‘ నీకోసం ఎరైనా అవుతా, సొరైన అవుతా ‘ ఆసక్తి రేపుతున్న ‘ సలార్ ‘ ట్రైలర్..

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ సలార్‌. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సలార్ సంబంధించిన అప్డేట్స్ అయినా వస్తే చాలు అంటూ కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇది రెండు భాగాలుగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. సలార్‌ పార్ట్ వన్ సిజ్‌ఫైర్ పేరుతో ఈనెల 22న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో విడదీయలేని స్నేహం ఉండేది అంటూ ఓ పవర్ఫుల్ వాయిస్ మెకోవార్ తో ట్రైలర్ మొదలయింది.

ఆధ్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్లో దేవగా ప్రభాస్ కనిపించనుండగా.. అత‌డి ప్రాణ‌ మిత్రుడు వరదరాజు మన్నార్‌ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్‌ నటించబోతున్నారు. నీకోసం ఏదైనా అవుతా.. నీ ఒక్కడి కోసం.. నువ్వు ఎప్పుడు రమ్మన్నా అప్పుడు నీ దగ్గరకు వస్తా అంటూ ఈ ట్రైలర్ లో కనిపించిన వినిపించిన సంభాషణతో ఇది ఇద్దరు మిత్రుల కథగా అర్థమవుతుంది. ఈ ట్రైలర్ మొత్తం ఎంతో ఇంట్రెస్టింగ్ గా యాక్షన్ కోణంలో సాగింది. ఈ ట్రైలర్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా పెద్ద హైలెట్ గా చెప్పొచ్చు. అదేవిధంగా ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్ లు, విజువల్స్ ప్రతి ఒక్కటి ప్రశాంత్ నీల్‌ మార్కును చూపించాయి.

సినిమాలో ప్రభాస్ చెప్పిన ప్రతి ఒక్క సంభాషణ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. సినిమాపై మరిన్ని అంచనాలను పెంచే విధంగా మూవీ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటుంది. పెద్ద పెద్ద గోడలు కట్టేది భయపడి బయటకు ఎవడుపోతాడో అని కాదు.. లోపలికిఎవడోస్తాడో అని.. నిన్ను ఎవరు ముట్టుకోకూడదు అంటూ.. ప్రభాస్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చివ‌ర్లో ప్లీజ్ కైన్డ్‌లి రిక్వెస్ట్ అంటూ ప్రభాస్ పేల్చిన ఓ డైలాగ్ ట్రైలర్ కి మెయిన్ ఎట్రాక్షన్ గా చెప్పొచ్చు. ఈ సినిమాలో జగపతిబాబు, ఈశ్వర్‌ రావు, టీను ఆనంద్, బాబీ సింహా, గరుడ రామచంద్ర తదితరులు కీరోల్స్‌లో కనిపించారు. రవి బసృర్‌ సంగీతం అందించిన ఈ సినిమాకు భువన్ గౌడ సినిమా ఆటోగ్రాఫర్ గా పనిచేశాడు.