పిల్లలకు యాపిల్ తినిపిస్తున్నారా అయితే జాగ్రత్త.. ప్రాణాలకే ప్రమాదమట..

ప్రతిరోజు ఒక యాపిల్ తినడం వల్ల డాక్టర్‌కు దూరంగా ఉంటారు అని మన చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఇది నిపుణులే కాదు పెద్దవారు కూడా చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేస్తారు. ప్రతిరోజు యాపిల్ తింటే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు, ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవచ్చు అన్న ఉద్దేశంతో పిల్లలకు కూడా యాపిల్ తిన‌టం అలవాటు చేస్తూ ఉంటారు. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా యాపిల్‌నే ఎక్కువగా తినమని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఇక చాలామంది పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి యాపిల్‌ను తమ ఫేవరెట్ ఫ్రూట్ గా ఇష్టపడి తింటూ ఉంటారు. యాపిల్స్ ఎక్కువ రేటు ఉన్నా కూడా దాదాపు అంతా అవే తినేందుకు ఆసక్తి చూపుతారు.

అయితే ఆపిల్స్ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. పొరపాటున దానిలోని గింజలు తినడం వల్ల అంతే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు వివరిస్తున్నారు. యాపిల్ గింజలు పొరపాటున తింటే ప్రమాదమా ఏంటి.. ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. యాపిల్ లో ఉండే విత్తనాల్లో విషతుల్యంగా ఉండే సైనైడ్ ఉంటుందట. యాపిల్‌లో ఉండే విత్తనాలను.. ఒకటి, రెండు ఎప్పుడైనా ఒక్కసారి తిన్నా పర్వాలేదు కానీ.. అంతకంటే ఎక్కువగా ఆపిల్ గింజలు మన శరీరంలోకి వెళ్లడం వల్ల చనిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు.

ఒక సర్వే ప్రకారం 60 కేజీల బరువు ఉండే 40 ఏళ్ల వ్యక్తి 150 నుంచి 175 యాపిల్ విత్తనాలు తినడం వల్ల చనిపోయార‌ట. అదే పదేళ్ల లోపు పిల్లలైతే కనీసం 50లోపు గింజలు తిన్న చనిపోతారని డాక్టర్స్ చెప్తున్నారు. అందుకే పిల్లలకు యాపిల్స్ తినిపించాలి అంటే ఎంత జాగ్రత్తగా ఉండమని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు తల్లిదండ్రులు యాపిల్స్ ఇచ్చిన సమయంలో విత్తనాలు లేకుండా చేయాల్సి ఉంటుంది. ఏం కాదులే అనుకుంటే మాత్రం భవిష్యత్తులో పిల్లల విషయంలో ఎన్నో ప్రమాదాలను చూడాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.