కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అందులో వంటలక్క పాత్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అస్సలు సీరియల్ అంటే నచ్చని వారికి కూడా కార్తీకదీపం అంటే ఎంతో ఆసక్తిగా చూసేవారు. తెలుగు రాష్ట్రంలో కార్తీకదీపం సీరియల్ ఓ రేంజ్ లో పాపులర్ అయింది. ఫ్యామిలీ స్టోరీ గా తెరమీదకు వచ్చిన ఈ సీరియల్… ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక డాక్టర్ బాబు దీప ఎమోషనల్ సీన్స్ కనిపించినప్పుడు.. ప్రేక్షకులు కన్నీళ్లు సైతం పెట్టుకునేవారు. ఇక ఈ సీరియల్‌లో వంటలక్క, డాక్టర్ బాబు పిల్లలుగా హిమ, శౌర్య నటించిన మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. హేమ పేరు బేబీ సహృద. రియల్ లైఫ్ లో కూడా ఈమె ఎన్నో విషాదాలను చూసింది.
ఒకసారి తన పర్సనల్ విషయాలను చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక శౌర్య అసలు పేరు కృతిక. ఇక ఈమె తన స్టడీస్ పై ఫోకస్ పెట్టడంతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అలాగే పలు కార్యక్రమాలకి సైతం హాజరయ్యి.. సందడి చేస్తుంది. ఇలా వీరి రీల్ లైఫ్ లోనే కాకుండా.. రియల్ లైఫ్ లో కూడా సందడి చేస్తూ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.