమంత హీరోయిన్గా నటించనుందని తెలుస్తుంది. మరి ఇందులో వాస్తవం ఎంత తెలియాలంటే అఫీషియల్ గా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.