కేసీఆర్ ‘బీఆర్ఎస్’: బాబు లైట్..టీడీపీకి రిస్క్..!

తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ జాతీయ పార్టీ ప్రభావం ఏపీలో ఉంటుందా? తెలంగాణలో టీడీపీని లేకుండా చేసిన కేసీఆర్..ఏపీలో కూడా టీడీపీని దెబ్బకొట్టగలరా? అంటే అబ్బే కష్టమే అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణలో రాజకీయ పరిస్తితులు వేరు..ఏపీలో వేరు. రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు పూర్తిగా ఏపీపై ఫోకస్ పెట్టడం, తెలంగాణని సరిగ్గా పట్టించుకోవడం..అక్కడ పరిస్తితులని ఉపయోగించుకుని కేసీఆర్..టీడీపీని లేకుండా చేశారు.

ఇప్పుడు టీఆర్ఎస్‌ని కాస్త బీఆర్ఎస్ గా మార్చి..జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి రెడీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ బలపడాలి. ఇదే క్రమంలో పక్కనే ఉన్న ఏపీలో బలపడేలా కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటన రాగానే, ఏపీలో కొన్ని చోట్ల కేసీఆర్‌కు మద్ధతుగా కొత్త పార్టీకి స్వాగతం పలికారు. అలాగే ఏపీలో బలపడటానికి కేసీఆర్..టీడీపీని టార్గెట్ చేశారని..గత రెండు, మూడు రోజుల నుంచి కథనాలు వస్తున్నాయి.

టీడీపీలో యాక్టివ్‌గా లేని వారు, సీటు దక్కని వారు, కేసీఆర్‌తో సన్నిహితంగా ఉండే టీడీపీ నేతలని బీఆర్ఎస్‌లో చేర్చుకుని, అక్కడ కూడా రాజకీయం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని తెలుస్తోంది. అంటే ఏపీలో కూడా టీడీపీనే కేసీఆర్ టార్గెట్ చేయనున్నారు. తెలంగాణలో ఎలాగో టీడీపీ పూర్తి బలాన్ని టీఆర్ఎస్‌కు వచ్చేలా చేసుకున్నారు. ఇప్పుడు ఏపీలో టీడీపీ బలాన్ని బీఆర్ఎస్‌కు వచ్చేలా చేయాలని చూస్తున్నారు.

అయితే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై చంద్రబాబు స్పందించలేదు. మీడియా వాళ్ళు అడిగిన ఒక నవ్వు నవ్వి వదిలేశారు. అంటే కేసీఆర్ జాతీయ పార్టీని లైట్ తీసుకుంటున్నారని అర్ధమవుతుంది. రాజకీయ వ్యూహాలు వేయడంలో ధిట్టగా ఉన్న కేసీఆర్‌ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పైగా ఆర్ధికంగా, రాజకీయంగా బలంగా ఉన్నారు..కాబట్టి కేసీఆర్ పార్టీ వైపు ఆకర్షితులై నాయకులు ఉండొచ్చు. మరి చూడాలి ఏపీలో కేసీఆర్ ప్రభావం ఎంతవరకు ఉంటుందో.