ఏ.పీ.సర్కార్ కి షాక్ ఇచ్చిన హైకోర్ట్ ..?

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు పెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చే తీర్పును వెల్లడించింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం మూడు రాజధానులు పెట్టాలా వద్దా అని నేపథ్యంలో కేసు నడుస్తుండగానే, దీని విచారణ పూర్తయ్యేవరకు ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేయడంతో ఈ వ్యాఖ్యలు కాస్త ఆసక్తికరంగా మారాయి.

అంతేకాదు రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ కార్యాలయాలను డైరెక్ట్ గా కర్నూలు కాకుండా విజయవాడకు తీసుకురావాలని పేర్కొనడం గమనార్హం. ఇక తాజాగా హైకోర్టు వెల్లడించిన ఆదేశాలను బట్టి చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం , కోర్టులో కేసు చివరి దశకు చేరుకునే వరకు ఎలాంటి పనులు చేయకూడదు అని స్పష్టం గా తెలుస్తోంది.

విభజన సమయంలో హైదరాబాద్ లోనే ఉండిపోయి, అలాగే ఏపీకి రాని కొన్ని కార్యాలయాలు ఎందుకు రాలేదు అంటూ హైకోర్టు ప్రశ్నించగా.. దానికి సమాధానంగా.. తాజాగా మానవ హక్కుల సంఘం.. లోకాయుక్త కార్యాలయాన్ని ఏపీకి తరలించే ప్రయత్నాన్ని జగన్ సర్కారు తీసుకుంది.. ఇక దీనికి సంబంధించి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయా కార్యాలయాలను , న్యాయ రాజధానిగా నిర్ణయించిన కర్నూలుకు తరలిస్తూ , ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుని, . దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్లను జారీ చేసింది.

అయితే కొన్ని కార్యాలయాలకు సంబంధించిన వ్యక్తులు హైకోర్టులో కేసు వేయడంతో హైకోర్టు, మూడు రాజధానులు సమస్య తేలేవరకు ఎవరూ ఎటువంటి కార్యాలయాలను ఎక్కడికి తరలించవద్దని , ఒకవేళ తరలించాల్సి వస్తే విజయవాడ కు తరలించాలని చెప్పింది. అంతే కాదు కచ్చితంగా ఈ కేసు చివరి దశకు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలంటూ జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు.