“ఆ విషయంలో నేను ఎప్పటికీ చిరంజీవిలా చేయలేను”.. రజినీకాంత్ అంత మాట అనేసాడు ఏంటి..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత గౌరవం ఉందో అదేవిధంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే అంతే గౌరవం ఉంటుంది . మనకి మెగాస్టార్ చిరంజీవి అంటే ఎలాగనో కోలీవుడ్ జనాలకి రజనీకాంత్ అంటే అలాగా .. ఇద్దరికీ ఇద్దరే ఏమాత్రం తీసి పడేయలేము ఎటువంటి రోల్ ని అయినా అవలీలగా నటించిన మెప్పించగలరు మెగాస్టార్ చిరంజీవి . అదేవిధంగా రజినీకాంత్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలను చేస్తూ జనాలలో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు.

ఇద్దరు కూడా ఇండస్ట్రీలో సపోర్ట్ లేకుండానే వచ్చి తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకోవడమే కాకుండా తమ పేరు చెప్పుకొని మరి పదిమంది ఇండస్ట్రీలోకి వచ్చే విధంగా చేసుకున్నారు. అయితే ఒకానొక ఇంటర్వ్యూలో రజనీకాంత్ మాట్లాడుతూ ..”చిరంజీవి గారి విషయాలలో అన్నిటికీ నేను పోటీ ఇవ్వగలను.. కానీ డాన్స్ విషయంలో మాత్రం ఆయనలా నేను చేయలేను.. ఆయన బాడీని స్ప్రింగ్ లా మెలికలు తిప్పేస్తూ ఉంటాడు”

” అంత స్టైల్ నేను ఫాలో అవ్వలేను ..అలాంటి స్టెప్స్ వేయలేను .. నా వరకు ఎంత వచ్చు అంటే అంతే వేయగలను .. డాన్స్ విషయంలో చిరంజీవిని బీట్ చేసే వాళ్ళు ఇప్పటివరకు ఎవ్వరూ లేరు “అంటూ ఓపెన్ గా మాట్లాడేశారు. నిజానికి ఏ స్టార్ హీరో కూడా ఈ విధంగా తనలోని మైనస్ ని బయటకు చెప్పుకోరు . కానీ రజనీకాంత్ మాత్రం చెప్పేసాడు. అందుకే ఆయనంటే కోలీవుడ్ జనాలకి అంత ఇష్టం..!!